Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY RELEASED VIDYA DIVENA THRID QUARTER AMOUNT NGS GNT

CM Jagan: ఏపీలో ప్రతి పేదవాడి చదువు బాధ్యత నాదే.. విద్యాదీవెన కింద రూ. 709 కోట్లు జమ చేసిన సీఎం.. నగదు రాకుంటే ఇలా చేయండి

సీఎం వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

Jagananna Vidya Deevena: రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్ధి చదువు బాధ్యత తనదే అన్నారు సీఎం జగన్.. తాజాగా జగనన్న విద్యా దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. మొత్తం 709 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలోల నిధులు జమ చేశారు.

  Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Ap cm YS Jagan Mohan Reddy).. రాష్ట్రంలో ఏ తల్లికీ బిడ్డలను చదివించేందుకు పేదరికం అడ్డుకాకూడదనే ఆలోచనతో ఏపీ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ‘జగనన్న అమ్మ ఒడి (Jagananna Amma Vodi)’ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 44,48,865 మంది తల్లు ఖాతాల్లో నేరుగా 15 వేల రూపాయల చొప్పున జమ చేస్తోంది. అమ్మ ఒడి పథకంతో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సుమారు 84 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందుతున్నారు. ఇక జగనన్న విద్యా దీవెన (Jagananna Vidya Divena) కింద అక్టోబర్ ‌- డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో 709 కోట్లను బుధవారం సచివాలయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ దొంగిలించలేని ఆస్తి.. చదువే అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలని.. విద్య ద్వారా మాత్రమే నాణ్యమైన జీవితం సాకారమవుతుందన్నారు.

  ఈ పథకం కింద ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోందన్నారు. పాఠశాల విద్య కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 27,706.66 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయింపులను ప్రతిపాదించిందన్నారు. ఇది గత సంవత్సర కేటాయింపుల కంటే 12.52 శాతం ఎక్కువగా ఉందన్నారు. జగనన్న విద్యా దీవెన.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు వారి కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోందన్నారు సీఎం జగన్.

  ఇదీ చదవండి : మూడో రోజూ అసెంబ్లీలో సేమ్ సీన్.. మరోసారి 11 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్

  ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నీరు సీఎం జగన్. ఇంతమంచి కార్యక్రమం చేసే అవకాశం దేవుడు తనకు ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. తనకు సంతోషాన్ని కలిగించే కార్యక్రమాల్లో విద్యాదీవెన, వసతి దీవెన ఒకటి అన్నారు. 100శాతం లిటరసీ ఉన్న సమాజాలు ఎలా ఉంటాయో గమనించాలి అన్నారు. విద్య ఉన్న కుటుంబాలకు, విద్య లేని కుటుంబాలకు చాలా తేడా ఉంటుందన్నారు. ఒక గ్రామం నుంచి ఒకరు డాక్టరు అయితే కుటుంబం మాత్రమే కాదు, ఊరు కూడా బాగు పడుతుందని అని గుర్తు చేశారు. కేవలం చదువులు వల్లనే వాళ్లు ఆ స్థాయికి వెళ్తారు అన్నారు. చదువులకోసం పేదరికం అడ్డు రాకూడదన్నారు. చదువులు ఆపే పరిస్థితి రానే రాకూడదని నేను గట్టిగా నమ్మాను అన్నారు. చదువులు కారణంగా అప్పులు పాలయ్యే పరిస్థితి ఎప్పుడూ రాకూడదన్నారు.

  ఇదీ చదవండి : బీజేపీ ప‌వ‌న్ కు ఇవ్వ‌బోయే రూట్ మ్యాప్ ఏంటి? టీడీపీ నుంచి సీఎం ఆఫర్ వచ్చిందా?

  దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి రీయింబర్స్‌మెంట్‌తీసుకు వస్తే.. తరువాత పాలకులు, మొన్నవరకూ చూస్తే.. మొక్కుబడి ఇచ్చారని.. అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి నెలకొంది అన్నారు. మొత్తం స్కీంను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు స్కీంను మనం వచ్చాక బాగా మార్పులు చేశామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన వారందరికీ కూడా పూర్తి ఫీజురియింబర్స్‌ మెంట్‌ అమలు చేస్తున్నామన్నారు జగన్. ఎలాంటి అరియర్స్‌ లేకుండా.. ప్రతి త్రైమాసికానికీ చెల్లిస్తున్నామన్నారు. బోర్డింగ్‌ ఖర్చులు కూడా వసతి దీవెన కింద ఇస్తున్నాం అన్నారు. అయితే ఈ నగదు ఎవరికైనా రాకపోతే ఆందోళన అవసరం లేదన్నారు.. సచివాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే.. అన్ని పరిశీలించి.. వెంటనే నగదు అందుతుందని భరోసా ఇచ్చారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు