Good News: సంక్షేమ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ముద్ర వేసుకున్నారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు (AP Welfare Schemes) అమలు చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. అన్ని వర్గాలను అసంతృప్తి పరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. కేంద్రం నుంచి నిధులు రాకున్నా.. సంక్షేమ పథకాలకు బ్రేక్ వేయడం లేదు.. కొత్త కొత్త పథకాలు ప్రవేశ పెడుతున్నారు. అన్ని పథకాల్లో లబ్ధి దారులను పెంచుకుంటూ వెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. సీపీఎస్ (CPS) ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.
దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ ను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత హోదాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ అది ఆచరణ సాధ్యం కావడం లేదు. దీంతో ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నారు. కానీ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేయాల్సిందే అంటూ ఉద్యోగుల ఆందోళనలు ఆగడం లేదు.
చాలా రోజులుగా ఉద్యోగులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 1న తాడేపల్లిలోని సీఎం ఇంటిని ముట్టడికి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. సీఎం ఇంటి ముట్టడికి ఉద్యోగులు రాకుండా ఏపీ పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. కొందరు ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. దీంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇటీవల ఉద్యోగ సంఘాలతో మంత్రుల ఉప సంఘం భేటీపై దీనిపై హామీ ఇచ్చారు. కచ్చితంగా కేసులు మాఫీ చేస్తామని హామీ ఇచ్చనట్టు టాక్.. అందులో భాగంగానే కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి : యంగ్ టైగర్ కు కమలం గాలం.. బీజేపీకి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర అయినట్టేనా..? టీడీపీ లెక్క ఏంటి..?
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్చకులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేవాదాయ శాఖ పరిధిలో ఆలయాల్లో పనిచేసే అర్చకులకు ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ కు దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ రాశారు. ఆయా అర్చకుల శాలరీ సర్టిఫికెట్ ఆధారంగా వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండి ఇంకా ఆరోగ్యశ్రీ కార్డులు అందని అర్చకుల కోసం ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కోరారు దేవాదాయ శాఖ కమిషనర్. ఈ ఏడాది డిసెంబర్ నిరాకరు నాటికి అర్హులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, Ap government, Ap welfare schemes