AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY WELCOMED COURT VERDICT ON RAMYA DEATH CASE NGS
CM Jagan Reaction: రమ్య హత్య కేసు దోషికి ఉరిశిక్షపై సీఎం జగన్.. ఆయన ఏమన్నారుంటే.?
కోర్టు తీర్పును స్వాగతించిన సీఎం
CM Jagan Reaction: తీర్పు అంటే ఇది అని సామాన్య జనాలు అభిప్రాయ పడుతున్నారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో.. సంచలన తీర్పు ప్రకటించింది. ఈ తీర్పును అన్నవర్గాల వారు స్వాగతిస్తున్నారు.. తాజాగీ సీఎం జగన్ సైతం దీనిపై స్పందించారు..
CM Jagan Reaction: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంచలనంగా మారింది రమ్య హత్య కేసు (Ramay Murder Case).. గుంటూరు (Guntur) పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో కోర్టు సంచలనం.. గుంటూరులోని ప్రత్యేక కోట్లు సంచలన తీర్పు ఇచ్చింది. రమ్యను హత్య చేసిన శశికృష్ణకు కోర్టు ఉరిశిక్షను విధించింది.(CM Jagan Reaction) అయితే విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నా. ఈ కేసు విషయంలో పోలీస్ శాఖ వేగంగా దర్యాప్తు పూర్తి చేసింది. నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీస్ శాఖకు అభినందనలు అంటూ సీఎం జగన్ (CM Jagan) ట్వీట్ చేశారు. గతేడాది గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో నిందితుడు శశికృష్ణను దోషిగా నిర్ధారించిన ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది.
తాజా తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగిందన్న భావన అన్ని వర్గాల్లోనూ కనిపిస్తోంది. గత ఏడాది ఆగస్ట్ 15న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి శశికృష్ణ హత్య చేశాడు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా 24 గంటల్లోనే శశికృష్ణను పోలీసులు పట్టుకున్నారు. నరసరావుపేట సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో 36 మందిని విచారించిన పోలీసులు 15 రోజుల వ్యవధిలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ దగ్గర సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజీని కూడా చూసిన న్యాయమూర్తి ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.. శుక్రవారం తుది తీర్పును వెలువరించారు. శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు. నిందితుడు శశికృష్ణ గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన.. రమ్య హత్య కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనని అందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు. తాజాగా కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో ఇప్పటికే నేర నిర్ధారణ చేసిన ప్రత్యేక న్యాయమూర్తి.. నిందితుడికి ఉరి శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. సోషల్ మీడియా ద్వారా రమ్యకు పరిచయమైన శశికృష్ణ.. ప్రేమ పేరుతో ఆమెను వేధించాడు. అతని వేధింపులు భరించలేక రమ్య.. శశికృష్ణ ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసింది. ఇది జీర్ణించుకోలేని శశికృష్ణ కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.