Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY REVIEW MEETING ON RAJAM CONSTANCY IN VIZIANAGARAM NGS GNT

CM Jagan: ప్రజలకు మంచే చేస్తున్నాం.. ఓట్లు రూపంలో మార్చే బాధ్యత మీదే..? కార్యకర్తలకు సీఎం సూచన

 సీఎం జగన్ ఫైల్

సీఎం జగన్ ఫైల్

CM Jaganmohan Reddy: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ 2024 లక్ష్యంగా దూసుకుపోతున్నారు.. 175 నియోజకవర్గాల్లో గెలుపే తన లక్ష్యం అంటున్నారు.. ఇందులో భాగంగా ఆయనా నియోజకవర్గాల కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతున్నారు. తొలి రోజు కుప్పం కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆయన.. రెండో రోజు రాజం కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఆయనేమన్నారంటే?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  CM Jaganmohan Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పూర్తి పార్టీపై ఫోకస్ చేస్తున్నారు. ఆయన చాలా రోజుల ముందే.. ఎన్నికల మూడ్ లోకి వెళ్లినట్టు కనిపిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు అన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేకపోయినా.. సీఎం జగన్ తీరు చూస్తే త్వరలోనే ఎన్నికలు ఉంటాయనే అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ఎన్నికలు ఎప్పుడైనా.. గెలుపే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఓ వైపు మంత్రులు.. ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టారు. గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) పేరుతో..? ప్రోగ్రస్ పెంచుకోవాలని ఆదేశాలు చేశారు. మరోవైపు ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. నేరుగా 175 నియోజకవర్గాల కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు కుప్పం (Kuppam) నియోజకవర్గానికి చెందిన 60 మందితో మాట్లాడి.. భరత్ ను గెలిపించండి.. మంత్రి పదవి ఇస్తాను అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు.. ఇక రెండో రోజు రాజాం (Rajam) నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం ‌సమావేశం అయ్యారు. గతంలో ఉన్న ప్రభుత్వ పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకూ ఉన్న తేడాను గమనించండి అని సూచించారు. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మనం చేసిన మంచిని మరింత విపులంగా చెప్పాలని సూచించారు. మనం చేసిన మంచిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలి అన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకన్నా.. ఈసారి మరింతపెరగాలి. రాజాం నియోజకవర్గానికి సంబంధించి కేవలం డీబీటీ కిందే 775 కోట్లు ఇచ్చాం అని సీఎం వివరించారు.

  అలాగే ప్రతి ఇంటికీ వారి వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశామని గుర్తు చేశారు. మేనిఫెస్టో ద్వారా చేసిన వాగ్దానాల్లో 95శాతం నిలబెట్టుకున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ గడపగడపకూ కార్యక్రమంలో ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ వాస్తవాలు అయితేనే మళ్లీ మా ప్రభుత్వాన్ని, జగనన్నను ఆ శీర్వదించండి అని ధైర్యంగా అడగాలి అన్నారు. మనం మంచి చేసిన తర్వాతనే ప్రతి ఇంటికీ వెళ్లి ఆశీస్సులు అడుగుతున్నామన్నారు. ఈ నియోజకవర్గంలో 12,403 ఇంటి స్థలాలు ఇచ్చాం అన్నారు జగన్.  దాదాపు 240 కోట్ల రూపాయలు విలువైన ఇంటి పట్టాలు ఇచ్చామన్నారు. వీటిలో 9,509 ఇళ్లను ఇప్పుడు కడుతున్నామన్నారు. వీటి విలువ కనీసంగా మరో 171 కోట్ల రూపాయలు ఉంటుంది అన్నారు. ఇంత మంచి చేసిన తర్వాతనే ప్రతి ఇంటికీ వెళ్లి ఆశీస్సులు అడిగే కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ ధైర్యంగా వెళ్లగలుగుతున్నాం. అర్హత ఉండీ రాని పరిస్థితి లేదు. ఇక మనం చేయాల్సింది.. చేసిన మంచిని ఓట్ల రూపంలో మార్చుకోవాలని.. ఆ పని కార్యకర్తలే చేయాలి అన్నారు.

  ఇదీ చదవండి : ఒక్కసారి ఈ జెండాను చూడాలంటే కష్టమే..? త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ.. పొడుగు ఎంతంటే?

  పార్టీ పరంగా జిల్లా, మండలస్థాయి, గ్రామ స్థాయి వరకూ కమిటీలు ఏర్పాటు కావాలి. దాదాపు 24 అనుబంధ విభాగాలు మనకు ఉన్నాయి అన్నారు. ఈ విభాగాలన్నింటికీ కమిటీలు ఏర్పాటు కావాలి. ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలి. బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. వీలైనంత వరకూ ప్రతి కమిటీలో కూడా కచ్చితంగా యాభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూసుకోవాలి. మొత్తం కమిటీలో యాభైశాతం మహిళలు ఉండేలా చూడాలి.వీరిని భాగస్వామ్యం చేయాలి. సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున ప్రాధాన్యతా పనులకు మంజూరు కూడా చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమాలే... మళ్లీ మనం అఖండ మెజార్టీతో గెలిచేలా చేస్తాయి అన్నారు. అందుకే ఈసారి మన టార్గెట్‌ 151 కాదు, 175 కి 175 సీట్లు గెలవడం అంటూ స్పష్టం చేశారు.

  ఇదీ చదవండి : వరలక్ష్మీ వ్రతం మహత్యమా..? గడప ముందుకే వచ్చి పిండకుండానే పాలిస్తున్న గోమాత.. మీరే చూడండి

  ఈ టార్గెట్‌ పెద్ద కష్టం కాదన్నారు. మీ నియోజకవర్గంలో ఏమేర లబ్ధి జరిగిందో, ప్రతి నియోజకవర్గంలోనూ జరిగింది. 87శాతం కుటుంబాలకు పథకాలు అందాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఘనవిజయాలు సాధించామన్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Vizianagaram

  తదుపరి వార్తలు