హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan Delhi Tour: నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ముందస్తు పై క్లారిటీ..? షెడ్యూల్ ఇదే?

CM Jagan Delhi Tour: నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ముందస్తు పై క్లారిటీ..? షెడ్యూల్ ఇదే?

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ (ఫైల్)

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ (ఫైల్)

CM Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇటీవల తరచూ ఆయన హస్తిన వెళ్తున్నారు. తాజా పర్యటనతో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ వస్తుందని చర్చ జరుగుతోంది.

    CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కాసేపట్లో ఢిల్లీలో పర్యటించనున్నారు (Delhi Tour). ఉదయం 11-30 గంటలకు గన్నవరం విమానాశ్రయం (Gannavaram Airport) నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకుని అక్కడ నుంచి వన్ జన్‌ఫథ్ కు చేరుకుంటారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర మంత్రి అమిత్ షా ( Amit Shah)లను కలిసే అవకాశం ఉంది. దావోస్ వేదికగా ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొని ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల క్రితమే తాడేపల్లికి వచ్చారు. ఒక్క రోజు విరామం వెంటనే ఢిల్లీ బాట పట్టారు. ఈ పర్యటనలో సీఎంవో వర్గాలు చెబుతున్నదాని ప్రకారం.. రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులతో పాటు థావోస్ పర్యటన విశేషాలపై కూడా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయమై కూడా ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. మరో వైపు ఏపీ,Telangana రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న వివాదాల పరిష్కారం కోసం ప్రధానిని చొరవ చూపించాలని కోరే అవకాశం ఉంది.

    చివరిగా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విభజన హామీ చట్టంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన బకాయిల చెల్లింపు తదితర వాటిపై సీఎం జగన్ చర్చించారు. అంటే నెల వ్యవధిలోనే ఆయన మరోసారి ఢీల్లీకి పయనం అయ్యారు. అయితే కేవలం రాష్ట సమస్యలు.. ఆర్థిక అంశాలే కాకుండా.. రాష్ట్ర పతికి ఎన్నిక, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపైనా చర్చ జరిగే అవకాశం ఉంది..

    ఇదీ చదవండి : మ్యూజియంలలో ఈ మ్యూజియం వేరయా..? అక్కడికి వెళ్తే సరికొత్త అనుభూతి

    అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో వీటిపై క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందుకే ఇంత సడెన్ గా ఆయన ఢిల్లీ వెళ్తున్నారని రాజకీయ వర్దాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ముందస్తు ఎన్నికలపై సంకేతాలు ఇస్తూనే ఉన్నాయి.. ఆత్మకూరు ఉప ఎన్నికను ఆయన సెమీ ఫైనల్ గా భావిస్తున్నట్టు ప్రచారం ఉంది.

    ఇదీ చదవండి : విదేశాల్లో మన మామిడి పండుకు యమ డిమాండ్. టేస్టీ అంటూ ఎగబడుతున్న విదేశీయులు

    ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లేలా ఆయన కసరత్తు చేస్తున్నారనే ప్రచారం ఉంది. అందులో భాగంగానే ఇటీవల సామాజిక న్యాయ భేరి పేరుతో మంత్రులు బస్సు యాత్ర చేపట్టారని.. అలాగే వైసీపీ నేతలంతా గడప గడపకు ప్రభుత్వం పేరుతో జనాల్లో ఉంటున్నారని.. మరిన్ని కార్యక్రమాలకు ఢీల్లీ పర్యటన తరువాత జగన్ శ్రీకారం చుడతారని.. ఆయన సైతం జనాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని వైసీపీ వర్గాల టాక్.. ముందస్తు ఎన్నికలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Amit Shah, Andhra Pradesh, Ap cm jagan, AP News, Narendra modi

    ఉత్తమ కథలు