CM Jagan: రాజ్యాధికారంలో బీసీలు భాగస్వాములు అవ్వాలని చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) కు చెప్పండి అంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ (Vijayawada) వేదికగా జరిగిన జయహో బీసీ (Jai Ho BC) సమావేశంలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ హృదయంలో బీసీలు ఉన్నారని.. బీసీల హృదయంలో జగన్ ఉన్నారు అన్నారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాలను ఆయనకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఖబడ్దార్ అంటూ బీసీలను హెచ్చరించిన బాబు.. ఇప్పుడు వారిపై బూటకపు ప్రేమ నటించండాన్ని అందరూ గుర్తించాలన్నారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన హామీలను ఆయనకు గుర్తు చేయాలన్నారు. నాయీ బ్రాహ్ముణుల తోకలు కత్తిరిస్తామన్న చంద్రబాబు నాయుడుపై బీసీలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు.
పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టిందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆధునిక విద్య బీసీలను వెనకబాటుకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇక బీసీలంటే వెనుకబడిన కులాలు కాదని.. వెన్ముముక కులాలు చేస్తానని హామీ ఇచ్చారు. నేడు రాజ్యాధికారంలో వారిని భాగస్వాముల్ని చేశానని సీఎం జగన్ గుర్తు చేశారు. బీసీ కులాలన్నింటికీ మేలు చేస్తామని పాదయాత్రలో చెప్పానని. రాజ్యాధికారంలో బీసీలను భాగస్వామ్యం చేశానని గుర్తు చేశారు.
అలాగే మేనిఫెస్టోలో ఇచ్చన ప్రతీ హామీని మేం అమలు చేసిన ప్రభుత్వం మనది అని గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. దేశంలోనే తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ తెచ్చాం. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. అలాగే అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత పథకాల ద్వారా ఆదుకుంటున్నామన్నారు. చిరువ్యాపారులకు తోడుగా ఉండేందుకు జగనన్న చేదోడు పథకం తెచ్చామని.. చేయూత పథకం కింద 14,110 కోట్లు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చామన్నారు. తిరుమలలో సన్నిధి గోల్లలకు తలుపులు తెరిచే సంప్రదాయం కల్పించామన్నారు. బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, పనిముట్లు కాదు.. వెన్నెముక కులాలు అని మరోసారి సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : ఫలితాలు ఇస్తున్న విఐపి బ్రేక్ దర్శనంలో మార్పులు.. కీలక నిర్ణయం దిశగా టీటీడీ
బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని.. బ్యాక్‌బోన్ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటి చెప్పే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు.. ఈ మూడున్నరేళ్ల కాలంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి ఆ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Vijayawada