హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan Odisha Tour: ఒడిశా వెళ్లనున్న సీఎం జగన్.. అజెండా ఇదే..!

YS Jagan Odisha Tour: ఒడిశా వెళ్లనున్న సీఎం జగన్.. అజెండా ఇదే..!

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కీలక ప్రాజెక్టుల పూర్తిపై రాష్ట్రప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YSJagan mohan Reddy) ఈనెల 8న ఒడిశాలో (Odisha) పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కీలక ప్రాజెక్టుల పూర్తిపై రాష్ట్రప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YSJagan mohan Reddy) ఈనెల 9న ఒడిశాలో (Odisha) పర్యటించనున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Oisha CM Naveen Patnayak) తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించనున్నారు. ముఖ్యగా జలవివాదాల పరిష్కారంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. వంశధార నదిపై నిర్మిస్తున్న నేరడి బ్యారేజ్ పూర్తి చేయడానికి ఒడిశా ప్రభుత్వ సహకారాన్ని కోరనున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. జగన్ తన పర్యటనలో ఒడిశా సీఎంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను కలవనున్నారు.

వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణంతో శ్రీకాకుళం, ఒడిశాలోని గజపతి జిల్లాకు మేలని ఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని.. బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని గతంలో రాసిన లేఖలో సీఎం జగన్.. నవీన్ పట్నాయక్‌ ను కోరారు. ఆ క్రమంలో జగన్ ఒడిశా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిశా ప్రభుత్వం తొలి నుంచి అభ్యంతరాలు తెలుపుతోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని ఒడిశా వాదిస్తోంది. నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా ఒడిశా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

ఇది చదవండి: భర్తకు పోటీగా బరిలో దిగిన ఎమ్మెల్యే రోజా.. కబడ్డీ కోర్టులో అదరగొట్టిన ఫైర్ బ్రాండ్..


గోదావరికి గరిష్టంగా వరద వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు సీలేరు, శబరి నదికి ఎగదన్ని తమ రాష్ట్రంలోని అధికభాగం ముంపుకు గురయ్యే అవకాశముందని ఒడిశా ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల ముపు ప్రభావంపైఅధ్యయంన ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన కేంద్ర పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో ఒడిశా స్పష్టం చేసింది. ఐతే ఒడిశా ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. పోలవరం స్పిల్ వే నుంచి 50లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసే అవకాశముందని తెలిపింది. అలాగే వచ్చేఏడాది ప్రాజెక్టుల 41.15 మీటర్ల నీరు నిల్వఉంచే అవకాశమున్నందున బ్యాక్ వాటర్ ముప్పు ఉండదని ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇక పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం సీలేరి, శబరి నదుల కరకట్టలపై ప్రభావం చూపకుండా కరకట్టల నిర్మాణానికి కేంద్రం సిద్ధమవుతోంది. ఒడిశాలో రూ.378 కోట్లతో 30 కిలోమీటర్లు, ఛత్తీస్ గఢ్ లో రూ.332 కోట్లతో 29 కిలోమీటర్ల మేర కరకట్టలు నిర్మించనున్నారు.

ఇది చదవండి: ఆ విషయంలో పవనే కరెక్ట్.. జగన్ కు మేటర్ అర్ధం కావడంలేదన్న రఘురామ..!


రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల విషయంలో ఇప్పటివరకు చోటు చేసుకున్న వివాదాలు, వాటికి పరిష్కార మార్గాలు తదితర అంశాలపై సీఎం జగన్.. నవీన్ పట్నాయక్ తో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచించిన అంశాలు కూడా చర్చకురానున్నాయి. వచ్చేఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో సీఎం ఒడిశా పర్యటన ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Naveen Patnaik, Odisha, Polavaram

ఉత్తమ కథలు