హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: జోరు వానలోనూ సీఎం జగన్ పర్యటన.. ట్రాక్టర్.. పంటుపై ప్రయాణం.. బాధితులకు అండగా ఉంటామని భరోసా

CM Jagan: జోరు వానలోనూ సీఎం జగన్ పర్యటన.. ట్రాక్టర్.. పంటుపై ప్రయాణం.. బాధితులకు అండగా ఉంటామని భరోసా

వర్షంలోనూ సీఎం జగన్ పర్యటన

వర్షంలోనూ సీఎం జగన్ పర్యటన

CM Jagan: జోరు వానను సైతం సీఎం జగన్ లెక్క చేయడం లేదు.. ఇప్పటికే కోనసీమ జిల్లా చేరుకున్న ఆయన.. అక్కడ నుంచి మొదట ట్రాక్టర్ పైనా.. తరువాత ప్రత్యేక పంటుపైనా మంపు ప్రాంతాలకు చేరుకున్నారు. అక్కడి బాధితులతో మాట్లాడి.. వారికి భరోసా కల్పిస్తున్నారు.

ఇంకా చదవండి ...

CM Jagan: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) సీఎం జగ్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కోనసీమ జిల్లా కొనసాగుతోంది. గోదావ‌రి వ‌ర‌ద (Godavari Floods) బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ముఖ్య‌మంత్రి ఉద‌యం తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరిన పి.గ‌న్న‌వ‌రం మండ‌లం జి.పెద‌పూడి చేరుకున్నారు.  పెదపూడిలో భారీ వర్షం పడుతున్నా జగన్ లెక్క చేయలేదు.. వర్షంలో ఎందుకు కాసేపు విరామం తీసుకోమని స్థానిక నేతలు కోరినా.. ఆయన భారీ వ‌ర్షంలోనే వ‌ర‌ద బాధితుల దగ్గరకు చేరుకున్నారు. మొదట ట్రాక్టర్ ఎక్కి గోదవరి వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక పంటుపై నేరుగా ముంపు గ్రామాల దగ్గరకు వెళ్లారు. నేరుగా గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌తో ముచ్చ‌టించారు. వ‌ర‌ద‌ల కారణంగా క‌లిగిన న‌ష్టం, ప్ర‌భుత్వం చేప‌ట్టిన స‌హాయ‌క కార్య‌క్ర‌మాల గురించి నేరుగా బాధితుల‌నే అడిగి తెలుసుకున్నారు.. ఇటీవల కురిసిన వర్షాలు.. ఎగువనుంచి వరద కారణంగా.. కోనసీమ జిల్లాలోని సుమారు 51 లంక గ్రామాలు గత కొన్ని రోజులుగా జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వరదల్లో ఇబ్బంది పడుతున్న వారందర్నీ నేరుగా సీఎం జగన్ మాట్లాడారు. బాధితులకు ధైర్యాన్ని ఇస్తున్నారు.

ఇలా ముంపుకు గురి అవ్వడం ఇదే తొలిసారి కాదు.. గత కొన్నేళ్లుగా వరదల సమయంలో వశిష్ట నదిపాయ తెగిపోవడంతో ఇబ్బందుల్లో లంక గ్రామ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. లంకల గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారందర్నీ నేరుగా కలిసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. పెద‌పూడి ఫెర్రీ నుంచి పంటుపై లంక గ్రామాల‌కు చేరుకున్నారు. అక్కడ బాధితులకు అందుతున్నసహాయంపై నేరుగా ఆరా తీశారు.

పి.గన్నవరం మండలం జి. పెదపూడికి చేరుకున్న తరువాత వర్షం కురుస్తూ.. పర్యటనను ఆపకుండా.. ట్రాక్టర్ పై నేరుగా బాధితుల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. నాగుల్లంక గ్రామంల్లో ఇప్పటికే పర్యటన పూర్తైంది. తరువాత పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమయ్యారు. అక్కడి బాధితులతో సీఎం జగన్‌ నేరుగా మాట్లాడి.. పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు.


అలాగే సీఎం జగన్ అరిగెలవారిపేట, ఉడిమూడిలంక, వాడ్రేవు పల్లిలోని వరద ముంపు బాధితులతో సమావేశం కానున్నారు. వరద ముంపు గ్రామాలను పరిశీలించి.. తాజా పరిస్థితులను అంచనా వేయనున్నారు. వరద బాధితులను పరామర్శించడంతో పాటు జిల్లాలో దెబ్బతిన్న పంటలను జగన్ పరిశీలిస్తారు. వరద నష్టాన్ని అంచనా వేసి తయారుచేసే నివేదికను సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి అందజేసి సాయం కోరనున్నారు.

సీఎం జగన్ రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. జగన్ తన పర్యటనలో భాగంగా అన్నంపల్లి అక్విడెక్ట్‌ ప్రాజెక్టుకు చేరుకుంటారు. కాసేపట్లో సీఎం రాజోలునియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మేకలపాలెంలో వరద బాధితులతో సమావేశం కానున్నారు. సాయంత్రం రాజమండ్రి చేరుకొని.. ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. అక్కడ తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద సమయంలో తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP Floods, AP News

ఉత్తమ కథలు