AP New Cabinet: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కొత్త మంత్రివర్గం (New Cabinet) కొలువు దీరింది. ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడి (Velagapudi) సచివాలయం ఆవరణలో ఇందుకు వేదికైంది. కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో మంత్రులుగా పనిచేసిన 11 మంది తిరిగి ప్రమాణ స్వీకారం చేయనునున్నారు. మొత్తం 25 మందితో నూతన మంత్రివర్గం కొలువుదీరనుంది. అంతకముందు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Bishwabushan Harchandan) కు సీఎం జగన్ స్వాగతం పలికారు.
ఆల్ఫా బెటిక్ ఆర్డర్ ప్రకారం మంత్రులు అంతా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో భాగంగా మొదట అంబటి రాంబాబు.. తరువాత అంజద్ బాషా.. ఆదిమూలపు సురేష్ అక్కడి నుంచి అదే ఆర్డర్ ఆల్ఫాబెట్స్ ఆధారంగా కొనసాగింది. సీఎం జగన్ ఈ కెబినెట్ కూర్పును చాలా ఆచి తూచి ఎంపిక చేశారు. పాత మంత్రుల్లో 11 మందికి.. కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు. ముఖ్యంగా బీసీలకు ఈ కేబినెట్ లో పెద్ద పీట వేశారు. అలాగే తరుత ఎస్పీ, కాపులకు కూడా పెద్ద పీట వేశారు. అయితే బ్రాహ్మణ, కమ్మ, క్షత్రియ, ఆర్యవైశ్యుల నుంచి ఒక్కరికి కూడా కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదు.
ఇదీ చదవండి : మంత్రి పదవి రావడంతో రోజా సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్ బై..!
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు
1. అంబటి రాంబాబు ( Ambati Rambabu) (సత్తెనపల్లి)
2. అంజద్ బాషా (Amzath Basha) (కడప)
3. ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) (యర్రగొండపాలెం)
4. బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) (చీపురుపల్లి)
5. బూడి ముత్యాలనాయుడు (Budi Muthyala Naidu) (మాడుగుల)
6. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) (డోన్)
7. చెల్లుబోయిన వేణుగోపాల్ (Chelluboina Venugopal) (రామచంద్రాపురం)
8. దాడిశెట్టి రాజా (Dadishetti Raja) (తుని)
9. ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao)(శ్రీకాకుళం)
10. గుడివాడ అమర్ నాథ్ (Gudivada Amarnath) (అనకాపల్లి)
11. గుమ్మనూరు జయరామ్ (Gummanuru Jayaram) (ఆలూరు)
12. జోగి రమేష్ (Jogi Ramesh) (పెడన)
13. కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) (సర్వేపల్లి)
14. కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao) (తణుకు)
15. కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) (తాడేపల్లిగూడెం)
16. కె.నారాయణ స్వామి (Narayana Swamy)(గంగాధర నెల్లూరు)
17. ఉషశ్రీ చరణ్ (Ushashree Charan ) (కల్యాణదుర్గం)
18. మేరుగ నాగార్జున (Meruga Nagarjuna) (వేమూరు)
19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) (పుంగనూరు)
20. పినిపె విశ్వరూప్ (Pinipe Vishwarup) (అమలాపురం)
21. పీడిక రాజన్నదొర (peedika Rajannadora) (సాలూరు)
22. ఆర్కే రోజా (RK Roja) (నగరి)
23. సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) (పలాస)
24. తానేటి వనిత (Taneti Vanitha)(కొవ్వూరు)
25. విడదల రజని (Vidudala Rajini) (చిలకలూరిపేట)
కొత్తగా కొలువు తీరిన కేబినెట్ లో ఎక్కుమంది మంత్రులు తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేస్తూ.. చాలా భావోద్వేగానికి చాలామంది గురియ్యారు. అయితే ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్.. అనంతపురం జిల్లాకు చెందిన ఉష శ్రీచరణ్.. చిత్తూరుకు చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంగ్లీషులో ప్రమాణం చేసారు. అధినేత జగన్ కు వీర విధేయులు అని ముద్ర ఉన్న.. గుడివాడ అమర్నాద్.. ముత్యాలనాయుడు.. జోగి రమేష్.. ఉషశ్రీ చరణ్.. మేరుగ నాగార్జున.. రాజన్న దొర.. విడదల రజనిలు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు.. సీఎం కు పాదాభివందనం చేసారు. సీఎం వారిని వారిస్తున్నా.. తమకు మంత్రులుగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet, AP News