Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY GAVE CLARITY TO COLLECTORS MAIN MOTO TO NEW DISTRICTS NGS

CM Jagan: 26 జిల్లాల ఏర్పాటు ఉద్దేశం అదే..? అధికారులకు క్లారిటీ ఇచ్చిన సీఎం

ఒంగోలులో మాట్లాడుతున్న సీఎం జగన్

ఒంగోలులో మాట్లాడుతున్న సీఎం జగన్

CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ముందు నుంచి చెబుతున్నట్టు 26 జిల్లాలతో కొత్త ఆంధ్రప్రదేశ్ ను ఆవిష్కరించారు. ఇప్పటికే పాలన కూడా ప్రారంభమైంది. అక్కడక్కడ చిన్న లోటుపాట్లు ఉన్నా.. అంతా సవ్యంగానే సాగుతోందని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు 26 జిల్లాల ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఏంటి..? అన్నది ప్రజలందరికీ తెలియజేయాలి అంటూ అధికారులకు సూచించారు.

ఇంకా చదవండి ...
  CM Jagan: మొన్నటి వరకు 13 జిల్లాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఇప్పుడు 26 జిల్లాలతో సరికొత్తగా కనిపిస్తోంది. ఈ జిల్లాల ఏర్పాటు విషయంలో అనేక విమర్శలు వచ్చాయి. ముందు వెనుక ఆలోచించకుండా సీఎం జగన్ (CM Jagan) నిర్ణయం తీసుకున్నారని.. విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్లు.. కొత్త జిల్లాల పేర్ల విషయంలో అనే ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది. ముఖ్యంగా సొంత పార్టీ నేతలు సైతం పలు జిల్లాల్లో రోడ్డు ఎక్కరు. అధిష్టానానికి వ్యతిరేకంగా గళం వినిపించడంతో పాటు.. రాజీనామాలకు సిద్ధమయ్యారు. దీంతో సీఎం ఎలా ముందుకు వెళ్తారన్నదానిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆయన ముందు నుంచి ఉగాది నాటికి జిల్లాల ఏర్పాటు పూర్తవుతుంది చెబుతూ వచ్చారు. ఇందులో భాగంగా ప్రజలు, నిపుణులు, ఇతరుల నుంచి అభ్యంతరాలు, సలహాలు కూడా తీసుకున్నారు. అందులో కొన్నింటిని పరిగణలోకి తీసుకుని.. ముందు చెప్పిన విధంగానే కొత్త జిల్లాలను ప్రారంభించారు. ఆ వెంటనే కార్యాలయాలు, అధికారులు నియమకాలతో దూకుడుగా వెళ్లారు. దీంతో వివాదాలన్ని పక్కకు పోయాయి.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలుగా మారింది...

  ఏపీలో 26 జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేశామన్నది అందరికీ తెలియాలని సీఎం జగన్ భావిస్తున్నారు. పరిపాలన అనేది సులభతరంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలో ఉండాలని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అధికారులు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని, ప్రజల పట్ల మరింత మానవీయ దృక్పథంతో మెలగాలని సలహా ఇచ్చారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు జగన్. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ఏర్పాటు ఉద్దేశం ప్రజలు అందరికీ తెలిసేలా చేసే బాధ్యత అధికారులదే అని స్పష్టం చేశారు.

  ఇదీ చదవండి : చేతులే కలిశాయి.. చూపులు కలిసేది ఎప్పుడో..? అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి

  అలాగే ఇళ్ల నిర్మాణం గురించి కూడా జగన్ మాట్లాడారు. తొలి దశలో రాష్ట్రంలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు సీఎం జగన్ తెలిపారు. కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగ్ లో పడిందని వెల్లడించారు. ఈ కేసుల పరిష్కారం కోసం అధికారులు ప్రయత్నించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం అందాలని, అందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు జగన్. కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు.

  ఇదీ చదవండి : రోజా అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. వారంతా ఉన్మాధులంటూ మంత్రి కామెంట్

  మరోవైపు గురువారం విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు సీఎం జగన్. ఈ సంద‌ర్భంగా వేలాది మంది ల‌బ్ధిదారుల‌కు ఆయ‌న ఇళ్ల ప‌ట్టాలు అందించ‌నున్నారు. ఈ మేర‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్ల‌ను పూర్తి చేసింది. విశాఖ న‌గ‌ర శివారులో ఒకేచోట 72 లే ఔట్ల‌ను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 300 ఎకరాల మేర విస్తీర్ణంలో 9 వేల మంది పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను కేటాయించారు. ఈ ఇళ్ల స్థ‌లాల పట్టాల‌ను ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేయ‌నున్నారు సీఎం జగన్.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP new districts, AP News

  తదుపరి వార్తలు