CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర కూడా సమయం లేకపోవడంతో.. మరింత దూకుడుగా వెళ్తున్నారు. సంచలన నిర్ణయాలతో అందరికీ మేలు చేయడమే లక్షంగా సమీక్షలు చేస్తున్నారు. మొన్నటి వరకు విద్య, వైద్య రంగాలపై ఫోకస్ పెట్టిన ఆయన.. తాజాగా రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ధాన్యం సేకరణ.. కొనుగోళ్లపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు కనీస మద్దతు ధర కన్నా.. ఒక్కపైసా తగ్గకూడదని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
రైతులకు మద్దతు ధర రావాలనే ఉద్దేశంతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. అలాగే రైతులకు మరో శుభవార్త (Good News to Farmers)కూడా చెప్పారు. ఇందు కోసం ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసివేశామన్నారు. ఖరీప్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు.
ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసివేశారు. అలాగే ఈ కొత్తవిధానం ఎలా అమలవుతున్నదీ గమనించుకుంటూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. చేయాల్సిన ధాన్యం సేకరణపై ముందస్తు అంచనాలు వేసుకుని, ఆ మేరకు ముందస్తుగానే గోనెసంచులు అందుబాటులోకి తీసుకురావాలి..
ఇదీ చదవండి : టీడీపీ ఎంపీల రాజీనామా..! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా..! కారణం ఇదే?
దీనికి సంబంధించి వెంటనే తగు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రవాణా, లేబర్ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌లో జవాబుదారీతనం ఉండాలన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ చెల్లింపులు ఉండాలని కోరారు. ఈ విధానాన్ని ఒకసారి పరిశీలించి.. రైతులకు మేలు చేసేలా మరింత మెరుగ్గా దీన్ని తీర్చిదిద్దాలని కోరారు. అలాగే రవాణా ఖర్చులు, గన్నీ బ్యాగుల ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తోందన్న విషయం రైతులకు తెలపాలనన్నారు. రైతులకు చేస్తున్న చెల్లింపులన్నీ కూడా అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో కార్పొరేషన్ నుంచి వారికి డబ్బు చేరేలా చర్యలు తీసుకోవాలి. ఈ చెల్లింపుల్లో అత్యంత పారదర్శకత తీసుకొచ్చినట్టవుతుందన్నారు. ధాన్యం సేకరణ కోసం తయారు చేసిన యాప్‌లో.. సిగ్నల్స్ సమస్యల కారణంగా అక్కడడక్కగా ఇబ్బందులు వచ్చే అవకాశాలంటాయి. ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదుచేసుకుని, సిగ్నల్ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లగానే ఆ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోకి లోడ్ అయ్యేలా మార్పులు చేసుకోవాలన్నారు.
అనేక ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నామన్నారు. ఆ శాఖల నుంచి తగిన సాంకేతిక సహకారాన్ని తీసుకోవాలని.. ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై సమాచారాన్ని సమగ్రంగా తెలియజేసేలా ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టాలని, దీంతో రైతుల్లో అవగాహన కలుగుతుందన్నారు సీఎం. రైతుల ఫోన్లకూ ఈ సమాచారాన్ని ఆడియో, వీడియో రూపంలో పంపించాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News