హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Good News: పేదలు, సామాన్యులకు మరో శుభవార్త చెప్పిన సీఎం.. వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో కీలక నిర్ణయాలు

Good News: పేదలు, సామాన్యులకు మరో శుభవార్త చెప్పిన సీఎం.. వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో కీలక నిర్ణయాలు

పేద, సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్

పేద, సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్

Good News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక ఫోకస చేస్తోంది.. పేదలకు.. సామాన్యులకు వైద్యాన్ని దగ్గర చేయాలనే లక్ష్యంతో.. ఆ రంగంలో పలు సంక్షేమ పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య శ్రీ పరిధిని రోజు రోజుకూ విస్తరిస్తూ.. అన్నింటికి ఉచిత చికిత్సలు అందించే ప్రయత్నాలు చేస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Good News: సంక్షేమ పథకాలకు (Welfare Schemes) కేరాఫ్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అని గుర్తింపు దక్కేలా చేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. ముఖ్యంగా విద్య.. వైద్య రంగాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. పేదలు, సమాన్యులకు ఉన్నత విద్య.. అత్యాధునిక వైద్యం అందాలని తాపత్రయ పడుతున్నారు. ముఖ్యంగా వైద్య రంగంలో ఇప్పటికే అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఆరోగ్య శ్రీ  (Argya Sri) పరిధిలోకి కొత్తగా 809 చికిత్సలు చేర్చుతున్న్టటు ప్రకటించి.. పేదలు, సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజా నిర్ణయంతో ఆరోగ్య శ్రీ చికిత్సలు మొత్తంగా 3,255కి చేరాయి. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే అధికంగా 2,196 చికిత్సలు అందిస్తున్నామన్నారు సీఎం జగన్. ఆరోగ్య శ్రీ పథకం అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎం జగన్.

టీడీపీ ప్రభుత్వంలో కేవలం ఆరోగ్య శ్రీ కింద 1059 చికిత్సలు అందిస్తుండగా వాటిని తమ ప్రభుత్వంలో 3,255కు పెంచినట్లు వివరించారు. మే 2019 నాటికి ఆరోగ్య శ్రీ వైద్య చికిత్సల సంఖ్య 1059 ఉండగా జనవరి 2020లో 2059 పెంచామన్నారు. వైద్యం ఖర్చు 1000 రూపాయలు పైగా ఖర్చయ్యే ప్రతి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చినట్లు తెలిపారు.

జులై 2020లో 2200, నవంబర్‌ 2020లో 2436, జూన్‌ 2021లో 2446కు, 2022లో 3255 కు పెంచిమన్నారు. అయితే చంద్రబాబు హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా 1299.01 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు 2894.87 కోట్లుగా ఉందని వివరించారు. టీడీపీ ప్రభుత్వం కన్నా మూడు రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి : వ్యూహం సినిమా అసలు కథ ఇదే.. రివీల్ చేసిన ఆర్జీవీ.. స్టోరీ ఏంటంటే?

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.. ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలకు సేవా మిత్ర, సేవా రత్న, ఉన్నత ఆరోగ్య సేవ అవార్డులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు సీఎం.

ఇదీ చదవండి : కూతురి వివాహానికి అదిరిపోయే గిఫ్ట్.. సీఎం జగన్ కానుకపై అలీ దంపతుల రియాక్షన్

ఆరోగ్య శ్రీ కింద అందుతున్న సేవలపై ఎంపానల్డ్, విలేజ్‌ క్లినిక్స్‌, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోర్డులు ఉంచుతున్నామని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి సమాచారంతో బుక్‌లెట్స్‌ కూడా ఇస్తున్నామన్నారు. ఆసుపత్రుల వివరాలు, అందుతున్న సర్వీసుల వివరాలు కూడా ఇందులో ఉంచుతున్నామని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తెలిపారు.

First published:

Tags: Aarogyasri, Andhra Pradesh, Ap cm jagan, AP News

ఉత్తమ కథలు