హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: ఆ పార్టీ అధ్యక్షుడిపై స్పెషల్ ఫోకస్.. అభ్యర్థిని ఫైనల్ చేసిని సీఎం జగన్.. గెలుపు కోసం పద్మవ్యూహం

AP Politics: ఆ పార్టీ అధ్యక్షుడిపై స్పెషల్ ఫోకస్.. అభ్యర్థిని ఫైనల్ చేసిని సీఎం జగన్.. గెలుపు కోసం పద్మవ్యూహం

 ఆ కుటుంబాలకు సీఎ జగన్ గుడ్ న్యూస్

ఆ కుటుంబాలకు సీఎ జగన్ గుడ్ న్యూస్

AP Politics: 175 కి 175 స్థానాలు నెగ్గడమే లక్ష్యం అంటున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియోజకవర్గంపై ఫోకస్ చేశారు. అక్కడ పార్టీలో త్రిముఖ పోరు ఉన్నా.. అభ్యర్థిని ఫైనల్ చేసి.. గెలుపు కోసం పద్మవ్యూహం రచించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Srikakulam, India

AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో 2024 ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) మాత్రం 175 కి 175 అసెంబ్లీ స్థానాలు నెగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సారి అధికారం సాధిస్తే.. 30 ఏళ్ల పాటు తానే సీఎం అనే ధీమాతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సాధించాలి అంటే.. ముందుగా గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ (TDP) 23 చోట్ల నెగ్గితే.. ప్రస్తుతం టీడీపీతో ఉన్నది కేవలం 18 మంది ఎమ్మెల్యే.. అయితే అందులో ఇతర నేతల సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ అధినేత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నియోకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.

చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంపై ఎప్పటి నుంచి పోకస్ చేస్తూనే ఉన్నారు. అక్కడి బాధ్యతలను మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రారెడ్డికి అప్పగించారు.. కుప్పంలో ఈసారి చంద్రబాబును ఓడించండం ఈజీనే అని వైసీపీ నేతలు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అచ్చెన్నాయుడుని టార్గెట్ చేస్తూ వ్యూహాలు రచిస్తున్నారు జగన్.

అయితే టెక్కలి నియోజవర్గంలో వైసీపీ విజయం అంత ఈజీ కాదు.. ప్రభుత్వం వ్యతిరేకత కలిసి వస్తుందని టీడీపీ నమ్ముతోంది. దానికి తోడు అచ్చెన్నాయుడికి స్థానికంగా బలం ఉంది.. చాలా గ్రామాల్లో అచ్చెన్నను అభిమానించే కార్యకర్తలు ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ.. దువ్వాడ శ్రీనివాస్ ది ఒక వర్గం.. మరోవైపు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిది ఒక వర్గం.. మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పేరాడ తిలక్ ది ఓ వర్గం..

ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేసేది ఇక్కడ నుంచే..? జనసేనాని ఫిక్స్ అయ్యారా..?

ఈ ముగ్గురి మధ్య అస్సలు సఖ్యత లేదన్నది వైసీపీలో అందరికీ తెలిసిందే.. ఎవరికి వారు సీటు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ సీఎం జగన్ మాత్రం.. ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కు ఓటేశారు.. టెక్కలిలో పోటీ చేయడానికి రెడీగా ఉండాలని దువ్వాడనకు బుధవారం అధినేత జగన్ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఆ ఇద్దరు దువ్వాడకు ఎంత వరకు సహకరిస్తారన్నది అనుమానమే.. టీడీపీ ప్రత్యర్థి కంటే.. సొంత పార్టీలో ఉన్నఈ ఇద్దరి నేతలతో దువ్వాడకు ఇక్కట్లు తప్పకపోవచ్చు.. అయినా.. గెలుపుపై అధినేత ధీమా వ్యక్తం చేశారు. గెలిపించే బాధ్యత తనది.. ప్రజల్లో ఉండాలి అని దువ్వాడకు చెప్పినట్టు సమాచారం.

ఇదీ చదవండి: బిగ్ బాస్ నిర్వహాకులు.. నాగార్జున హైకోర్టు నోటీసులు.. షో నిలిచిపోతుందా..?

తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నగా జగన్ మోహన్ రెడ్డి.. ఎక్కువగా ఇబ్బంది పెట్టింది అచ్చెన్నాయుడే.. ఇక టీడీపీ నుంచి జగన్ ను గట్టి తిట్టే వారిలో అచ్చెన్నాయుడు ఒకరు. అందుకే టెక్కలిలో అచ్చెన్నను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని పద్మ వ్యూహం రచిస్తున్నారు జగన్.. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ వ్యూహాలను అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన.. సామాజిక పరమైన వ్యూహాలతో అచ్చెన్నను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.

ఇదీ చదవండి: వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేసేది ఇక్కడ నుంచే..? జనసేనాని ఫిక్స్ అయ్యారా..?

టెక్కలి నియోజకవర్గంలో టీడీపీలో యాక్టివ్ గా ఉన్న మండల స్థాయి నాయకులు పలువురిని గుర్తించి.. వారికి ఆర్థికపరమైన సహకారం అందిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సపోర్ట్ చేయాలి లేద టీడీపీలో ఉంటూ అచ్చెన్నకు సహకరించేలా ఉండాలంటూ ఒప్పందాలు చేసుకున్నట్టు వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సామాజికి పరంగా అచ్చెన్నకు అండగా ఉన్న కీలక నేతలతో వైసీపీ పెద్దలు టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.. అచ్చెన్న గెలుపుకు సహకరిస్తారు అనుకునే నేతలందర్నీ తమ వైపు తిప్పుకునే పనిలో ఉంది వైసీపీ..ఈ వ్యూహాన్ని అచ్చెన్న తిప్పికొట్టగలరా.. లేదంటే మరోసారి గెలుపు కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Kinjarapu Atchannaidu

ఉత్తమ కథలు