హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. శాశ్వత అధ్యక్ష పదవిపై సజ్జల క్లారిటీ

CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. శాశ్వత అధ్యక్ష పదవిపై సజ్జల క్లారిటీ

సీఎం జగన్ సంచలన నిర్ణయం

సీఎం జగన్ సంచలన నిర్ణయం

CM Jagan: వైసీపీ శాశ్వత అధ్యక్షుడు పదవిపై రచ్చ ఆగడం లేదు. ఇటీవల ఆ పదవి చెల్లదంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో.. జగన్ పై నా.. ఆ పార్టీపైనా ట్రోల్స్ మొదలయ్యాయి. ఆ విమర్శలను తిప్పి కొడుతూ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సజ్జల ఏమన్నారంటే?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ని అధికార వైసీపీ (YCP) గత జులైలో ప్లీనరీ నిర్వహించింది. అయితే ఈ సమావేశాల వరకు వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తల్లి విజయమ్మ ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పటికే దానిపై ముందుగా ప్రచారం జరగడంతో అంతా ఊహించిందే జరిగింది. అంతా ఊహించినట్టుగానే ఆమె ఆ పదవికి రాజీనామా చేయడంతో.. పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక దాదాపు లాంఛనమైంది. కానీ అప్పుడు ఎవరూ ఊహించని విధంగా పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ పార్టీ సభ్యులు ఎన్నుకున్నారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓ నియంత మాత్రమే ఇలా తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకుంటారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) వైసీపీకి షాక్ ఇచ్చింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని పేర్కొంది. పార్టీలో శాశ్వత పదవులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేసింది.

  ఈసీ ఆదేశాలతో వైసీపీపై మళ్లీ విమర్శల వర్షం మొదలైంది. తాజాగా ఈ విషయంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పష్టత ఇచ్చారు. జగన్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు కాదన్నారు. దీనిపై ఆయన గతంలో నిర్ణయం తీసుకున్నారని సంచలన విషయాలు బయట పెట్టారు. కేవలం పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఐదేళ్లే ఉంటారని వెల్లడించారు. జీవితకాలం అధ్యక్ష పదవిని చేపట్టేందుకు జగన్‌ తిరస్కరించారని ఆయన తెలిపారు.

  పార్టీ అధ్యక్ష పదవికి ఎవరూ శాశ్వతంగా ఉండరని, దీనిపై ప్రజలకు మీడియా ద్వారా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ బుధవారం వైసీపీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన విషయం తెలిసిందే. వైసీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతానికి జగన్‌ ఉంటారని స్పష్టం చేశారు సజ్జల. నిజానికి పార్టీ శాశ్వత అధ్యక్ష పదవిని స్వీకరించడం జగన్‌కు అసలు ఇష్టం లేదన్నారు. అందుకే ఆ పదవిని చేపట్టేందుకు జగన్ తిరస్కరించారని సజ్జల వివరణ ఇచ్చారు.

  ఇదీ చదవండి : ఆయన ఈయనేనా..? ఈ మార్పుకు కారణం అదేనా..? వైరల్ అవుతున్న ఫోటోలు

  ఆయన అప్పుడే దీనిపై నిర్ణయం తీసుకోవడంతో శాశ్వత అధ్యక్షుడి అంశం ప్లీనరీ మినిట్స్‌లోకి ఎక్కలేదని తెలిపారు. అందువల్ల పార్టీకి శాశ్వత అధ్యక్షుడు ఎవరూ లేరని సజ్జల పేర్కొన్నారు. జగన్ శాశ్వత అధ్యక్షుడిగా అంగీకరించకపోవడంతో ఆయన ఐదేండ్ల కాలానికి మాత్రమే ఆ పదవిలో ఉంటారని, ఆ తర్వాత తిరిగి ఎన్నిక జరుగుతుందని చెప్పారు సజ్జల. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపినట్లు వెల్లడించారు సజ్జల. దీనిపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన మాట వాస్తవమేనని, అందుకు సంబంధించి వివరణను కమిషన్ ఇప్పటికే పంపించడం జరిగిందన్నారు సజ్జల

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Sajjala ramakrishna reddy

  ఉత్తమ కథలు