Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY TOMORROW TIRUMALA TOUR HE RELEASED VIDYA DIVENA FUNDS NGS TPT

CM Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు తిరుపతికి సీఎం జగన్.. పూర్తి షెడ్యూల్ ఇదే..?

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రేపు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు..? తిరుపతి పర్యటనకు వెళ్తున్న ఆయన.. ఎస్వీ యూనివర్శిటీలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడనున్నారు. మరోవైపు సీఎం పర్యటనపై విపక్షాలు ఆందోళన బాట పట్టాయి.. రేపటి సీఎం పూర్తి షెడ్యూల్ ఇదే..?

ఇంకా చదవండి ...
    CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. రేపు తిరుపతి పర్యటన (Tirupati Tour) లో బిజీ కానున్నారు. ఉదయం పది గంటలకు గన్నవరం విమానాశ్రయం (Gannavaram Air Port) నుంచి రేణిగుంట (Renugunta)కు బయలుదేరతారు.. తరువాత పదకొండున్నర గంటల ప్రాంతంలో ఎస్వీ యూనివర్శిటీ (SV University) కి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్. అక్కడ జగనన్న విద్యా దీవెన పథకం (Vidya Divena Scheme)లో భాగంగా విద్యార్ధులు, తల్లిదండ్రులతో మాట్లాడనున్నారు సీఎం జగన్. ఆ తరువాత 12 గంటలకు సీఎమ్ ప్రసంగం వుంటుంది. ఒంటి గంటకు పద్మావతి పిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కు భూమి పూజ, శంఖుస్థాపన చేశారు జగన్. అక్కడి నుంచి టాటా క్యాన్సర్ కేర్ సెంటర్ ను ప్రారంభించనున్నారు జగన్. అక్కడి రేడియాలజీ, రేడియోథరెపీ, ఏవీ ప్రజెంటేషన్ పరిశీలిస్తారు. మధ్యాహ్నం రెండున్నరకు రేణిగుంట నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. మూడున్నరకు తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం జగన్.

    పూర్తి షెడ్యూల్ ఇదే..?
    ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 11.05 గంటలకు తిరుపతి ఎస్‌వీ వెటర్నరీ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 11.20 గంటలకు ఎస్‌వీ యూనివర్శిటీ స్టేడియం చేరుకుని జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో సంభాషణ, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 12.55 గంటలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి భూమిపూజలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి టాటా కేన్సర్‌ కేర్‌ సెంటర్‌ ( శ్రీ వెంకటేశ్వర ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ కేన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌) కు చేరుకుని నూతన ఆసుపత్రిని ప్రారంభిస్తారు.

    ఇదీ చదవండి : మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్.. హైదరాబాద్ లో రోడ్లపై వైసీపీ మీమ్స్

    తిరుపతి క్యాన్సర్‌ కేర్‌కు చిరునామా కానుంది. టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 190 కోట్ల రూపాయలతో ఆస్పత్రి నిర్మాణం కానుంది. క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆసుపత్రిగా ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంపూర్ణ సహకారంతో అలిపిరి వద్ద ఈ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం కాబోతోంది. అందుకోసం 25 ఎకరాలు ఇచ్చింది టీటీడీ. ఆసుపత్రిని రేపు ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక కార్పొరేట్‌ వైద్యం పేదలకు అందనుంది. త్వరలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు ప్రారంభం అవుతాయి.

    ఇదీ చదవండి : మంగళగిరిలో గెలుపెవరిది? ఆర్కే ధీమా? లోకేష్ వ్యూహం ఏంటి? ఎమ్మెల్యేపై వైసీపీ ఎంపీటీసీ ఫ్యామిలీ ఫిర్యాదు

    మరోవైపు సీఎం శ్రీ జగన్ రెడ్డి తిరుపతికి విచ్చేయుచున్న సందర్భంగా తిరుపతిలో స్థానిక ప్రజలు, తిరుమలకి వచ్చే యాత్రికులు కార్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని జనసేన నిరసనలు చేస్తోంది. జగనన్న వస్తున్నారు మీ కార్లు జాగ్రత్తా అని జనసేన కార్యకర్తలు దండోరా కార్యక్రమం చేపట్టారు.

    విమర్శల సంగతి ఎలా ఉన్నా అధినేత, సీఎం జగన్ టూర్ ను సక్సెస్ చేసే పనిలో అధికార పార్టీ నేతలు, అధికారులు బిజీ అయ్యారు. జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులూ.. సీఎం పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి సీఎం జగన్ తిరుపతి వస్తుండడం ఆనందంగా ఉంది అన్నారు రోజా..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Minister Roja, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు