హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan on Parishat Elections: పరిషత్ ఫలితాలపై స్పందించిన జగన్.. వారికి స్ట్రాంగ్ కౌంటర్

YS Jagan on Parishat Elections: పరిషత్ ఫలితాలపై స్పందించిన జగన్.. వారికి స్ట్రాంగ్ కౌంటర్

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో (ZPTC, MPTC Elections) అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) సాధించిన విజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) స్పందించారు. తన ప్రసంగంలో భాగంగా ప్రతిపక్ష పార్టీతో పాటు కొన్ని మీడియా సంస్థలపైనా జగన్ విమర్శలు చేశారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో (ZPTC, MPTC Elections) అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) సాధించిన విజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan reddy) స్పందించారు. తన ప్రసంగంలో భాగంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో (Telugu Desham Party)  పాటు కొన్ని మీడియా సంస్థలపైనా జగన్ విమర్శలు చేశారు. ఘనవిజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు సీట్లతో ప్రజలు ఆశీర్వదించారని జగన్ అన్నారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో 13వేలకు పైచిలుకు పంచాయతీలకు గానూ 10536 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులను గెలిపించారన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో 75 మున్సిపాలిటీల్లో 74 చోట్ల విజయం సాధించాం. అలాగే 12 కార్పొరేషన్లకు గానూ 12 గెలుచుకున్నామని.. ఇదంతా ప్రజల ఆశీర్వాదమేనని జగన్ అభివర్ణించారు. జడ్పీటీసీ, ఎంపీటి ఎన్నికల ఫలితాల్లోనూ వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిందని సీఎం తెలిపారు. 9,583 ఎంపీటీసీలకుగానూ.. 8,249 ఎంపీటీసులు గెలిచాం.. 638 జడ్పీటీసీలకు 628 జెడ్పీటీసీలు కైవసం చేసుకున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు తమ ఆప్యాయతలు, ప్రేమానురాగాలతో ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారని జగన్ అభిప్రాయపడ్డారు. రెండున్నరేళ్లలో మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హమీలను అమలు చేశామని.. అందుకు దక్కిన ప్రతిఫలమే ఇదని చెప్పారు.

ఇది చదవండి: చంద్రబాబు కంచుకోటకు బీటలు... కుప్పంలో జెండాపాతిన వైసీపీ...



అదే వారి లక్ష్యం

ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఓ వైపు కొవిడ్.. మరోవైపు దుష్ప్రచారాల నడుమ పాలన సాగిస్తున్నామని జగన్ అన్నారు. అబద్ధాలను నిజం చేయడానికి కొన్ని కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నారన్నారు. వారికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి.. ప్రస్తుతం సీఎంను దించేయాలని యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలకు వక్ర భాష్యాలు చెబుతున్నారని జగన్ విమర్శించారు.


ఇది చదవండి: వైన్ షాపులో చల్లని బీరు కావాలి.. ఓటుతో పాటు మందుబాబుల లెటర్ వైరల్...


80శాతానికి పైగానే...

2019 ఎన్నికల్లో 86శాతం, పంచాయతీ ఎన్నికల్లో 80శాతానికి పైగా, మున్సిపల్ ఎన్నికల్లో 99 శాతం, 100శాతం, పరిషత్ ఎన్నికల్లో 86, 98శాతంతో విజయం సాధించామని చెప్పారు. వైసీపీ గెలుపును జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. పార్టీ గుర్తుతో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని దీవిస్తే.. దానికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

ఇది చదవండి: వైసీపీలో ఇద్దరి యువనాయకుల మధ్య ఆధిపత్య పోరు... జగన్ కు తలనొప్పిగా మారిన వ్యవహారం



ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్రలు

ఎన్నికలను అడ్డుకునేందుకు నానా ప్రయత్నాలు చేశారు. కోర్టుకు వెళ్లి ఎన్నికలు అడ్డుకున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఆరు నెలల పాటు ఫలితాలు వాయిదా పడేలా చేశారు. ఏడాదిన్నర క్రితమే ఎన్నికలు జరిగి ఉంటే గెలిచిన అభ్యర్థులు కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండేవారని జగన్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి అండగా నిలబడ్డ ప్రజలకు రుణపడి ఉంటామని జగన్ తెలిపారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరింత భాధ్యతగా పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap local body elections, AP Politics

ఉత్తమ కథలు