హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM vs Minster: అసలే అసంతృప్తిలో మంత్రి.. ఇప్పుడు బొత్సను ఇరుకున పడేసిన సీఎం జగన్.. ఏం జరిగిందంటే?

CM vs Minster: అసలే అసంతృప్తిలో మంత్రి.. ఇప్పుడు బొత్సను ఇరుకున పడేసిన సీఎం జగన్.. ఏం జరిగిందంటే?

మంత్రి బొత్సను ఇరుకున పెట్టిన సీఎం జగన్

మంత్రి బొత్సను ఇరుకున పెట్టిన సీఎం జగన్

CM vs Minster: మంత్రి కాదంటే.. సీఎం అవునంటున్నారు.. మరి ఇద్దరిలో ఎవరు రైట్.. ఆ శాఖ మంత్రి అలాంటిది ఏం లేదని పదే పదే చెబుతంటే..? సీఎం మంత్రి అవును నిజమే జరిగిందని ఒప్పుకుంటున్నారు.. ఇప్పటికే ఆ శాఖపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ మంత్రిని సీఎం ఇప్పుడు మరింత ఇరాకాటంలో పెట్టినట్టైంది. మరి దీనిపై బొత్స ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇంకా చదవండి ...

CM vs Minster: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh ) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) వ్యాఖ్యలు.. తన కేబినెట్ లో ఉన్న సీనియర్ మంత్రిని ఇరుకున పెట్టాయి. అంత ప్రాధాన్యం ఉన్న శాఖ ఇవ్వలేదని.. మంత్రి బొత్స సత్యనారాయణ (Minster Botsa Satyanarayana) తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేబినెట్ విస్తరణ జరిగి నెల దాటుతున్నా.. ఇప్పటికీ ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. శాఖపరమైన రివ్యూలకు హాజరు కావడం లేదు. తన నిరసనను నేరుగా సీఎం తెలపాలని ప్రయత్నించినా అవకాశం దొరకడం లేదు. దీంతో పూర్తి ఫ్రస్టేషన్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగట్టే ఉన్నాయి ఇటీవల ఆయన వ్యాఖ్యలు.. ఇలాంటి సమయంలో స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డే.. మంత్రి బొత్సాను ఇరకాటంలో పడేశారు. గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల (10th Class Exams) నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేపేర్లు లీకవ్వడం.. మాస్ కాపీయింగ్ జరుగుతుండడంతో విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరిపై చర్యలకు కూడా సిద్ధమైంది ప్రభుత్వం.

తాజాగా జగనన్న విద్య దీవెన (Jagananna Vidya Divena) కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Prdesh) సీఎం జగన్ (CM Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం విద్య దీవెన పధకం అమలు చేస్తుంటే..? విపక్షాలు పదో తరగతి పరీక్ష పాత్రలను లీక్ (10th Class Exam papers Leak) చేసేందుకు సహకరిస్తున్నాయని.. తిరిగి ప్రభుత్వం పై బురదచల్లే కార్యక్రమం చేపట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నారాయణ (Narayan), చైతన్య (Chitanya) సంస్థలు లీక్ చేసి.. తిరిగి దొంగే దొంగ దొంగ అంటూ ప్రభుత్వం పై కుతంత్రాలు చేస్తుండడం దారుణం అంటూ మండిపడ్డారు.

ఇదీ చదవండి : ఇంత అమానుషమా.. భర్త చనిపోయిన ధు:ఖంలో ఉంటే.. శవంపై చిల్లర ఏరుకునే ప్రయత్నం

సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు బొత్సాని ఇరుకున పెట్టాయి. ఎలా అనుకుంటున్నారా..? పది పరీక్షల పేపర్ల లీక్ పై వస్తున్న విమర్శలపై మంత్రి బొత్స స్పందించిన తీరు భిన్నంగా ఉంది. పరీక్షల్లో సరైన ఫలితాలు, ఉత్తీర్ణత నమోదు కాకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని ప్రభుత్వం ఎవరినీ హెచ్చరించలేదన్నారు. చదువురాని పిల్లలూ పాస్ అవ్వాలని, మాస్‌ కాపీయింగ్‌ చేయించాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఎందుకు చెబుతుందని మండిపడ్డారు. తాను మంత్రిగా రాజీనామా చేయాలని కొందరు నాయకులు అంటున్నారన్న బొత్స.. మంత్రిగా 13 ఏళ్లు పూర్తి చేసుకున్నానని, ఇదేం మహాభాగ్యం కాదన్నారు. అసలు విపక్షాలు ఆరోపిస్తున్నట్టటు ఏపీలో పదో తరగతి పబ్లిక్ పేపర్లు లీక్ కాలేదని.. మాస్ కాపీయింగ్ జరగలేదని.. అవన్నీ అవస్తవాలే అంటూ మంత్రి గట్టిగానే ఖండించారు.

ఇదీ చదవండి : మాస్ కాపీయింగ్ జరగలేదు.. పేపర్ లీక్ అవ్వలేదు.. 60 మందిపై చర్యలు తీసుకున్నాం.. మంత్రి మాటలకు అర్థం ఏంటో?

ఆ శాఖ మంత్రి పదో తరగతి పరీక్షల పేపర్లు లీక్ అవ్వలేదు అంటున్నారు. మాస్ కాపియింగ్ కూడా జరగలేదని ధీమాగా చెబుతున్నారు. అదే సమయంలో స్వయంగా సీఎం జగన్ కూడా పేపర్లు లీక్ అయ్యాయి అంటున్నారు. అది కూడా చైతన్య, నారాయణ లాంటి పెద్ద సంస్థలే ఈ పని చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు నిజమైతే..? ఆ శాఖ మంత్రి అవాస్తవాలు చెప్పినట్టే అవుతుంది. అదే మంత్రి బొత్స చెప్పిందే నిజమైతే సీఎం అవాస్తవాలు చెబుతున్నారా? అంటూ విపక్షాలు సైతం ప్రశ్నిస్తున్నాయి.

First published:

Tags: 10th Class Exams, Andhra Pradesh, Ap cm jagan, AP News, Botsa satyanarayana

ఉత్తమ కథలు