Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY RELEASED VIDYA DEEVENA FUNDS IN BAPTLA NGS GNT

CM Jagan: దోచుకోనే అవకాశం లేదనే విపక్షాల మంట.. ఏపీ చేసే అప్పులు తక్కువే అన్న సీఎం జగన్

విద్యాదీవెన నగదు విడుదల

విద్యాదీవెన నగదు విడుదల

CM Jagan on Vidya Deevena: దోచుకోవడానికి.. దాచుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదనే విపక్షాలు కడుమంటతో ఉన్నాయి అంటూ మండిపడ్డారు సీఎం జగన్.. పేదలకు పెద్ద పండుగలా సంక్షేమాలను అందిస్తుంటూ తట్టుకోలేకపోతున్నారి ఆవేదన వ్యక్తం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India
    CM Jagan on Opposition Parties:   ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పేద విద్యార్థులకు తీపి వార్త అందించారు.. 2022 ఏప్రిల్-జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేశారు. 694 కోట్ల రూపాయలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (CM Jagan Mohan Reddy) బటన్‌ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా ఏపీలో విపక్షాల విమర్శలపై తీవ్రంగా మండిపడ్డారు. పథకాలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ పథకాలను గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. గత పాలనలో రాష్ట్రంలో నలుగురే బాగుపడ్డారని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వారికి కడుపుమంట కలుగుతోంది అన్నారు. దోచుకోవడం.. దాచుకోవడం.. పంచుకోవడం అనే దానికి మనం అడ్డుకట్ట వేశాం కాబట్టే విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అలాంటి వారు నాకు తోడుగా లేకపోయినా.. ప్రజలు అందరి దీవెనలు అండగా ఉన్నాయి అన్నారు.

    మన ప్రభుత్వం (AP Government) వచ్చాక డీబీటీ (DBT) ద్వారా పేదలకు నేరుగా సంక్షేమ ఫలాల (Welfare Schemes) ను అందిస్తున్నామని.. అదే గత పాలకులకు మనకు తేడా అన్నారు సీఎం జగన్. జగనన్న విద్యాదీవెన (Jagananna Vidya Deevena) , వసతి దీవెన (Vasathi Deevena) కింద ఇప్పటి వరకు 11,715 కోట్లు నేరుగా అందించాంమని గుర్తు చేశారు. చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాటు కాకూడదన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం మనం చెల్లించామని గుర్తు చేశారు. 

    చదువుకు పేదరికం అడ్డుకదాన్నదే తమ ప్రభుత్వం లక్ష్యం.. పేద విద్యార్థులకు మంచి చదువు చెప్పడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నాం. అమ్మఒడి, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, మనబడి నాడు-నేడు, ఇంగ్లీష్‌ మీడియం, బైజ్యూస్‌తో ఒప్పందం ఇలా విద్యారంగంపై మూడేళ్లలో 53వేల కోట్లు ఖర్చుపెట్టామన్నారు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.

    ఇదీ చదవండి : నాన్ వెజ్ ప్రియులకు షాక్.. శ్రావణమాసంలోనూ చికెన్ ధర ఎందుకు పెరిగింది..? కేజీ ఎంతంటే?

    పెద్ద చదువులు కూడా పేదలకు హక్కుగా మార్చాం. పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువే. ప్రపంచంతో పోటీ పడే విధంగా పిల్లలకు శిక్షణ అందిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే నా ఆకాంక్ష. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చాం. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరినీ చదివించండి. ప్రతి ఇంటి నుంచి ఇంజినీర్లు, డాక్టర్లు, ఐపీఎస్‌లు రావాలి. మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది అని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Ap cm jagan, Ap government, Ap welfare schemes, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు