Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY ON CABINET EXPANSION AND SERIOUS WARNING TO MLAS NGS GNT

Jagan On MLAs: ఇలా అయితే కష్టమే.. ఇంటింటికీ వెళ్లండి.. ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ వార్నింగ్..? జగన్ లెక్క ఇదే.. కేబినెట్ విస్తరణ ఎప్పుడంటే?

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

Jagan On MLAs: ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా.. సానుకూలత ఉందా..? ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది.. సీఎం జగన్ మాత్రం.. ప్రజా ప్రతినిధులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. గెలవాలంటే ప్రజల్లో ఉండాల్సిందే అంటూ హెచ్చరించారు.. మరి జగన్ మాటల వెనుక అర్థం ఏంటి..? అలాగే కేబినెట్ విస్తరణపైనా క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  Jagan On MLAs: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం.. వైఎస్ఆర్సీపీ (YSRCP) అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy).. ఎమ్మెల్యేలప కన్నెర్ర చేశారు. బీకేర్ ఫుల్ అంటూ ముందుగానే హెచ్చరించారు.. గెలవాలంటే  ప్రజల్లో ఉండాల్సిందే అని.. లేదంటే ఎంత గొప్ప ఎమ్మెల్యే అయినా ఓటమి తప్పదనే సంకేతాలు ఇచ్చారు.  దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. సీఎం జగన్ వ్యాఖ్యలకు ఒక్కొక్కరు ఒక్కొలా అర్థం చెబుతున్నారు. ఎవరి విశ్లేషణ ఎలా ఉన్నా.. సీఎం జగన్ మాత్రం ఎమ్మెల్యేలకు ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి.. అలాగే ఉగాది నాటి నుంచి కొత్త కేబినెట్ కొలువు దీరుతుందనే ప్రచారానికి తెరదింపారు. వైసీపీ ప్లీనరీ తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. జూలై 8న ప్లీనరీ ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. అలాగే పదవులు పోయాయని మంత్రులు ఎవరూ అసంతృప్తిని దరిచేరనీయ వద్దన్నారు. మంత్రి పదవి నుంచి తొలగించిన వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్ష పదవులు, రీజినల్ కో-ఆర్డినేటర్లుగా బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చారు.

  ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా నియమిస్తున్నట్టు స్వయంగా జగనే చెప్పడంతో.. కేబినెట్ విస్తరణ ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఎవరి పదవి ఊడుతుందో.. ఎవరికి కొత్తగా పదవి దక్కతుందో అనే ఉత్కంఠ నెలకొంది. కేవలం నలుగురు, ఐదుగురు మినహా మిగతా కేబినెట్‌ ను మొత్తం ప్రక్షాళన చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  ఇదీ చదవండి : జూనియర్ ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ కు ఏపీ ప్రభుత్వం బిగ్ రిలీఫ్..?

  కొత్త జిల్లాల ప్రతిపాదికన.. కొత్తవారికి కూడా ఛాన్స్‌ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని సమాచారం. సామాజిక సమీకరణాలు సహా అన్నింటిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ కేబినెట్ ను విస్తరించాల్సి ఉంది. అందుకే సీఎం జగన్‌.. కేబినెట్‌ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. కాగా, మంత్రిపదవులు రాని వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్‌ చెప్పారు.

  ఇదీ చదవండి : మంత్రులుగా కొనసాగేది వీరే.. ఆయనకు కీలక పదవి.. కొత్త ఎమ్మెల్యేలకు ఛాన్స్.. జగన్ ఫార్ములా ఇదే

  సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన వైసీపీ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యవహారాల విషయంలో కీలక మార్పులు చేస్తూ జగన్ ప్రకటన చేశారు. కొత్త జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించనున్నారు. పార్టీ రీజనల్ ఇంచార్జ్ ల విషయంలో పలు మార్పులు చేయనున్నారు. వచ్చే రెండేళ్లు పార్టీ రాజకీయ కార్యాచరణపై ప్రకటన చేయనున్నారు జగన్. సర్వే రిపోర్టుల ఆధారంగా పనితీరుపై ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు సీఎం జగన్.

  ఇదీ చదవండి : సిట్టింగ్ లకు షాక్..! సగానికిపైగా ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో నో సీట్.. ఆ జాబితాలో ఎవరున్నారు?

  అలాగే ఎమ్మెల్యే పని తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. చాలామంది ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండడం లేదనే అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వారికి వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే ఏం చేయాలని అన్నదానిపై దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2 నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఉంటుందని జగన్ అన్నారు. మొత్తం 8 నెలల పాటు గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇకపై సరిగా పని చేయని వారికి ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పారు. మళ్లీ వచ్చి తనను టికెట్ అడగొద్దని క్లియర్ గా తేల్చి చెప్పేసారు.

  ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చాలామంది ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి.. ఈరోజు నుంచి ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. ప్రతిరోజూ నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తానని సీఎం జగన్ చెప్పారు. ఇప్పటివరకు ఏయే నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సమగ్ర నివేదిక తన దగ్గర ఉందన్నారు జగన్. కొంతమంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నాయని, వారంతా వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. కష్టపడి పని చేయకపోతే ఇబ్బంది పడతారని హెచ్చరించారు జగన్. ఎమ్మెల్యే ప్రతి కదలిక నమోదవుతుందన్నారు ఎమ్మెల్యేలతో చెప్పారు. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సంపాదించే దిశగా నేను పని చేస్తున్నా అని జగన్ చెప్పారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News, AP Politics

  తదుపరి వార్తలు