హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan Visakha Tour: సీఎం జగన్‌ విశాఖ పర్యటన.. వారి ఖాతాలోకి నగదు.. అర్హులు ఎవరంటే?

CM Jagan Visakha Tour: సీఎం జగన్‌ విశాఖ పర్యటన.. వారి ఖాతాలోకి నగదు.. అర్హులు ఎవరంటే?

ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్

CM Jagan Mohan Reddy Vizag Tour: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఈ బుధవారం విశాఖలో పర్యటించనున్నారు.. అక్కడే వాహనమిత్ర లబ్ధి దారులకు నగదు విడుదల చేయనున్నారు. అయితే ఈ పథకానికి అర్హతలు ఏంటంటే..?

  CM Jagan Vizag Tour : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government)  సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోంది. ఇక ఏడాది వరుసగా సంక్షేమ పథకాలకు విడుదల చేస్తున్నారు  సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. విద్యార్థుల కోసం.. అమ్మఒడి (Ammavodi).. తాజాగా విద్యాకానుక (Vidyakanuka)లను పేదలకు అందించిన సీఎం జగన్ (CM Jagan).. మరో సంక్షేమ పథకం కోసం  నగదు జమ చేయనున్నారు. ఏపీలోని పేద డ్రైవర్ల కోసం వాహనమిత్ర  (Vahana Mitra) పథకం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు  10వేల రూపాయల ఆర్థిక సాయం  అందిచనున్నారు. సీఎం జగన్ విశాఖ పర్యటనలో ఈ పథకానికి నగదు వర్చువల్ గా విడుదల చేయనున్నారు.

  విశాఖకు సంబంధించి సీఎం పర్యటన ఖరారైంది. ఈ నెల 13వ తేదీన అంటే బుధ‌వారం విశాఖ‌ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌ర్య‌ట‌నకు సంబంధించిన వివ‌రాల‌ను సీఎం కార్యాల‌యం వెల్ల‌డించింది. 13న ఉదయం 10.30 గంటలకు విశాఖ ప‌ట్ట‌ణం విమానాశ్రయానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేరుకుంటారు. ఉద‌యం 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 11.05 నుంచి 11.15 గంటల వరకు స్టాళ్లను సందర్శిస్తారు. 

  తరువాత వైఎస్సార్‌ వాహన మిత్ర ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. ఆ వెంటనే వైఎస్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫొటో సెషన్‌ జరుగుతుంది. 11.40 గంటల నుంచి 11.45 గంటల వరకు లబ్ధిదారుల ప్రసంగాలు ఉంటాయి. ఉద‌యం 11.45 నుంచి 11.47 గంటల వరకు వాహన మిత్ర అంశంపై వీడియో ప్రదర్శన ఉంటుంది. 11.47 నుంచి మ‌ధ్యాహ్నం 12.17 గంటల వ‌ర‌కు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడతారు. మ‌ధ్యాహ్నం 12.20 నుంచి వైఎస్సార్‌ వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులు సీఎం చేతుల మీద‌గా పంపిణీ చేస్తారు. 12.30 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరుతారు. 12.55 గంటల నుంచి 1.15 గంటల వరకు స్థానిక నాయకులతో భేటీ అవుతారు. 1.20 గంటలకు గన్నవరం బయలుదేరుతారు.

  ఇదీ చదవండి : టీడీపీ లిస్టు సిద్ధం.. ముందస్తు"గా.. చంద్రబాబు దూకుడు.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వీరే..

  ఇక కొత్తగా వాహనాలు కొన్నవారు కూడా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయానికి అర్కోభులే.. ఇప్పటికే అర్హుల జాబితా ఫైనల్ అయ్యింది. వారికి 10 వేల రూపాయల సాయం అందించనుంది జగన్ ప్రభుత్వం. అయితే దీనికి కొన్న కండిషన్లు ఉన్నాయి.. ముఖ్యంగా వేరొక పథకంలో లబ్ది పొందుతున్న వారు, ప్రభుత్వ పించన్ పొందుతున్న వారు ఈ స్కీమ్ కి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం సహా ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు కూడా పథకానికి అనర్హులు. ఇప్పటికే లబ్ది పొందిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. జాబితాలో పేరున్న వారు వారి ఆటో, ట్యాక్సీతో ఫొటో దిగి వాలంటీర్ ద్వారా అప్ లోడ్ చేసిన వారిని మాత్రమే కొత్తవారిని ఫైనల్ చేశారు. వారందరికీ  ఈ నెల 13న విశాఖలో  సీఎం జగన్ వాహనమిత్ర పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేస్తారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes, Visakhapatnam

  ఉత్తమ కథలు