YS Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM jagan Mohan Reddy) మారిపోయారా.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల (MLC Elections Result) తరువాత ఆయన స్పీచ్ లో మార్పుకు కారణం అదేనా..? మొన్న శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో మూడో విడత వైఎస్సార్ ఆసరా (YSR Asara Scheme) నిధులను లబ్దిదారులకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వ్యాఖ్యలు.. వైసీపీ కేడర్ ను ఆశ్చర్యానికి గురి
చేసింది. జగన్ నేనా ఇలా మాట్లాడింది అంటూ గందరగోళానికి గురవుతున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని పునురుద్ఘాటించారు. గత నాలుగేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,25,330.76 కోట్లు అక్కచెల్లెమ్మలకు అందజేశామని
ఆయన చెప్పుకొచ్చారు. అయితే సాధారణంగా సమావేశం ఏదైనా..? ప్రతిపక్ష టీడీపీ , ఎల్లో మీడియా అంటూ.. చెప్పిన స్క్రిప్టే మళ్లీ మళ్లీ చెప్పే ఆయన.. ఈ సారి రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉండి.. అందరినీ ఆశ్చర్యంలో మంచెత్తారు.
ఎలాంటి రాజకీయ విమర్శలు లేకుండానే సీఎం జగన్ ప్రసంగం సాగింది ఆ సమావేశంలో. ప్రతిపక్షాలపై విమర్శలు లేకుండా తన ప్రసంగాన్ని ముగించారు. చంద్రబాబు నాయుడు పాలనలో డ్వాక్రా మహిళల పరిస్థితిని మాత్రమే తన ప్రసంగంలో ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళలకు ఎంత సాయం చేశామో వివరించారు.
గత కొంతకాలంగా జగన్ ప్రసంగాలను పరిశీలిస్తే.. దుష్టచతుష్టయం అని.. దోచుకో, పంచుకో, తినుకో ఇదే చంద్రబాబు విధానమని.. ఇప్పుడు దత్తపుత్రుడు చంద్రబాబుకు తోడయ్యారు అంటూ.. రొటీన్ గా ఆయన ప్రసంగం సాగేది. కానీ తాజా ప్రసంగంలో ఎక్కడా విపక్షాలు, ఎల్లో మీడియా ప్రస్తావన లేకుండా సాగిన జగన్ స్పీచ్ చూసి వైసీపీ నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థి అనూహ్యంగా ఓడిపోవడంతో అధికార పార్టీలో అంతర్మథనం మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ తగలడంతో వైసీపీలో జోష్ తగ్గినట్టు ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది.
ఇదీ చదవండి : రేపు హైదరాబాద్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. భారీగా చేరికలకు ప్లాన్
అందులోనూ ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించడం.. వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. అందుకే రొటిన్ గా మాట్లాడడం లేదా కేవలం మీడియాను విపక్షాలను విమర్శించడం ద్వారా.. ప్రజల్లో తన ప్రసంగంపై ఆసక్తి తగ్గుతోందని సీఎం జగన్ భావించారా.. లేక ఎవరైనా సలహా ఇచ్చారా.. ప్రతిపక్షాలను విమర్శించడం కన్నా.. ఏం చేశారో ప్రజలకు చెబితేనే ఫలితం ఉంటుందని ఎవరైనా సూచించారో.. కారణం ఏదైనా.. సీఎం జగన్ ప్రసంగం మార్పు చూసి ఆ పార్టీ కేడరే షాక్ కు గురి అవుతోంది. రాజకీయ వ్యూహాల్లోనే భాగంగానే ఈ మార్పు జరిగుండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Visakhapatnam