హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan Election Team: ఏపీ కొత్త సీఎస్ జవహర్ రెడ్డి.. సమీర్ శర్మకు కొత్త పోస్టు.. కీలక అధికారులు బదిలీ

CM Jagan Election Team: ఏపీ కొత్త సీఎస్ జవహర్ రెడ్డి.. సమీర్ శర్మకు కొత్త పోస్టు.. కీలక అధికారులు బదిలీ

 సీఎం జగన్ కొత్త ఎన్నికల టీం

సీఎం జగన్ కొత్త ఎన్నికల టీం

CM Jagan Election Team: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల టీంను రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీలో కీలక మార్పులు చేసిన ఆయన.. ఇప్పుడు అధికారుల విషయంలోనూ కొత్త టీంను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే సీఎస్ గా జవహర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.. సమీర్ శర్మ కోసం కొత్త పోస్టు క్రియేట్ చేశారు.. అలాగే కీలక అధికారులను బదిలీ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

CM Jagan Election Team: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హడావుడి మొదలైంది. ముందస్తు ఎన్నికల ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) వ్యూహాలు సైతం ఆ దిశగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో ప్రక్షాళణ చేస్తూనే ఉన్నారు. జిల్లా అధ్యక్షులను మార్చారు.. ప్రాంతీయ సమన్వయ కర్తలను కూడా మార్చారు. కీలక నేతలను కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు పాలనపైనా ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా అధికారుల బదిలీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. రేపు సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.. అలాగే ఇప్పటి వరకు సీఎస్‌గా కొనసాగుతోన్న సమీర్‌ శర్మ.. రేపు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. 

ఇప్పటికే రెండుసార్లు పదవి పొడిగింపు పొందిన సమీర్‌ శర్మను వదులుకోవడానికి సిద్ధంగా లేరు సీఎం వైఎస్‌ జగన్.. అందుకే 2023 నవంబర్‌ వరకు ఆయన పదవీకాలం పొడిగించాలంటూ కేంద్రాన్ని మరోసారి కోరారు.. అయితే ఢిల్లీ నుంచి అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో రేపు పదవీ విరమణ చేయనున్నారు సమీర్‌ శర్మ..

సమీర్ శర్మ పై ఉన్న నమ్మకంతో కోసం కొత్త పోస్టును క్రియేట్ చేశారు సీఎం వైఎస్‌ జగన్.. సీఎస్ సమీర్ శర్మ సీఎంకు చీఫ్ ఎగ్జిక్యూటీవుగా నియమించారు. ఇదే సమయంలో.. రేపు రిటైర్ కానున్న విజయ్ కుమార్‌ సేవలను కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయానికి వచ్చారు.. స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. 2021 అక్టోబర్‌ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు సమీర్‌శర్మ.. వాస్తవానికి ఆయన 2021 నంబర్‌ 30న రిటైర్‌ కావాల్సి ఉన్నా.. ఏపీ ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం ఆయన సేవలను మరో ఆరు నెలలు పొడిగించింది. 2022 మే 30 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమీర్‌ శర్మ పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని కేంద్రాన్ని కోరడం.. మళ్లీ కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇప్పటి వరకు ఆయన సీఎస్‌గా కొనసాగుతూ వచ్చారు.. అయితే 2023 నవంబర్‌ వరకు ఆయన పదవీకాలం పొడిగించేందుకు వైసీపీ సర్కార్‌ ప్రయత్నించింది. కానీ, కేంద్రం పచ్చజెండా ఊపకపోవడం.. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న తరుణంలో పదవీ విరమణ ఖాయమైంది..

ఇదీ చదవండి : లంబసింగిలో సరికొత్త ఆహ్లాదంతో పాటు థ్రిల్లింగ్.. ఆహ్వానం పలుకుతున్న బోటు షికారు..

ఇదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే కీలక ఐఏఎస్‌ అధికారులను కూడా బదిలీ చేసింది.. సీఎంవో స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన రెడ్డి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేశారు.. సెలవుపై వెళ్లిన బుడితి రాజశేఖర్‌ను.. సెలవు నుంచి తిరిగొచ్చిన తర్వాత జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.. ఆర్ అండ్ బీ సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనరుగా రాహుల్ పాండే. హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics

ఉత్తమ కథలు