హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: రాష్ట్ర ఆదాయినికి వచ్చి నష్టం ఏమీ లేదు.. ప్రస్తుతం ఉన్న అప్పులు ఇవే.. క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

CM Jagan: రాష్ట్ర ఆదాయినికి వచ్చి నష్టం ఏమీ లేదు.. ప్రస్తుతం ఉన్న అప్పులు ఇవే.. క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

రాష్ట్ర అప్పులపై సీఎం జగన్ క్లారిటీ

రాష్ట్ర అప్పులపై సీఎం జగన్ క్లారిటీ

CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోందని.. శ్రీలంకలో పరిస్థితులు తలెత్తుతాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా జగన్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి ఉన్న అప్పులపై పూర్తి వివరణ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విపక్ష పార్టీలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సీరియస్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన్నారు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర అప్పులు తక్కువగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హయాంలో అప్పులు 17.45 శాతం పెరిగాయని తెలిపారు. ఈ మూడేళ్లలో కేంద్ర రుణాలు 135 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఈ మూడేళ్లలో కేంద్రం అప్పులు 43.8 శాతం పెరిగాయని తెలిపారు. విభజన నాటికి రాష్ట్ర రుణాలు 1.26 లక్షల కోట్లు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి 2.69 లక్షల కోట్లు. బాబు హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో 123.52% అప్పులు పెరిగాయి. ఈ మూడేళ్లలో రాష్ట్ర రుణాలు 3.82 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ మూడేళ్లలో రాష్ట్ర రుణాలు 41.4 శాతం పెరిగాయి. కేంద్రంతో పోలిస్తే ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అప్పు తగ్గింది అని సీఎం జగన్‌ అన్నారు.

రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్‌ విమర్శించారు. చంద్రబాబు అండ్‌ దొంగల ముఠా లేనిది సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో కొన్ని శక్తులు పథకాలను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. 

మేనిఫెస్టోలో చెప్పిన 98.4 శాతం హామీలు అమలు చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కోవిడ్‌ సహా ఎన్నో సవాళ్లు ఎదురైనా రాష్ట్ర ఆర్థిక ‍ వ్యవస్థ అద్భుతంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఢోకా ఏమీ లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : ఈ చెట్లకు డాలర్లు కాస్తాయంట.. ఆక్సిజన్.. ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాదు.. ఆదాయాన్ని ఇస్తున్న చెట్లు

ఇవాళ పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. తప్పుడు కేసులతో కొన్ని శక్తులు పథకాలను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. కోవిడ్‌ సహా ఎన్నో సవాళ్లు ఎదురైనా మన ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందన్నారు. 98.4 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వంగా నిలిచామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగున్నా ఓ దొంగల ముఠా దుష్ప్రచారం చేస్తోంది. గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి : చంద్రబాబు సంచలన నిర్ణయం.. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టిక్కెట్లు.. కారణం ఇదే

కరోనాను తట్టుకొని నిలబడ్డామని గుర్తు చేసుకున్నారు. కోవిడ్‌ దెబ్బకు దేశాల్లో డీజీపీ తగ్గిపోయింది. దేశంలో పలు రాష్ట్రాల్లోనూ జీడీపీ తగ్గింది. 2018-19లో జీడీపీ 5.36 ఉంటే ఇప్పుడు 6.89 శాతం ఉంది. దేశంలో జీడీపీ పరంగా ఆరోస్థానానికి చేరుకున్నాం. జీడీపీ పరంగా దేశంలో గతంలో 21వ స్థానంలో ఉంటే ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నామన్నారు. గ్రోత్‌ రేట్‌లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు.

ఇదీ చదవండి : తిరుమలలో ముందుగానే బ్రహ్మోత్సవాల సందడి.. భ‌క్తుల‌కు క‌నువిందుగా కళారూపాల ప్రదర్శన

అప్పులపై చంద్రబాబు సహా కొందరు రోజూ దుష్ప్రచారం చేస్తున్నారు. విభజన నాటికి రాష్ట్ర రుణాలు 1.26 లక్షల కోట్లు ఉంటే. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి 2.69 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. బాబు హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో 123శాతం అప్పులు పెరిగాయి. ఈ మూడేళ్లలో 3.82 లక్షల కోట్ల రూపాయలకు రుణాలు చేరాయన్నారు. మూడేళ్లలో పెరిగిన రుణం 41.83 శాతం మాత్రమే. ఈ మూడేళ్లలో రాష్ట్ర అప్పులు 12.73శాతం మాత్రమే. ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు చంద్రబాబు హయాంలోనే ఎక్కువ అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm jagan, AP News, Chandrababu Naidu

ఉత్తమ కథలు