Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY SLAMS ON TDP AND CHANDHRABABU NAIDU IN VISKHA DISTRICT TOUR NGS VSP

CM Jagan: మంచిపని చేస్తే అడ్డుకుంటున్నారు? ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యానికి కారణం అదే.. సీఎం జగన్ ఆవేదన

ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్

ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్

CM Jagan: పేదా ప్రజలకు సీఎం జగన్ మరోగుడ్ న్యూస్ చెప్పారు. లక్షకుపైగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది. అయితే ఈ కార్యక్రమం ఆలస్యానికి కారణం ఏంటన్నదానిపై క్లారిటీ ఇచ్చారు.. ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదన్నదే.. విపక్షాల ఉద్దేశం అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తన సంకల్పాన్ని అడ్డుకోలేకపోయారని సీఎం ఆనందం వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...
  CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. మరోసారి విపక్షాల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలకు మంచి చేద్దామన్నా చేయకుండా అడ్డుతగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అసూయతో ఇలా ప్రతి పనికి అడ్డుపడుతున్నారని.. అందుకే ఇళ్ల పట్టాలు సైతం కాస్త ఆలస్యం అయ్యింది అన్నారు. విపక్షాలు ఎన్నికుట్రలు చేసినా.. మనం సంకల్పం గొప్పది అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదరైనా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయగలిగాం అన్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా (Anakapalli District)లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా సబ్బవరం మండలం (Sabbavaram Mandal) పైడివాడ అగ్రహారంలో 1.23 లక్షల ఇళ్లపట్టాల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 30.70 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. మరోవైపు 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమైందని ఆనందం వ్యక్తం చేశారు. గజం ధర 12 వేలు పలికే చోట.. 6 లక్షల రూపాయల విలువైన ఇళ్లస్థలాన్ని పేదలకు ఇస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణం, మౌలిక సదుపాయాలతో కలిపి మొత్తంగా 10 లక్షల వరకు ఆస్తిని ప్రతి అక్కాచెల్లెమ్మ చేతిలో పెట్టామని సీఎం గుర్తు చేశారు.

  అయితే ఈ కార్యక్రమాన్ని కాస్త ముందుగానే ప్రారంభించాల్సి ఉందని జగన్ అభప్రాయపడ్డారు. అంటే సరిగ్గా 16 నెలల కిందటే ఇక్కడ ఇళ్లపట్టాలు ఇవ్వాలని అనుకున్నామని.. అలాగే చేస్తే.. ప్రభుత్వానికి.. సీఎం జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని కొందరు కడుపు మంట ఎక్కువైపోయి కోర్టులో కేసులు వేశారని జగన్ ఆరోపించారు. ఈ కేసులు ఎలా తొలుగుతాయోనని ప్రతిరోజు తాను ఆలోచించేవాడినని తెలిపారు. ఇన్ని లక్షలమందికి మేలు చేస్తున్న కార్యక్రమాలను కొంతమంది అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కోర్టు కేసుల వల్ల 489 రోజులు ఇక్కడ ఇళ్లపట్టాలు ఇవ్వడం ఆలస్యమైందని వివరించారు.

  ఇదీ చదవండి : ఆలస్యంగా కళ్లు తెరిచిన సర్కార్.. అంబులెన్స్‌ మాఫియాకు చెక్ పెడుతూ నిర్ణయం..?

  దేవుడి దయతో.. కోర్టుల్లో కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. పిల్లలకు ఇంటి రూపంలో ఒక ఇస్తిని ఇవ్వాలనుకుంటారని.. ఒక ఇల్లు ఉండడం అనేది అక్కచెల్లెమ్మకు సామాజిక హోదా ఇచ్చినట్టు అవుతుందన్నారు. మరోవైపు ఏపీలో 17వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయని.. ఇళ్లు లేని వాళ్లు ఎవరైనా సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే, స్థలం ఇస్తామని జగన్ ప్రకటించారు. ఇకపై నుంచి రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబం ఉండబోదని మాటిచ్చామన్నారు. ఇచ్చిన మాట కంటే మెరుగైన సౌకర్యాలతో ఇళ్లు కట్టించి తీరతామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

  ఇదీ చదవండి : తప్పని సరై ఆస్పత్రికి వెళ్తున్నారా..? అయితే మీతో పాటు ఇది ఉండాల్సిందే..?

  ఈ ఒక్కకాలనీలోనే దాదాపుగా 10,228 ప్లాట్లు ఇళ్ల నిర్మాణం జరగబోతోందని, పదివేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు ప్రభుత్వమే భరిస్తోందని సీఎం జగన్‌ చెప్పారు. ఇళ్లు అనేది ఒక శాశ్వత చిరునామా. తర్వాతి తరానికి ఇచ్చే ఆస్తి. అలాంటి ఇళ్లను ఇవ్వడం ద్వారా ఒక సామాజిక హోదా కల్పించినట్లు అవుతుందన్నారు. స్థలం, ఇళ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు.. మొత్తం కలిపి అక్షరాల పదిలక్షల రూపాయల దాకా ఖర్చు అవుతోందన్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, Chandrababu Naidu, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు