హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSR Asara Scheme: వైఎస్ఆర్ ఆసరా రెండో విడతకు సీఎం జగన్ శ్రీకారం.. ఆ ఒక్క జిల్లాలో మాత్రం బ్రేక్..

YSR Asara Scheme: వైఎస్ఆర్ ఆసరా రెండో విడతకు సీఎం జగన్ శ్రీకారం.. ఆ ఒక్క జిల్లాలో మాత్రం బ్రేక్..

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వైఎస్ఆర్ ఆసరా పథకం (YSR Asara Scheme) రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రారంభించారు. ప్రకాశం జిల్లా (Prakasham District) ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్ఆర్ ఆసరా పథకం (YSR Asara Scheme) రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రారంభించారు. ప్రకాశం జిల్లా (Prakasham District) ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ ఆసరా ద్వారా నేరుగా లబ్ధిదారులకు డబ్బులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం గురువారం నుంచి ఈనెల 18 వరకు కొనసాగుతుందని.. ప్రతి ఒక్క ప్రజాప్రతనిథి ఇందులో పాలు పంచుకుంటారన్నారు. 13వ, 15వ తేదీల్లో పండుగ సందర్భంగా మినహాయిస్తున్నట్లు తెలిపారు. 18 తేదీలోపు అందరికీ డబ్బులు వేస్తామన్నారు. కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక (Badvel By Election) కారణంగా.. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నవంబర్ 6 నుంచి 15వ తేదీ వరకు జరుగుతుందని జగన్ తెలిపారు.

రాష్ట్రంలోని 7.97 లక్షల పొదుపు సంఘాల్లోని 78.76లక్షల మంది మహిళలకు 2019 ఏప్రిల్ వరకు వారు చెల్లించాల్సిన మొత్తం రూ.25,515 కోట్లను నాలుగు విడతల్లో వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. వరుసగా రెండో ఏడాది 6,440 కోట్లను పొదుపు సంఘలకు ఇస్తున్నట్లు వెల్లడించారు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జగన్ తెలిపారు.

ఇది చదవండి: అభిమాని కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పిన తారక్..


స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మిన మహిళలు ఆయన్ను సీఎంను చేశారని.. కానీ చంద్రబాబు మాత్రం మహిళలను మోసం చేశారని జగన్ విరమ్శించారు. చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించని కారణంగా బ్యాంకుల్లో వడ్డీలు పెరిగి రూ.14వేల కోట్లుగా ఉన్న రుణాలు 2019 ఎన్నికల నాటికి రూ.25,517కోట్లకు పెరిందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 18.3శాతం పొదుపు సంఘాలు మూతబడగా.. మిగిలిన సంఘాల పరపతి దెబ్బతిందన్నని జగన్ విమర్శించారు. మాజీ సీఎం చేసిన వంచన వల్ల మహిళలు రూ.3వేల కోట్లకు పైగా బ్యాంకులకు అధనంగా చెల్లించాల్సి వచ్చిందని ఆరోపించారు. అలాగే గత ప్రభుత్వం సున్నావడ్డీ రుణపథకాన్ని కూడా రద్దుచేశారన్నారు.

ఇది చదవండి: మా ఎన్నికల్లో రాజకీయ పార్టీల హస్తం నిజమేనా... వారి ప్రకటనల్లో నిజమెంత..?


పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 2019 ఏప్రిల్ నాటికి మహిళా సంఘాలకు ఉన్న అప్పులన్నీ తిరిగి కడుతున్నామన్నామని సీఎం జగన్ వివరించారు. ఆ మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేలా వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. మొదటి విడతలో 6,318 కోట్లు, రెండో విడతలో 6,440 కోట్లు రెండేళ్లలో 12,758 కోట్లు మహిళలకు ఇస్తున్నట్లు తెలిపు. అలాగే వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం కింద సకాలంలో రుణాలు తిరిగి తెల్లించిన 9లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.2,362కోట్లు ఇచ్చామన్నారు.

ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీపై సంచలన ఆరోపణలు... సీఎం జగన్ కు కార్యకర్త ఫిర్యాదు


పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నికల్లో వచ్చిన విజయాలే ప్రభుత్వ పనితీరుకు వస్తున్న ఆదరణ అని జగన్ అన్నారు. మహిళలు ఆర్ధికాభివృద్ధి కోసం వైఎస్ఆర్ చేయూత సాయంతో పాటు సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్, శిక్షణ వంటి సహకారాలు అందిస్తూ జీవనోపాధి కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. ఇందుకోసం పలు ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap welfare schemes

ఉత్తమ కథలు