హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: విబేధాలు వీడండి.. పార్టీకి నష్టం చేస్తే సహించేది లేదు.. 2024 ఎన్నికలపై సీఎం దిశానిర్దేశం

CM Jagan: విబేధాలు వీడండి.. పార్టీకి నష్టం చేస్తే సహించేది లేదు.. 2024 ఎన్నికలపై సీఎం దిశానిర్దేశం

సీఎం జగన్ (పాత ఫొటో)

సీఎం జగన్ (పాత ఫొటో)

CM Jagan: 2024 ఎన్నికలను సీఎం జగన్ టార్గెట్ చేశారు. ఇప్పటి నుంచే ఎలా సిద్ధం కావాలి..? ఎవరి బాధ్యతలు ఏంటి..? ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలవాలి అంటే ఏం చేయాలి.. ఇలా అన్ని అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్.. ఇంకా ఆయన ఏయన్నారంటే..?

ఇంకా చదవండి ...

  CM Jagan Meeting: ఇకపై పార్టీపై పూర్తి ఫోకస్ చేయాలని సీఎం జగన్ (CM Jagan) నిర్ణయించారు. ఇప్పటి నుంచి 2024 ఎన్నికలకు అంతా సిద్ధం కావాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నేతలతో సీఎం జగన్ ఏర్పాటు చేసిన కీలక మీటింగ్ పలు సూచనలు చేశారు.  ఈ సమావేశంలో అంతా 2024 ఎన్నికలే అంశమే లక్ష్యంగా సీఎం కీలక సలహాలు ఇచ్చారు.  కొందరి ఎమ్మెల్యేల పని తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.. ఎన్నికల దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా పని తీరు మార్చుకోకపోతే కష్టమని హెచ్చరికలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇకపై ఎప్పటికప్పుడు అందరి పనితీరుపై సమీక్షలు చేయడం జరుగుతుందని.. పద్ధతి మారకపోతే.. పెను మార్పులు తప్పవని అధినేత వార్నింగ్ ఇచ్చినట్టు టాక్. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు (Welfare Schemes).. ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ పథకాల ద్వారా ప్రతీ ఇంటికీ ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో తెలుసుకొనేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం చేసినట్లు తెలుస్తోంది.

  ఈ కీలక సమావేశానికి  మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. 2024 ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి, నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. త్వరలో జరగబోయే ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్లీనరిలోనే సీట్ల కేటాయింపు.. ఎన్నికలు ఎప్పుడు అన్న విషయాలపైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే ఏఏ నియోజకవర్గంలో పార్టీ బలం ఎంత? ఎక్కడ బలహీనంగా ఉంది అన్న విషయాలను గుర్తించి.. స్థానిక పరిస్థితులను అంచనా వేసిన తరువాత ఇంఛార్జులను నియమించినట్టు తెలుస్తోంది.

  ఇదీ చదవండి : సీఎం సొంత జిల్లాలో సచివాలయానికి తాళాలు... ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

  ఈ సమవేశం మొత్తం రాబోయే ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలి అన్నదాని చుట్టే సాగింది అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన సూచనలు ఉన్నాయి అంటున్నారు. అలాగే ప్రతి నెల సచివాలయాలు సందర్శించాలని, నెలకు ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే పది సచివాలయాలు తిరగాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. మే 2వ తేదీ నుంచి జరిగే గడపగడపకు వైసీపీని కచ్చితంగా ప్రతి నేత అమలు చేయాలని, అక్కడే ప్రజా సమ్యలను అన్నీ తెలుసుకోవాలని.. వాటికి పరిష్కారాలు చూపించే ప్రయత్నం చేయాలని సూచించారు.

  ఇదీ చదవండి : ఇదేం అభిమానం.. రామ్ చరణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. హుండీపై నిల్చొని అపచారం

  అన్నిటికన్నా ముఖ్యంగా 2024 ఎన్నికల్లో నేతల మధ్య విబేధాలు ఉంటే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. విబేధాలు అలాగే కొనసాగితే పార్టీకి నష్టం తప్పదని.. అదే జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం. అలాదే త్వరలోనే సీఎం జగన్ జిల్లాల పర్యటన చేయనున్నారని ప్రజా ప్రతినిధులకు చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ysrcp

  ఉత్తమ కథలు