AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా ఇకపై ప్రజల్లోనే ఉండాలని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే ఇతర పార్టీలతో చూసుకుంటే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) దూకుడుగా ఉన్నారు. పార్టీ నేతలను ఇప్పటికే పరుగులు పెట్టిస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) పేరుతో ఎమ్మెల్యేలు అందరూ ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అక్కడితోనే ఆగలేదు.. ఆ ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది..? వారికి జనాల్లో ఉండే పలుకబడి ఏంటి అంటూ.. క్షేత్రా స్థాయిలో సర్వేలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ సర్వేలో వారికి వచ్చిన ప్రోగ్రస్ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించనున్నారు సీఎం. గతంలోనే దాదాపు 25కు పైగా నేతలకు సీఎం జగన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అందులో మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారికి డిసెంబర్ నెల వరకే గుడువు ఇచ్చారు. ఇప్పుడు అధినేత ఇచ్చిన గడువు సమీపిస్తుండడం ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. అధినేత దగ్గర తమ జాతకం ఎలా ఉందా అని ఆరా తీసే పనిలో పడ్డారు.
సీఎం జగన్ ఎప్పటికప్పుడు.. తమ పార్టీలో ఉన్న నేతల ప్రోగ్రస్ రిపోర్ట్ తెచ్చుకుంటున్నారు. మరి వారి స్కోర్ ఎంత వరకు పెరిగింది.. లేక తగ్గిందా..? అనే చర్చ మొదలైంది. ఇప్పుడు అందరి ఎమ్మెల్యేల్లోనూ అదే అనునాలు నెలకొన్నాయి. ఒకళ్లిద్దరు తప్ప కొన్ని జిల్లాల ఎమ్మెల్యేలందరికీ భయం తప్పలేదు అంటున్నారు. డిసెంబర్ రెండో వారంలోపే ఈ సమావేశం ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే అధినేత జగన్ రెండు మాడూ సార్లు హెచ్చరించినా.. కొందరి ఎమ్మెల్యేల తీరు మారలేదు.. ముఖ్యంగా గడప గడపకు ప్రభుత్వాన్ని అధినేత జగన్ చాలా సీరియస్ గా తీసుకుంటే.. కొందరు నేతలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. అలాంటి వారికి ఈ సారి నేరుగా టికెట్ లేదు అని చెప్పే అవకాశం లేకపోలేదని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే దాదాపు 20కి పైగా ఎమ్మెల్యేలు.. ఈ సారి అధినేత ఎలాగూ తమకు టికెట్ ఇవ్వరని ఫిక్స్ అయ్యి.. పక్క చూపులు చూస్తున్నట్టు ప్రచారం ఉంది. మరి అలాంటి వారిపై జగన్ కన్నెర్ర చేస్తారా మరో వార్నింగ్ ఇస్తారా అన్నది చూడాలి..
ఇదీ చదవండి : టీడీపీ , జనసేన , బీజేపీ పొత్తులపై క్లారిటీ.. పవన్ పార్టీకి ఎన్ని సీట్లు అంటే?
జగన్ ఇప్పటికే ఎన్నికల మూడ్ లో ఉన్నారు. నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన.. అభ్యర్థులను డిసైడ్ చేసేస్తున్నారు. ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని గతంలో చెప్పారు కూడా.. దీంతో ఈ డిసెంబర్ లో జరగబోయే సమావేశంలోనే.. ఎవరెవరికి టికెట్లు ఇచ్చేది లేదో తేల్చి చెప్పే అవకాశం ఉంది. దీంతో తమకు ఈ సారి బెర్త్ ఉందా లేదా అని.. కొందరు ఎమ్మెల్యేలు ఆరా తీసే పనిలో పడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp