CM YS Jagan: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Govenor Abdul Nazeer)తో సీఎ జగన్ మోహపఖ రెడ్డి (CM jagan Mohan Reddy) ప్రత్యేకంగా సోమవారం సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీ మర్యాదపూర్వకంగానే అయినా.. తాజాగా రాజకీయాలపై చాలాసేపు మాట్లాడుకున్నట్టు సమాచారం. సుమారు గంట 15 నిమిషాల పాటు సమావేశం అయినట్టు వైసీపీ (YCP) వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్‌ను శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు సీఎం జగన్. ఈ గంటా 15 నిమిషాల పాటు రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం (Visakhapatnam) వేదికగా మంగళవారం జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్‌కు తెలియజేశారని చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ప్రజెంట్ రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో సీఎం జగన్ చర్చించినట్టు తెలుస్తోంది.
ఇక ఇవాళ విశాఖలో జరిగే జీ-20 సమావేశానికి వెళుతున్నారు సీఎం జగన్ . ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు సైతం ఈ సదస్సుకు హాజరవుతున్నారు. విశాఖలో జీ-20 సదస్సును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కారు అతిథుల కోసం ఇప్పటికే ఘనంగా విందు ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. జీ20 ఏర్పాట్లపై గవర్నర్ ఆరా తీసినట్టు సామాచారం.
కేవలం ఈ అంశాలే కాదు.. రాజకీయ పరిణామాలపైనా సుదీర్ఘంగా చర్చినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసారంటూ ఆ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. నలుగురిని టీడీపీ డబ్బులిచ్చి ప్రలోభాలకు గురి చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి గవర్నర్ కు సీఎం జగన్ నివేదించినట్టు టాక్. అలాగే ఎమ్మెల్యేలపై కఠిన చర్యలకు సిద్దమవుతున్నామనే విషయం కూడా గవర్నర్ కు చెప్పినట్టు టాక్.
ఇదీ చదవండి : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? సీఎం జగన్ ముందు ఆప్షన్లు ఇవే..?
మరో ముఖ్య అంశం ఏంటంటే..? త్వరలోనే ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ సీఎం జగన్ కేబినెట్ లో మార్పుల పైన సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 31న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమచారం. ఈ అంశం కూడా గవర్నర్ కు చెప్పినట్టు సమాచారం. అయితే సీఎం జగన్ మంత్రివర్గ ప్రక్షాళన చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ముగ్గురు నుంచి అయిదుగురు వరకు మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా గవర్నర్ తో చర్చించి.. ముహూర్తం ఫైనల్ చేసినట్టు టాక్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics