AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY WILL CONTEST FROM AMARAVATI CPI NARAYANA DEMAND NGS GNT
Amaravati: వచ్చే ఎన్నికల్లో అమరావతి నుంచి జగన్ పోటీ..! ఆయనకు వేరే ఆప్షన్ లేదా..?
సీఎం జగన్ పాలనకు మూడేళ్లు
Amaravati: అమరావతి రైతుల ఉద్యమం వేయి రోజుల దిశగా పరగులు తీస్తోంది. గత 900ల రోజులుగా రైతులు ఉద్యమం చేస్తునే ఉన్నారు. అయినా ప్రభుత్వం మనసు కరగడం లేదు. అయితే తాజాగా సీపీఐ నేత నారాయణ, అటు తెలంగాణ జనసమితి నేత కోదండరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. వారు ఏమన్నారంటే..?
Amaravati: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా సీపీఐ అగ్రనేత నారాయణ (CPI Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సీఎం జగన్ (CM Jagan) కు ఓ సవాల్ విసిరారు. అమరావతి (Amaravati) లో జగన్ పోటీచేయాలని నారాయణ డిమాండ్ చేశారు. గత 900 రోజులుగా రైతులు, మహిళలు ఉద్యమాలు చేస్తున్నా జగన్ ప్రభుత్వం కిరాతకంగా వ్యవహరించడం దారుణమన్నారు. న్యాయస్థానాలు సానుకూలంగా స్పందిస్తున్నా ముఖ్యమంత్రి వితండ వాదన చేస్తుండడంపై ఆయన మండిపడ్డారు. ఆనాడు అమరావతినే రాజధానిని అంగీకరించారని.. ప్రతిపక్షనేతగా ముందు అంగీకరించి ఇప్పుడు ఆడినమాట తప్పుతారా.. అని నారాయణ ప్రశ్నించారు. ప్రధాని మోదీ (PM Modi) కాళ్లు మోక్కినంత మాత్రాన జైలుకు పోకుండా ఎవరైనా ఆపగలరా.. అని ప్రశ్నించారు. ఆత్మకూరులో నిలబడాలని సవాలు చేయడం కాదు.. అమరావతిలో జగన్ పోటీ చేస్తే వాస్తవం తెలుస్తుందన్నారు. ఓట్లపై ప్రేమతోనే కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టారని నారాయణ ఆరోపించారు.
కోనసీమ తిరుగుబాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద జరిగిందే అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ ఘటన కేవలం అంబేద్కర్ పేరుకు అనుకూలమో వ్యతిరేకమో కాదు అన్నారు. సామాజిక న్యాయం అనే పేరుతో కార్పోరేషన్లు పెట్టి ఏం ఉపయోగం లేదన్నారు. బీసీలకు అధికారం ఎక్కడిది..?వీధినాటకంలో భుజకిరీటాలు ధరించినట్టే ఉంది బీసీ కార్పోరేషన్ల పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉద్యోగాలు పోగొట్టడానికే జాబ్ క్యాలెండర్ ఉందని నారాయణ సెటైర్లువేశారు. విశాఖ ఉక్కు, కృష్ణపట్నం పరిశ్రమలు ప్రైవేటు పరం అవుతున్నాయి. ప్రత్యేక హోదా అడిగితే జగన్ జైలుకు వెళ్లాల్సిందే అన్నారు.
అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు- సర్కార్ తీరు అనే అంశంపై విజయవాడలో సదస్సు జరిగింది. అమరావతి రాజధాని ఉద్యమం 900 రోజులకు చేరుకున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు ప్రొఫెసర్ హరగోపాల్, మరికొందరు హక్కుల నేతలు కూడా హాజరయ్యారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ఉద్యమం ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ జగన్ పాలనపై విమర్శలు చేశారు. అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయడం మినహా.. ప్రభుత్వానికి ఇంకో దారి లేదని తేల్చిచెప్పారు. ఇది రైతుల జీవనోపాధి, హక్కులకు సంబంధించిన అంశమన్న నేతలు ఉద్యమంతోనే వాటిని సాధించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.
రైతులు తమ భూములను రాజధానికి ఇచ్చారని, రాజధాని నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాల్సిందేనని అన్నారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం పాటించాల్సిందేనని, రైతుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. సీఎం జగన్ కు అమరావతి అభివృద్ధి తప్ప మరో మార్గం లేదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.