హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSR Kalyanamastu: కళ్యాణమస్తు పథకం అందాలి అంటే? పది పాస్ అవ్వాల్సిందే..? సీఎం జగన్ క్లారిటీ

YSR Kalyanamastu: కళ్యాణమస్తు పథకం అందాలి అంటే? పది పాస్ అవ్వాల్సిందే..? సీఎం జగన్ క్లారిటీ

సీఎం వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

YSR Kalyanamastu: పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురె చెప్పింది. పెళ్లి చేసుకోవాలి అనుకునే పేలకు కళ్యాణమస్తు పథకం అందిస్తోంది. అయితే ఈ పథకాన్ని అందుకోవాలి అంటే.. కచ్చితంగా పదవ తరగతి పాస్ అవ్వాలనే నిబంధన పెట్టారు.. దీనిపై విమర్శలు రావడంతో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  YSR Kalyanamastu: సంక్షేమ పథకాలకు కేరాఫ్ గా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government).. ఏదో ఒక రూపంలో అన్ని వర్గాలకు సాయం చేస్తూనే ఉంది. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల వారికి అండగా నిలుస్తోంది. నవరత్నాల పేరుతో ఇప్పటికే ఎన్నో పథకాలు అందిస్తున్న సీఎం జగన్.. కొత్త కొత్త పథకాలు (AP Welfare Scheme) .. ప్రజల ముందుకు తీసుకొస్తోంది. తాజాగా జగన్ సర్కార్ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో ఒకటి కళ్యాణమస్తు స్కీమ్ (Kalyanmasathu Scheme). అయితే ఈ పథకం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు వర్తించనుంది. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్‌ సర్కార్‌ తీసుకొచ్చింది. అయితే ఈ పథకం కోసం పెట్టిన కండిషన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో నేరుగా దీనిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు.

  YSR కళ్యాణమస్తు పథకానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. అందులో ముఖ్యమైంది పదవ తరగతి పాస్ అవ్వడం. ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే వధువు, ఆమెను పెళ్లి చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ పాసై ఉండాలి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనిపై విమర్శలు రావడంతో .. ఈ నిబంనకు కారణం ఏంటో వివరించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. బాల్య వివాహాలను కట్టడి చేసేందుకే కళ్యాణమస్తు పథకానికి టెన్త్‌ క్లాస్‌ నిబంధన విధించామని ఆయన స్పష్టం చేశారు. అందుకే వధువు, ఆమెను పెళ్లి చేసుకునే వరుడు తప్పనిసరిగా 10 వ తరగతి పాస్ అవ్వాలనే రూల్ పెట్టినట్లు వెల్లడించారు.

  మహిళా శిశు సంక్షేమంపై సమీక్ష సందర్భంగా దీనిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. బాల్య వివాహాల అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో బాల్య వివాహాల నివారణలో కల్యాణమస్తు పథకం ప్రత్యేక పాత్ర పోషించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. అందులో భాగంగానే, ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే వధువు, ఆమెను పెళ్లిచేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ పాసై ఉండాలని మరోసారి స్పష్టం చేశారు.

  ఇదీ చదవండి : దమ్ముంటే కొడుకుపై ప్రమాణం చేయాలి.. లోకేష్ కు మంత్రి రోజా సవాల్.. ఎందుకో తెలుసా?

  ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా బాల్య వివాహాలు పూర్తిగా అదుపులోనికి రాలేదని.. అందుకే బాల్య వివాహాలను పూర్తిగా నివారించడంపై దృష్టి పెట్టాలని అధికారులను జగన్ ఆదేశించారు. పేద ప్రజలు, అణగారిన వర్గాల అభివృద్దే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం YSR కళ్యాణమస్తు పథకాన్ని తీసుకొచ్చామన్నారు. అందులో భాగంగా ఎస్సీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు, ఎస్సీల కులాంతర వివాహాలకు లక్షా 20 వేల రూపాయలు కానుకగా ప్రభుత్వం ఇవ్వనుంది.

  ఇదీ చదవండి : షుగర్ ఉందని టెన్షన్ వద్దు.. అందుబాటులోకి సరికొత్త పరికరం.. ప్రత్యేకత ఏంటంటే?

  అదే ఎస్టీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు, ఎస్టీల కులాంతర వివాహాలకు లక్ష 20 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక బీసీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద 50వేలు, బీసీలో కులాంతర వివాహాలకు 75 వేల రూపాయలు అందించనున్నారు. వీరితో పాటు మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయలు, దివ్యాంగులు వివాహాలకు లక్షన్నర, భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు 40 వేల రూపాయలు ఇవ్వాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes

  ఉత్తమ కథలు