హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: భూమా ఫ్యామిలీని టార్గెట్ చేసిన సీఎం జగన్... పాతికేళ్ల ఆధిపత్యానికి చెక్

Andhra Pradesh: భూమా ఫ్యామిలీని టార్గెట్ చేసిన సీఎం జగన్... పాతికేళ్ల ఆధిపత్యానికి చెక్

భూమా అఖిలప్రియ (ఫైల్ ఫోటో)

భూమా అఖిలప్రియ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో భూమా కుటుంబానికి (Bhuma Family) పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో ఆ కుటుంబానిది దశాబ్ధాల ఆధిపత్యం. ఐతే సీఎం జగన్ (YS Jaganmohanreddy) టార్గెట్ తో సొంత జిల్లాలో భూమా ఫ్యామిలీకి చెక్ పడబోతోంది.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భూమా కుటుంబానికి పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో ఆ కుటుంబానిది దశాబ్ధాల ఆధిపత్యం. ఐతే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి అకాల మరణంలో సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం అఖిలప్రియ నేతృత్వంలోని నడుస్తున్న భూమా ఫ్యామిలీకి ఏదీ కలిసిరావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత భూమా ఫ్యామిలీ కష్టాలు రెట్టింపయ్యాయి. ఇక హైదరాబాద్ బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ కుటుంబం అరెస్ట్ అయిన తర్వాత రాజకీయంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. పాతికేళ్లుగా కర్నూలు జిల్లాలో చక్రం తిప్పిన భూమా ఫ్యామిలీ ఆధిపత్యానికి గండిపడుతోంది. ఇప్పుటు 25 ఏళ్లుగా భూమా ఫ్యామిలీ చేతుల్లో ఉన్న కర్నూలు విజయా డెయిరీ వారి చేజారిపోతోంది.

కర్నూలు జిల్లా నంద్యాలలో ఉన్న విజయా డెయిరీకి ఛైర్మన్ పదవి 25 ఏళ్లుగా భూమా కుటుంబం చేతుల్లోనే ఉంది. గతంలో భూమా నాగిరెడ్డి చిన్నాన్న భూమా నారాయణ రెడ్డి ఛైర్మన్ గా ఉన్నారు. అసలు ఎన్నిక అనేదే లేకుండా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఐతే రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండటం, టీడీపీ తరపున పోటీ చేసిన భూమా కుటుంబం ఓడిపోవడంతో ఇప్పుడు డెయిరీపై ఆధిపత్యం కూడా ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లింది. విజయ డెయిరీ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు ఆదేశించడంతో ఇక్కడ పోటీ అనివార్యమైంది.

ప్రస్తుతం వైసీపీ తరపున భూమా అఖిలప్రియ మేనమా ఎస్వీఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నంద్యాల డెయిరీలో అవినీతి జరుగుతోందని గత పదేళ్లుగా కోట్లాది రూపాయలు దారి మళ్లించారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఛైర్మన్ నారాయణ రెడ్డి వృద్ధ్యాప్యం కారణంగా చురుగ్గా లేకపోవడంతో భూమా కుటుంబం అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. అంతేకాదు జగత్ డెయిరీ పేరుతో కొత్త డెయిరీని ప్రారంభించి అక్కడి నుంచి పాలు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. భూమా కుటుంబానికి చెందిన ఓ డైరెక్టర్.. ఛైర్మన్ స్థానంలో అన్ని కార్యకలాపాలు చక్కబెడుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.

ఎన్నికల హడావిడి జరుగుతుండగానే భూమా కుటుంబంపై కిడ్నాప్ కేసు నమోదైంది. నంద్యాల డెయిరీ ఎన్నికల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, భూమా నారాయణ రెడ్డితో పాటు పలువురిపై డైరెక్టర్ గా పోటీ చేస్తున్న మల్లికార్జున్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాదికి 140 కోట్ల టర్నోవర్ ఉన్న విజయా డెయిరీ ఎన్నికల ఫలితాలు ఇవాళ సాయంత్రానికి వెలువడనున్నాయి. వైసీపీ బలపరిచిన ఎస్వీ జగన్మోహన్ రెడ్డి గెలుపు దాదాపు ఖాయమైంది.

First published:

Tags: Ap cm ys jagan mohan reddy, AP Politics, Bhuma Akhilapriya, Kurnool, Rayalaseema

ఉత్తమ కథలు