ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇవాళ జగనన్న విద్యా దీవెన పథకం (jagananna vidya deevena scheme) కింద... రూ.698.68 కోట్లను విడుదల చేయనుంది. ఈ మనీ... 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో ఇవాళ జమ అవుతుంది. ఈ మనీ... 2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ (3 నెలలు) త్రైమాసికానికి సంబంధించినవి. ఈ మనీని ఇవాళ సీఎం జగన్ మోహన్ రెడ్డి... ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో... కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా రిలీజ్ చేస్తారు. ఈ డబ్బును విద్యార్థుల తల్లిదండ్రులు... సంబంధింత త్రైమాసికానికి ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కింద... ప్రతీ త్రైమాసికం ముగిసిన తర్వాత ప్రభుత్వం నిధులు ఇస్తోంది.
సీఎం వైఎస్ జగన్ తిరువూరు టూర్:
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా లోని తిరువూరుకు వెళ్తున్నారు. షెడ్యూల్ గమనిస్తే.. ఇవాళ తాడేపల్లి లోని తన ఇంటి నుంచి బయలుదేరి... ఉదయం 10.35కి తిరువూరులోని వాహిని ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తారు. ఉదయం 11 నుంచి 12.30 వరకు మార్కెట్ యార్డ్ దగ్గర్లో రెడీ చేసిన బహిరంగ సభలో పాల్గొంచారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులు విడుదల చేస్తారు. తర్వాత విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ కార్యక్రమం తర్వాత తిరిగి తాడేపల్లి లోని ఇంటికి వెళ్తారు.
Jvd Quarter *October - December 2022* under "Jagananna Vidya Deevena" on 19-03-2023 Sunday at 11:00 AM *Tomorrow*https://t.co/kFPPkYl7d3 #jvd pic.twitter.com/sgObbzqQvX
— chandra peela (@chandra_peela) March 18, 2023
పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఐటీఐ, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు... కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులను జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద కింద ప్రభుత్వం చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంత మంది చదువుతూ ఉంటే.. అంత మందికీ ఈ పథకాలను అమలుచేస్తోంది. ఇలా ఇప్పటివరకూ ప్రభుత్వం రూ.13,311 కోట్లు ఇచ్చింది.
జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం... పేద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు,... డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు చేసే విద్యార్థులకు రూ.20 వేల చొప్పున ప్రతి సంవత్సరం రెండు వాయిదాలలో చెల్లిస్తోంది. ఈ డబ్బును విద్యార్థులు భోజన, హాస్టల్ ఖర్చుల కోసం వాడుకుంటున్నారు. ఐతే.. ఈ డబ్బును ప్రభుత్వం.. డైరెక్టుగా ఇవ్వకుండా.. తల్లుల బ్యాంక్ అకౌంట్లలో వేస్తోంది. తద్వారా తల్లులు.. తమ పిల్లల విద్య పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా... పూర్తి అవగాహన కూడా కలిగివుండేందుకు వీలవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.