CM Jagan: పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిధులు రాకపోవడానికి.. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు తీరే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy). ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ (R and R Package) కింద గతంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హయాంలో 6.86 లక్షలు ఇస్తే.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 10 లక్షలు చేస్తాం అని చెప్పాం. చెప్పిన మాటే చేస్తున్నామన్నారు. అందుకు తగినట్లుగా జీవో కూడా జారీ చేశామన్నారు. దాని గురించి ఆక్షేపణ లేదు, చర్చ కూడా లేదన్నారు. కళ్లు ఉండి చూడలేకపోతే సమాధానం చెప్పలేం కానీ... కళ్లు ఉండి చూడగలిగితే చూడాలని చెప్తున్నా.
ఈ జీవోలో ఆర్ అండ్ ఆర్ కింద మేం చెప్పిన దానిపై జీవో జారీ చేశాం. దానికి కట్టుబడి ఉన్నామన్నారు. డ్యాం పూర్తయిన తర్వాత మొదట నీటిని 41.15 మీటర్ల ఎత్తులో నిల్వ చేస్తాం. ఎందుకంటే డ్యామ్ భద్రత దృష్ట్యా.. కేంద్ర జల సంఘం నిబంధనల మేరకు, డ్యామ్‌లో ఒకేసారి పూర్తిస్ధాయిలో నీటిని నిల్వ పెట్టడం సరికాదు. ఆ మేరకు 41.15 మీటర్లకు సంబధించి డ్యామ్‌లో నీటి నిల్వ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
పోలవరం ప్రాజెక్టులో 1,06,006 మంది నిర్వాసితులకు గాను.. 41.15 మీటర్ల కాంటూర్‌కు పరిధి వరకు.. 20,946 మంది నిర్వాసితులు వస్తారని వెల్లడించారు. మిగిలిన 85,060 మంది నిర్వాసితులు 45.72 కాంటూర్ లెవల్ కిందకు వస్తారన్నారు. వీరిలో 41.15 కాంటూర్ లెవల్‌కు వచ్చే 14,110 నిర్వాసితులకు పునరావాసం పూర్తయిందని. దీనికి అయిన ఖర్చు 1960.95 కోట్లు అని స్పష్టత ఇచ్చారు.
ఈ 14,110 మంది నిర్వాసితులలో 707 నిర్వాసితులకు 2014 కన్నా ముందే పునరావాసం కల్పించి.. 44.77 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 2014–19 వరకు 3073 నిర్వాసితులకు పునరావాసం కోసం 193 కోట్లు ఖర్చు చేశాం. అలాగే 2019 నుంచి ఇప్పటివరకు 10,330 మంది నిర్వాసితుల కోసం 1773 కోట్లు ఖర్చు చేశాం. పునరావాసపనులు 41.15 కాంటూర్ వరకు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబరు 2022 లోగా మిగిలిన 6836 నిర్వాసిత కుటుంబాలకు కూడా పునరావాసం పూర్తి చేయడానికి ప్రణాళిక చేయడం జరుగుతోంది అన్నారు.
ఇదీ చదవండి : బంధువుల కారణంగా నష్టపోయాం.. లిక్కర్ స్కామ్ లింకులపై వైసీపీ ఎంపీ మాగుంట క్లారిటీ
మొత్తం 41.15 కాంటూర్ వరకు చెల్లించాల్సిన పరిహారం 6.86 లక్షలకు బదులు మేం 10 లక్షలు పెంచుతామని చెప్పిన ఖర్చు కేవలం 500 కోట్లు మాత్రమే. మీరెవ్వరూ భయపడాల్సిన పనిలేదు, బాధపడాల్సిన పనీ లేదు. బటన్ నొక్కితే 6500 కోట్లు, 6700 కోట్లు అమ్మఒడి, ఆసరా, చేయూతకు 4700 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అటువంటిది 500 కోట్లు ఇచ్చేందుకు చేయలేకుండా ఉండే పరిస్థితులు వస్తాయని ఎవరూ అనుకోవాల్సిన పనిలేదన్నారు.
