CM Jagan: ఆంధ్ర్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అన్ని పార్టీల కంటే దూకుడుగా వెళ్తోంది. 175కు 175 స్థానాలు నెగ్గడమే లక్ష్యంగా సీఎం జగన్ (CM Jagan) అడగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే పార్టీ కీలక నేతలకు షాక్ ఇస్తూ.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevi Reddy Baskhar Reddy) కి భారీ ప్రమోషన్ ఇచ్చారు. రీజనల్ కో ఆర్డినేటర్ నియామకంలో మార్పులు చేసింది.. కొంత మందిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ..
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్‌గా మంత్రి బొత్స సత్యనారాయణను నియమించిన పార్టీ.. విజయనగరం, విశాఖపట్నం , అనకాపల్లి జిల్లాలకు టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని నియమించారు.. ఇక, తూర్పు గోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డిని వ్యవహరించనున్నారు.
కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్ , ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని నియమించారు సీఎం వైఎస్ జగన్. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు బీద మస్తాన్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి రీజినల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు.. నెల్లూరు , తిరుపతి, కడప జిల్లాలకు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కో-ఆర్డినేటర్‌గా స్థాన చలనం కల్పించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్య సాయి, అనంతపురం జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు.
డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్, ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డికి సహాయకారిగా చెవిరెడ్డి వ్యవహరిస్తారని తెలిపింది. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. పార్టీలోని 23 అనుబంధ విభాగాల రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా అత్యంత కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ప్రతి అనుబంధ విభాగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు రేయింబవళ్లు నిర్విరామంగా పని చేస్తానని చెప్పారు.
ఇదీ చదవండి : ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ మిస్సింగ్ అంటూ ఫిర్యాదు.. పోయిందా లేక పడేశారా..?
వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ల జాబితా ఇదే
శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల కోఆర్డినేటర్‌గా బొత్స సత్యనారాయణ
విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డి
కాకినాడ, తూగో, కోనసీమ, పగో, ఏలూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్, మిథున్‌రెడ్డి
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి
పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కోఆర్డినేటర్లుగా బీద మస్తాన్‌రావు, భూమన కరుణాకర్‌రెడ్డి
నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్లుగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల కోఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కర్నూలు, నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్లుగా ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chevireddy bhaskar reddy, Ycp