హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: మొన్న దావోస్.. త్వరలో పారిస్.. మరో విదేశీ పర్యటనకు సీఎం జగన్.. కూతురు చేతికి పట్టా వచ్చే వేళ

CM Jagan: మొన్న దావోస్.. త్వరలో పారిస్.. మరో విదేశీ పర్యటనకు సీఎం జగన్.. కూతురు చేతికి పట్టా వచ్చే వేళ

సీఎం జగన్

సీఎం జగన్

CM Jagan Paris Tour: మొన్న దావోస్ వెళ్లి.. ఏపీకి పెట్టుబడులు తెచ్చిన సీఎం జగన్.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వరుసగా రెండో పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే మొన్నటి పర్యటనలో కేవలం పెట్టుబడులే లక్ష్యంగా సాగింది. కానీ పారిస్ టూర్ కు కారణం ఏంటో తెలుసా..?

ఇంకా చదవండి ...

  CM Jagan Paris Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. గత నెలలో దావోస్ పర్యటనకు (CM Davos Tour) వెళ్లిన సీఎం జగన్.. పెట్టుబడులు తీసుకురావడంలో పూర్తి సక్సెస్ అయ్యారు.. విదేశీ వ్యాపార వేత్తల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక వ్యక్తిగతంగానే జగన్ ప్ర్తత్యేక ఆకర్షణగానే నిలిచారు. యువకుడిలా స్టైలిష్ లుక్ తో ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేశారు. అయితే ఆ పర్యటన మొత్తం పెట్టుబడులు తేవడం కేంద్రాగానే జరిగింది. కానీ ఇప్పుడు పారిస్ పర్యటన (Paris Tour) అందుకు పూర్తిగా భిన్నం.. ఇది పూర్తి పర్సనల్ టూర్ కానుంది.

  సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షరెడ్డి (Harsha Reddy) పారిస్​లో మాస్టర్స్ డిగ్రీ చేసారు. పారిస్​లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హర్షరెడ్డి వచ్చే నెల 2న కాన్వకేషన్ తీసుకోనున్నారు. కుమార్తె కాన్వకేషన్ కార్యక్రమానికి సీఎం తో పాటుగా కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు. ఆ వెంటనే సీఎం తిరిగి రాష్ట్రానికి తిరిగి వచ్చేస్తారు.

  ఎందుకంటే వచ్చే నెల 4వ తేదీన ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిస్ లో కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం తిరుగు పయణం అవుతారని సమాచారం. ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్షారెడ్డి.. పారిస్‌ లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు దక్కించుకున్నారు. ఆ సమయంలోనూ సీఎం జగన్ బెంగుళూరు వెళ్లి కుమార్తెను పారిస్ పంపారు. ఇప్పుడు రెట్టించిన ఆనందంతో ఆయన పారిస్ బయలుదేరనున్నారు.

  ఇదీ చదవండి : ఆత్మకూరు ఉప ఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ గా జయప్రద.. వచ్చే ఎన్నికలకు ట్రయల్ రన్..

  ఇప్పటికే జగన్ పారిస్ షెడ్యూల్ ను సీఎంవో ప్రటకిచింది. ఇది పూర్తి వ్యక్తిగత టూర్ అని కూడా ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ పారిస్ పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 28న పారిస్ వెళ్లనున్నారు. పారిస్‌లోని ఓ ప్రసిద్ధ బిజినెస్‌ స్కూల్‌లో సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఆర్థిక శాస్త్రం చదువుతోంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత పారిస్‌లో ఆమె మాస్టర్స్ అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2వ తేదీన జరిగే ఆమె కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ తన కుటుంబంతో సహా పారిస్ పయనం కానున్నారు. అటు సీఎం జగన్ చిన్న కుమార్తె కూడా లండన్‌లోనే చదువుకుంటున్నట్లు సమాచారం.

  ఇదీ చదవండి : అమెరికన్ స్లాంగ్ తో ఇంగ్లీష్ మాట్లాడే బెండపూడి విద్యార్థులు పది పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారా? నిజం ఏంటి..?

  ఇటీవల జగన్ సోదరి షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అమెరికాలోని యూనివర్శిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఆ సెర్మనీలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల తన పాదయాత్రకు విరామం ఇచ్చి మరీ అమెరికా వెళ్లారు. వైఎస్ విజయమ్మ, షర్మిల భర్త అనిల్ కుమార్, మరో కుమార్తెతో కలిసి గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పాల్గొన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News

  ఉత్తమ కథలు