హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: 60% నాది.. 40 % మీది.. 175 సీట్లు గెలవలేమా? సీఎం జగన్ కీలక నిర్ణయం.. వారందరికీ కేబినెట్ హోదా?

CM Jagan: 60% నాది.. 40 % మీది.. 175 సీట్లు గెలవలేమా? సీఎం జగన్ కీలక నిర్ణయం.. వారందరికీ కేబినెట్ హోదా?

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

CM Jagan: టార్గెట్ 2024 లక్ష్యంగా సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు నెగ్గామని.. ఈ సారి 175 సీట్లు నెగ్గలేమా అని ఎమ్మెల్యేలను, నేతలను సీఎం ప్రశ్నించారు. ఆ దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా కొత్తగా జిల్లా అభివృద్ధి మండళ్ల ఏర్పాటు చేసి.. వారికి కేబినెట్ హోదా ఇవ్వాలని నిర్ణయించారు.

ఇంకా చదవండి ...

  Cm Jagan: టార్గెట్ 151 కాదు 175 అంటున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి. దేశంలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు చేపడుతున్నామని.. ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని.. నేతలంతా సమన్వయంతో ఇప్పటి నుంచి కష్ట పడితే 2024లో 175 సీట్లు ఎందుకు గెలవలేం అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. అలాగే నేటి సమావేశంలో ప్లీనరీకి ముహూర్తం ఫిక్స్ చేశారు. జూలై 8న ప్లీనరీ నిర్వహణకు సమాయత్తమవుతోంది అధికార పార్టీ. అంతకుముందు నుంచే నేతలంతా ప్రజల్లో ఉండాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా మే 10 నుంచి గడపగడపకూ వైసీపీ(YCP) కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కాగా మంత్రులు, పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లతో సీఎం జగన్‌(Cm jagan) సమావేశంలో 2024కు ఎలా సిద్ధం కావాలి అన్నదానిపైనే దిశా నిర్దేశం చేసినట్టు సమాచారం. పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై దిశానిర్దేశం చేశారు. పాత మంత్రులు, జిల్లా అధ్యక్షులకు ప్రాధాన్యతనివ్వనున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. అర్హులైన వారందరికీ పథకాలు అందేలా చూడాలని సూచించారు. 95 శాతం హామీలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని.. మనం వేసే ప్రతి అడుగు అలెర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

  ఈ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా జిల్లా అభివృద్ధి మండలిని తీసుకురానున్నట్లు ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షులే దానికి చైర్మన్లుగా ఉంటారని స్పష్టం చేశారు. దీని ప్రకారం 26 జిల్లాలకు 26 మంది జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్లు ఉండబోతున్నారు. వారందరికీ కేబినెట్‌ హోదా కూడా ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే విడుదల చేస్తామని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అయితే మంత్రి పదవి దక్కలేదని నిరాశ చెందిన వారిని బుజ్జగించడానికి ఈ కేబినెట్ హోదా ఇస్తారని ప్రచారం ఉంది.

  ఇదీ చదవండి : సీఎం సొంత జిల్లాలో సచివాలయానికి తాళాలు... ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. 

  అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులకు జగన్‌ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు టాక్. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని కచ్చితంగా పక్కన పెడతామన్నారు. రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను.. మంత్రులు కలుపుకొని వెళ్లాలి సూచించారు. ఎవరికైనా పార్టీనే సుప్రీం అని..గెలిస్తేనే మంత్రి పదవి అని తేల్చి చెప్పారు. గెలిచేందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తానని ముఖ్యమంత్రి హామి ఇవ్వడంతో నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా 100 శాతంలో.. సీఎంగా 60 శాతం తన గ్రాఫ్‌ బాగుందని నివేదికలు చెబుతున్నాయని.. ఆ మిగిలిన 40 శాతం క్రెడిట్ ఎమ్మెల్యేలదే అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎవరి గ్రాఫ్‌ బాగుంటే వాళ్లకే టికెట్‌ వస్తుందన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ysrcp

  ఉత్తమ కథలు