Good News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు.. ముఖ్యంగా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు (Welfare Schemes) అందించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. గతంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. నేను ఉన్నాను.. నేను విన్నాను అని చెబుతూ అధికారం చేపట్టిన ఆయన.. అందులో భాగంగా ప్రతిపక్ష నేతగా ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్ధానాలను పూర్తి చేసే ప్రయత్నాల్లో భాగంగా మరో అడుగు ముందుకేశారు. తాజాగా హోంగార్డులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారి పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలను సవరించి హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్సీ, ఎస్ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతోపాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం.
సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో మహిళా, పురుష కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు వర్తింపజేశారు. ఏపీఎస్సీ, ఏస్ ఏఆర్ సీపీఎల్, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్, మోకానిక్, డ్రైవర్ కేటగిరీల్లో పురుష కానిస్టేబుల్ పోస్టులే భర్తీ చేయనున్నారు. దీంతో ఆ విభాగాల పోస్టుల భర్తీలో పురుష హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. కానిస్టేబుల్ నియామకాల్లో కేటగిరిలవారీగా 5 శాతం 25 శాతం వరకు హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ రూల్ 1999కి సవరణ చేస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి కానిస్టేబుల్ నియామకాల్లో ఈ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయాన.. త్వరలో 6,500 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్న నేపథ్యంలో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రాష్ట్రంలో 15,000 మంది హోంగార్డులకు ప్రయోజనం కలుగనుంది.
తమకు రిజర్వేషన్లు కల్పించాలని హోం గార్డులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో జగన్ పాదయాత్రలో ఆయన్ను కలిసిన హోం గార్డులు తమ కష్టాలు చెప్పుకున్నారు. అప్పుడు నేను ఉన్నాను.. నేను విన్నాను అని హామీ ఇచ్చిన ఆయన.. ఎట్టకేలకు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇదీ చదవండి : ముద్రగడ మళ్లీ యాక్టివ్ అవుతున్నారా.. వైసీపీ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ ఏంటి..?
హోంగార్డులకు ప్రయోజనం కల్పిస్తూ సీఎం జగన్ సరైన సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలికంగా పని చేస్తున్నప్పటికీ పోలీసు శాఖలో హోంగార్డులు తగిన గుర్తింపుకు నోచుకోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హోంగార్డుల జీతాలు పెంచింది. దీంతో అప్పటివరకు నెలకు 18000 మాత్రమే ఉన్న హోంగార్డుల జీతాన్ని 21,300కి పెంచుతూ 2019 అక్టోబర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes