హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. తన బ్యానర్లు చింపేయాలని ఆదేశం.. ఎందుకంటే?

CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. తన బ్యానర్లు చింపేయాలని ఆదేశం.. ఎందుకంటే?

ప్లాస్టిక్ బ్యాన్ పై సీఎం జగన్ సంచలన నిర్ణయం

ప్లాస్టిక్ బ్యాన్ పై సీఎం జగన్ సంచలన నిర్ణయం

CM Jagan on Plastic Ban: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా కఠినంగా ప్లాస్టిక్ బ్యాన్ కు చర్యలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను బ్యాన్ చేశారు.. ఆఖరి తన ఫ్లెక్సీలను సైతం చింపేయమన్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  CM Jagan Mohan Reddy on Plastic:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు.. నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా కఠినంగా ప్లాస్టిక్ బ్యాన్ (Plastic Ban) అమలు చేయాలని ఆదేశించారు. అందులో  తొలి అడుగుగా.. ఇకపై ఏపీలో ఎక్కడా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు.. బ్యానర్లు కనిపించొద్దని ఆదేశించారు. అయితే ఇవాళ తను విశాఖపట్నం (Visakhapatnam) వస్తున్నప్పుడు ఎక్కడ చూసినా.. ఫ్లెక్సీలే ఉన్నాయని.. అవన్నీ తనవే ఉన్నాయని.. అయితే అవి క్లాత్ బ్యానర్లు అని చెప్పారని వెల్లడించారు. ఇకపై తన బ్యానర్లు సైతం ప్లాస్టిక్ వి ఎక్కడ కనిపించినా వెంటనే చింపివేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను కఠినంగా బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించారు.. అలాగే ఇప్పటికే తిరుపతి (Tirupati) లో పూర్తిగా ప్లాస్టిక్ లేకుండా చేశామని.. అది మంచి ఫలితాలు ఇస్తోంది అన్నారు.


  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జునను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. ఎందుకంటే సీఎం జగన్ విమానాశ్రయం నుండి బీచ్ రోడ్డు వరకు.. తన ఫ్లెక్సీలే ఏర్పాటు చేయడం చూసిన జగన్.. ప్లాస్టిక్ బ్యాన్ కార్యక్రమానికి వెళ్తూ.. ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కరెక్టు కాదు కదా అని ప్రశ్నించారు. ప్రజల్లో తప్పుడు మెసేజ్ ఇస్తున్నాం కదా అని కలెక్టర్ అడిగారు.. ఈ సందర్భంగా అవి ప్లాస్లిక్ ఫ్లెక్సీలు కాదని.. క్లాత్ తో చేసినవని.. కాకపోతే ఖర్చు ఎక్కువ అవుతుందని కలెక్టర్ వివరణ ఇవ్వడంతో.. సీఎం జగన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.  పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. విశాఖ ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా.. ఆయన మాట్లాడరు. ఈ వేదికపై నుంచే ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ఈ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం జరిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం తీరం నుంచి తొలగించారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. అలాగే ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిదీ అని ఆయన పిలుపు ఇచ్చారు.


  ఇదీ చదవండి : కుప్పం పర్యటన ఎఫెక్ట్.. చంద్రబాబుకు భారీగా భద్రత పెంపు


  పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీస్తోంది. రీసైకిల్‌ చేసి పలు ఉత్పత్తులు తయారు చేస్తోంది. అంతేకాదు.. పార్లే ఫ్యూచర్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు అని సీఎం జగన్‌ వెల్లడించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల బ్యాన్‌ తొలి అడుగుగా అభివర్ణించిన సీఎం జగన్‌.. 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని ప్రకటించారు. ప్లాస్టిక్‌ నుంచి రీసైక్లింగ్‌ నుంచి తయారు చేసిన షూస్‌, కళ్ల జోడులను స్వయంగా ఆయన చూపించారు.


  ఇదీ చదవండి : సముద్రాన్ని కూడా వదలరా..? భయపెడుతున్న కొత్త మాఫియా?


  ప్లాస్టిక్‌ కాలుష్యం నియంత్రణలో భాగంగా.. పర్యావరణాన్ని రక్షిస్తూనే.. ఆర్థిక పురోగతి సాధించాలన్నారాయన. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేశాం అన్నారు. తరువాత ఎంవోయూ పై సంతకాలు జరిగాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Visakhapatnam

  ఉత్తమ కథలు