Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH CM YS JAGAN MOHAN REDDY AND SISTER YS SHARMILA WILL GO IDUPULAPAYA TOMORROW NGS

CM Jagan-YS Sharmila: మళ్లీ కలుస్తున్న సీఎం జగన్-షర్మిల.. ఇడుపులపాయలో వైఎస్ ఫ్యామిలీ సమావేశం

సీఎం జగన్, వైఎస్ షర్మిల (File)

సీఎం జగన్, వైఎస్ షర్మిల (File)

CM Jagan-YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మళ్లీ అన్న సీఎం జగన్- చెల్లి వైఎస్ షర్మిల కలవనున్నారు. ఇడుపుల పాయలో వైఎస్ కుటుంబం అంతా సమావేశం కానుంది. దీంతో ఎనిమిదవ తేదీ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంకా చదవండి ...
    CM Jagan - YS Sharmila: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. సొంత జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు తన సొంత నియోజకవర్గం పులివెందుల (Pulivendula) చేరుకోనున్నారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు సాయంత్రం 5.15కు ఇడుపులపాయ చేరుకుంటారు. 5.20కి హెలీప్యాడ్‌ నుంచి బయలుదేరి 5.25కు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. మరోవైపు ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న సీఎం జగన్ సోదరి షర్మిల (YS Sharmila)..తల్లి విజయమ్మ (Vijayamma) సైతం ఇడుపుల పాయకు రానున్నట్లు సమాచారం. ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జన్మదినం. దీంతో రేపు సాయంత్రానికి అంతా ఇడుపులపాయ చేరుకుంటారు. వైఎస్సార్ ఎస్టేట్స్ కు ఫ్యామిలీ మొత్తం షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన సమయం..నుంచీ వైఎస్సార్ జన్మదినం - వర్దంతి నాడు ఇడుపులపాయలో వీరిద్దరు  రావటం.. కలుసుకోవటం.. కానీ మాట మాట కలవడం లేదు.   చాలాకాలంగా అన్న చెల్లి మధ్య గ్యాప్ ఉంది.. ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్న సందర్భం కూడా లేదు.. ఆఖరికి రక్షాబంధన్ రోజు సైతం.. అన్నయ్యకు షర్మిల రాఖీ కట్టలేదు.. దీంతో మరోసారి వీరిద్దరి కలియిక ఆసక్తి పెంచుతోంది.

    మరోవైపు సీఎం జగన్ 8వ తేదీ ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 8.05కు వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకొని దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నివాళులు అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. 8.45కు వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి బయలుదేరి 8.50కు ఇడుపులపాయలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 8.55కు హెలీకాప్టర్‌లో బయలుదేరి 9.10కి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. గతేడాది ఇదే విధంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వైఎస్సార్ కు నివాళి అర్పించి.. ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా కలిసే నివాళి అర్పించనున్నట్లు తెలుస్తోంది.



    విజయమ్మ పార్టీ ప్లీనరీకి హాజర పైన కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. ఒక దశలో వైసీపీ గౌరవాధ్యక్ష పదవి వీడటానికి సైతం విజయమ్మ సిద్దం అయ్యారనే ప్రచారం సాగింది. పార్టీ బైలాస్ లోనూ మార్పుల దిశగా కానీ, ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ తో పాటుగానే విజయమ్మ సైతం పార్టీ ప్లీనరీ ప్రారంభోవత్సవ సభకు హాజరు కానున్నారు. ఇప్పటికు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయ్యింది. 2017 లో జరిగిన ప్లీనరీలో విజయమ్మతో పాటుగా షర్మిల -పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం హాజరయ్యారు.

    ఇదీ చదవండి : ఫుడ్ లవర్స్ కు సరికొత్త అనుభూతి.. కలర్‌ఫుల్‌ చేపల మధ్య కూర్చుని టేస్ట్ ఎంజాయ్‌ చేయోచ్చు.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

    ఈ సారి పార్టీ ప్లీనరీ వేదికగా పార్టీ రాజ్యాంగానికి సంబంధించి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తున్నట్లుగా సమాచారం. శాశ్వత గౌరవాధ్యక్షురాలు..శాశ్వత అధ్యక్షుడు హోదాలో ఈ రెండు పదవులను ఖరారు చేస్తూ పార్టీ బైలాస్ లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు నేతలు చెబుతున్నారు. ఇప్పుడు మరోసారి ఇడుపుల పాయలో వైఎస్సార్ కుటుంబం ఒక్కటిగా కనిపించనుండటం ఆసక్తి కరంగా మారనుంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, YS Sharmila

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు