YCP Target 2024: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార ఎన్నికల వేడి కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ.. గెలుపు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. అన్ని పార్టీల కంటే అధికార వైసీపీ (YCP) మరింత దూకుడుగా వెళ్తోంది.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించడమే తన లక్ష్యం అంటున్నారు పార్టీ అధినేత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. కార్యకర్తలకు పార్టీ నేతలకు పదే పదే టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. అంతే కాదు ఆ దిశగా వ్యూహ రచనలు చస్తున్నారు కూడా.. ఈ ఒక్కసారి గెలిస్తే.. మరో 25 ఏళ్ల వరకు ఎలాంటి సమస్య ఉండదన్నది జగన్ లెక్క. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ.. అక్కడి సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. ఆ నియోజకవర్గానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూరింది అనే విషయాలను కూడా వెల్లడిస్తున్నారు.. తాజాగా పార్టీలో భారీ ప్రక్షాళన చేపట్టారు. రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకంలో మార్పులు చేర్పులు చేశారు. కాసేపటికే పార్టీ జిల్లా అధ్యక్షుల్లోనూ కొన్ని మార్పులు చేశారు. అయితే కొందరి మాజీలకు మాత్రం ఊహించని షాక్ ఇచ్చారు.
కొన్ని జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు.. మరికొన్ని చోట్ల జిల్లా అధ్యక్షలను మార్చేశారు సీఎం వైఎస్ జగన్.. కొత్త జాబితా ప్రకారం.. పార్వతీపురం మన్నెం జిల్లాకి అధ్యక్షుడిగా పుష్ప శ్రీవాణి స్థానంలో పరిశిష్ట రాజు.. విశాఖపట్నం జిల్లా బాధ్యతల నుంచి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ను తప్పించి ఆయన స్థానంలో పంచకర్ల రమేష్ కు అవకాశం కల్పించారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా సుచరిత స్థానంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమించిన జగన్.. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బుర్ర మధుసూదన్ యాదవ్ స్థానంలో జంకె వెంకటరెడ్డికి అవకాశం ఇచ్చారు..
కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మేయర్ బీవై రామయ్యకు బాధ్యతలు అప్పగించగా.. ఇప్పటికే రాజీనామా చేశారు ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి. ఇక, అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పైల నర్సింహయ్య, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భరత్‌ను కొనసాగించారు.. అనుబంధ విభాగాల కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో తిరుపతి జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.
ఇదీ చదవండి : నెంబర్ 2 సహా.. అందరి కోరిక అదే.. మరి అధినేత పవన్ వారి నిర్ణయాన్ని గౌరవిస్తారా..?
వైసీజీ జిల్లాల అధ్యక్షుల వివరాలు ఇవే..
శ్రీకాకుళం - ధర్మాన కృష్ణదాస్
విజయనగరం - మజ్జి శ్రీనివాసరావు
పార్వతీపురం మన్యం - పరీక్షిత్ రాజు
అల్లూరి సీతారామరాజు - కోటగుళ్ల భాగ్యలక్ష్మి
విశాఖపట్నం - పంచకర్ల రమేష్
అనకాపల్లి - కరణం ధర్మశ్రీ
కాకినాడ - కురసాల కన్నబాబు
కోనసీమ - పొన్నాడ వెంటక సతీష్ కుమార్
తూర్పుగోదావరి - జక్కంపూడి రాజా
పశ్చిమగోదావరి - చెరకువాడ శ్రీరంగనాథ రాజు
ఏలూరు - ఆళ్ల నాని
కృష్ణా - పేర్ని నాని
ఎన్టీఆర్ - వెల్లంపల్లి శ్రీనివాసరావు
గుంటూరు - డొక్కా మాణిక్య వరప్రసాద్
బాపట్ల - మోపిదేవి వెంకటరమణ
పల్నాడు - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ప్రకాశం - జంకె వెంకటరెడ్డి
నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
కర్నూలు - బీవై రామయ్య
నంద్యాల - కాటసాని రాంభూపాల్‌రెడ్డి
అనంతపురము - పైలా నరసింహయ్య
శ్రీసత్యసాయి జిల్లా - మాలగుండ్ల శంకరనారాయణ
వైఎస్సార్ కడప - కొట్టమద్ది సురేష్‌బాబు
అన్నమయ్య - గడికోట శ్రీకాంత్‌రెడ్డి
చిత్తూరు - కె నారాయణస్వామి
తిరుపతి - నెదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp