హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రతి స్కూళ్లో ఏర్పాటు..

CM Jagan: సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రతి స్కూళ్లో ఏర్పాటు..

సీఎం జగన్ సంచలన నిర్ణయం

సీఎం జగన్ సంచలన నిర్ణయం

CM Jagan: విద్యా, వైద్యం రంగాలపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు రంగాలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. ఆయ రంగాల్లో సమూల మార్పులకు కీలక ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఏపీలో ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. మరో సంచల నిర్ణయం తీసుకున్నారు.. ముఖ్యంగా విద్యా, వైద్య (Education and Health) రంగాలపై ప్రత్యేక ఫోకస్ చేసిన ఆయన.. ఇప్పటికే పలు మార్పులు చేశారు.. ప్రభుత్వ ఆస్పత్రులు.. పాఠశాల (Government Hospitals and Schools) రూపు రేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మఖ్యంగా పేదల ఉన్నత విద్యకు పెద్ద పీట వేస్తూ.. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు (Welfare Schemes) ప్రవేశ పెట్టారు.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో జగనన్న విద్యా కానుకపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుక కింద అన్నిరకాల వస్తువులు అందించేలా కార్యాచరణ సిద్ధం చేశామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యా కానుక కచ్చితంగా అందాలని సీఎం జగన్ సూచించారు. యూనిఫామ్స్‌ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో వేయాలన్నారు.

  స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్‌ కమిటీలను నిరంతరం యాక్టివేట్‌ చేయాలన్నారు. స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు విలేజ్‌ క్లినిక్‌ ద్వారా నివేదికలు పంపించాలన్నారు. పారిశుద్ధ్య, నీటిలో నాణ్యతా లోపం వల్ల వచ్చే రోగాలను నివారించడానికి అవకాశం ఉంటుందన్నారు.

  అటు తరగతి గదుల డిజిటలీకరణలో భాగంగా స్మార్ట్‌, ఇంటరాక్టివ్‌ టీవీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. దాని కోసం దాదాపు 72,481 యూనిట్ల టీవీలు అవసరమని అధికారులు అంచనా వేశారు. వాటిని దశల వారీగా తరగతి గదుల్లో టీవీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీని కోసం 512 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి దశలో తరగతి గదుల డిజిటలైజేషన్‌ జరగేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

  ఇదీ చదవండి : వేల కోట్ల భూముల కబ్జాకు స్కెచ్.. జనసైనికుల ఫిర్యాదుతో వెలుగులోకి భారీ స్కామ్..!

  అలాగే అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా చూడాలన్నారు. డిజిటల్‌ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌లలో కూడా ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు టీచర్లు, విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా 5,18,740 ట్యాబ్‌లు కొనుగోలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్ కూడా పొందుపరిచి విద్యార్థులకు అందిస్తారు.

  ఇదీ చదవండి : పొలం పని చేసుకుని ఇంటికి వచ్చిన అన్నకు షాక్.. తమ్ముడితో భార్యను అలా చూసి.. ఏం చేశాడో తెలుసా?

  సీఎం జగన్‌ కీలక ఆదేశాలు..

  స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందాలన్న సీఎం

  యూనిఫామ్స్‌ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి వేయాలన్న సీఎం

  స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్‌ కమిటీలను నిరంతరం యాక్టివేట్‌ చేయాలని సీఎం ఆదేశం

  స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలన్న సీఎం

  పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తీసుకురావాలి

  ఎప్పకప్పుడు విలేజ్‌ క్లినిక్‌ ద్వారా నివేదికలు పంపించాలన్న సీఎం

  నివేదికలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలి

  స్కూళ్ల నిర్వహణలో భాగస్వామ్యం కానున్న సచివాలయ ఉద్యోగులు

  ప్రతివారం స్కూళ్లను వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు సందర్శన

  నెలకోసారి ఏఎన్‌ఎం సందర్శన

  ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై ఎస్‌ఓపీ తయారు

  స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోగ్రాఫ్‌లతో సహా అప్‌లోడ్‌

  వెంటనే తగిన చర్యలు తీసుకోనున్న అధికారులు

  టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని

  5,18,740 ట్యాబ్‌లను కొనుగోలు

  ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌

  తరగతి గదులను డిజిటలీకరణ చేయాలి

  స్మార్ట్‌ టీవీలను, ఇంటరాక్టివ్‌ టీవీల ఏర్పాటు

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News

  ఉత్తమ కథలు