హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: సీఎం టూర్ పై వరుణుడి ఎఫెక్ట్.. జగన్ విశాఖ పర్యటన వాయిదా.. మరి వాహనమిత్ర?

Breaking News: సీఎం టూర్ పై వరుణుడి ఎఫెక్ట్.. జగన్ విశాఖ పర్యటన వాయిదా.. మరి వాహనమిత్ర?

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

CM Jagan Vizag Tour: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన వాయిదా పడింది. రేపు విశాఖలో వాహనమిత్ర లబ్ధి దారులకు ఆయన నగదు విడుదల చేయాల్సి ఉంది. కానీ భారీ వర్షాల కారణంగా ఆయన టూర్ వాయిదా పడింది.

  CM Jagan Visakha Tour Postponed: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను భారీ వర్షాలు (Heavry Rains) ముంచెత్తుతున్నాయి.. మరో 24 గంటల్లో కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ  ప్రభావం.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనపైనా పడింది.  ఈ నెల 13న అంటే.. బుధవారం జగన్ విశాఖ పర్యటించాల్సి ఉంది. ఇప్ప‌టికే ఆయన పూర్తి షెడ్యూల్‌ను ఖ‌రారు చేసింది ప్రభుత్వం.. కానీ భారీ వ‌ర్షాల‌ కారణంగా పర్యటనను వాయిదా వేసుకోక తప్పలేదు.  13న జరగాల్సిన పర్యటనను 15వ తేదీకి వాయిదా వేసినట్టు సీఎంఓ అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుతానికి బుధవారం విడుదల చేయాలి అనుకున్న వాహ‌న మిత్ర నిధుల విడుదల కూడా వాయిదా పడినట్టే.. ఇప్పటికే దానికి సబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.  విశాఖ‌లోని ఆంధ్రా యూనివ‌ర్సిటీ (Andha University) లో ఆయన ఈ నిధులను  ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ చేయాల్సి ఉండేది. కానీ జగన్ పర్యటన వాయిదాతో.. వాహనమిత్ర పథకం నగదు జమ కూడా వాయిదా పడినట్టే..

  గడిచిన రెండు రోజులుగా దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలు ముంచెత్తుతున్నాయి. ఈ వానలు మరో మూడు రోజుల పాటు దంచికొట్టే అవకాశం ఉందని  శాఖ హెచ్చరిక‌లు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ఈ నెల 15కు వాయిదా వేస్తున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌కటించింది.

  టూర్ షెడ్యూల్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మరోవైపు ఏపీకి భారీగా వానగండం పొంచి ఉంది. ఈ నెల 15వ తేదీనే వాహన మిత్ర నగదు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే  సీఎం జగన్ పూర్తి షెడ్యూల్ లో దానిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

  ఇదీ చదవండి : వైసీపీపై మా పార్టీ నేతల ప్రచారంలో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

  మరోవైపు ఏపీని భారీ వానలు ముంచెత్తుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా కలెక్టర్ల వరకు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా గోదావరి ఉదృతి, సహాయక చర్యలపై సీఎం జగన్‌ దిశనిర్దేశం చేయనున్నారు.

  ఇదీ చదవండి : మరో 24 గంటలు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్..

  బంగాళాఖాతంలో ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడింది. ప్రస్తుతం ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపు వేగంగా కదులుతోంది. అయితే మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది. ప్రస్తుతం భూమిపైనే కొనసాగుతూ రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఒకవేళ తీవ్రరూపం దాల్చకపోయినా అల్పపీడనంగానే 4, 5 రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా అలర్ట్ అయ్యింది..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Visakhapatnam

  ఉత్తమ కథలు