ఇదీ చదవండి : ఎంపీ రఘురామ రాజుకు షాక్.. నేడు విచారణ హాజరు కావాలంటటూ నోటీసులు
కాంటూర్ లెవల్ వరకు ఎప్పుడైతే పూర్తిగా పునరావాసం కల్పించే కార్యక్రమం పూర్తవుతుందో.. వాళ్లందరికీ ఆ లోపే 500 కోట్లు ఇస్తామన్నారు. 2900 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సి ఉంది. మనం ఎదురు డబ్బులు ఇచ్చాం. అటువైపు కేంద్రం నుంచి ఆ డబ్బులు రాలేదు. దీనికి సంబంధించి ఈ పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం.. ఆ రోజు చంద్రబాబునాయుడే అన్నారు. ఆ రోజు అర్ధరాత్రి పూట లేని స్పెషల్ ప్యాకేజీ అని ఒకదాన్ని అంగీకరించడమే అన్నారు. 2011 ప్రకారం పాత రేట్ల ఇస్తాం అంతకన్నా ఎక్కువ ధర ఇవ్వమని వాళ్లు చెపితే.. ఏదైనా ప్రాజెక్టు ముందుకు పోయేకొద్దీ రేట్లు పెరుగుతాయి కదా..? పెరిగిన రేట్లు మీరు ఇవ్వకపోతే ఎలా ? పోలవరం ప్రాజెక్టు అథారిటీ అన్నది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీయే కదా? వాళ్లే కదా అమలు చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేట్ మాత్రమే చేస్తుంది కదా? అలాంటప్పుడు ఇలాంటి నిబంధన పెట్టడం ధర్మమేనా? కరెక్టేనా ? అని అడగాల్సింది పోయి, ఆ రోజు గుడ్డిగా దానికి అంగీరించాం అని చెప్పారు.
ఇదీ చదవండి : వైసీపీ స్ట్రాటజీ మార్చిందా..? జూనియర్ ఎన్టీఆర్ ను లైన్ లో పెట్టడానికి కారణం అదేనా..?
అక్కడితోనే ఆగని చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలో వారి వాళ్లతోనే.. స్టేట్మెంట్ ఇప్పించారని గుర్తు చేశారు. ఆ రోజు అరుణ్ జైట్లీ అర్ధరాత్రి స్టేట్మెంట్ ఇస్తుంటే.. పక్కనే చంద్రబాబుకు కుడి భుజంగా చెప్పుకునే.. సుజనా చౌదరి, కేంద్ర కేబినెట్లో ఉన్న వారి మంత్రులు అందరూ పక్కనే నిలబడి దానికి అంగీకరించారు కదా అని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: పవన్ వీకెండ్ పొలిటీషియన్.. చిరంజీవినే తప్పు పడతారా అంటూ పేర్ని నాని ఫైర్
మరుసటి రోజు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూడా బ్రహ్మాండమైన ప్యాకేజీ వచ్చిందని.. సిగ్గులేకుండా చెప్పారు. పూర్తిగా ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసి, ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఇప్పుడు దానివల్ల ఆ ప్రాజెక్టుకు సంబంధంచి మేము ఆ పాతరేట్లే ఇస్తాం అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే రేట్లు ఇవ్వం అని వాళ్లు గట్టిగా భీష్మించుకుని కూర్చున్న నేపధ్యంలో వాళ్లను ఒప్పించడానికి ఇన్ని అగచాట్లు పడుతున్నాం. ఒకవైపు ఈ అగచాట్లు పడుతూనే.. మరోవైపు 2.900 కోట్లు ఎదురు మన డబ్బులే ఇచ్చామన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో మన డబ్బే ఇరుక్కుని ఉంది. ఆడబ్బులు ఇంకా వెనక్కి తీసుకురాలేకపోతున్నాం. కారణం చంద్రబాబు పుణ్యమే కదా అన్నారు.
ఒకవైపు ఈ విషయాలు ఇలా ఉంటే.. ఇంకోవైపు గతంలో 1.50 లక్షలు ఎవరికైతే ఇచ్చారో, అది కూడా తక్కువ మొత్తం.. వాళ్లకు కూడా పెంచి 5లక్షలు ఇస్తామని చెప్పాం. ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నామని సభాముఖంగా జగన్ మరోసారి గుర్తు చేశారు.
ఇదీ చదవండి : ఇవి పాలు మాత్రమే కాదు.. దివ్య ఔషధం కూడా..? ఇంటింటికీ వచ్చి మరీ ఇస్తున్నారు
పునరావాసం మీద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో కలిపి కేవలం 3,073 మందికి రూ.193 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. పునారవాసం మీద మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమూడు సంవత్సరాలలో 10,330 నిర్వాసిత కుటుంబాలకు రూ.1773 కోట్లు ఖర్చు చేశామని తలెత్తుకుని సగర్వంగా తెలియజేస్తున్నాను అన్నారు.
పునరావాసానికి సంబంధించి టీడీపీకి చిత్తశుద్ధి ఏమిటో, మాకున్న చిత్తశుద్ధి ఏమిటో ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరం లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు హయాంలో ఏ జరిగిందో... మన హయాంలో ఏం జరిగిందో స్లైడ్లు కూడా చూద్దాం.. అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Polavaram, Ycp