CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంక్షేమ కార్యక్రమానికే ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. ఇప్పుడు పెట్టుబడులపై ఫోకస్ చేస్తున్నారు. ఇటీవల వరుస కంపెనీలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడులను జగన్ గాలికి వదిలేశారనే విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లో గోకవరంలో భారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం..పరిశ్రమలకు నిలుస్తుందని హామీ ఇచ్చారు. కేవలం ఆరు నెలల్లోనే ఒక పరిశ్రమ ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు ఇప్పించగలిగామంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత వేగంగా జరుగుతుందో అర్థం చేసుకోవాలని కోరారు.
దేవుడి దయతో మంచి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతానికి మంచి చేసే ఒక మంచి ప్లాంట్ ఇథనాల్ పరిశ్రమ ఇక్కడికి రాబోతోంది అన్నారు. ఈ ప్లాంట్‌ను ఇక్కడికి తీసుకువచ్చేందుకు అడుగులు ముందుకు వేసిన అసాగో ఇండస్ట్రీస్ ఎండీ, సీఈవో అశీష్ గుర్నానికి అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్న టెక్ మహేంద్ర ఎండీ సీపీ గుర్నానికి, కంపెనీకి సంబంధించిన ఇతర ప్రతినిధులకు, తన మంత్రి వర్గ సహచరులకు అధికారులకు అభినందలు తెలియజేస్తున్నాను అన్నరు.
ఈ జిల్లాలో 270 రూపాయల కోట్లతో ఇథనాల్ ప్లాంట్ నిర్మాణం జరుగబోతోంది అన్నారు. టెక్ మహేంద్ర అనే పారిశ్రామిక దిగ్గజం మనందరికీ కూడా తెలిసిన పెద్ద సాప్ట్వేర్ కంపెనీ అన్నారు. ఈ పరిశ్రమ దిగ్గజం, ఆ సంస్థ సీఈవో సీపీ గుర్నాని కుమారుడు ఆధ్వార్వంలో ఈ పరిశ్రమ ఇక్కడికి రాబోతోందని వెల్లడింయారు.
తాను ఆరు నెలల క్రితం దావోస్ వెళ్లినప్పుడు అక్కడ నన్ను గుర్నాని కలిశాను అన్నారు. ఏపీకి రావాల్సిన అవసరం, ఏపీలో జరుగుతున్న మంచి, రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెబుతుండగా ఆయన నోటి నుంచి టెక్నాలజికి సంబంధించిన మాటలు వచ్చాయని గుర్తు చేశారు. తన కుమారుడు ఇథనాల్ ప్లాంట్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారని, మన రాష్ట్రలో పెడితే ఎలా ఉంటుందని అడిగారని.. దావోస్ నుంచి ఆయన్ను ఇక్కడికి ఆహ్వానించామన్నారు.
ఇదీ చదవండి : ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర..? ప్రతిపక్షాన్ని చీల్చుతారా..? బీజేపీ ప్లాన్ ఏంటి..?
అంతేకాదు కేవలం 6 నెలల కాలంలోనే పరిశ్రమకు సంబంధించి భూ సేకరణ చేసి ఈ రోజుకు భూమి పూజ చేసే దిశగా అడుగులు పడ్డాయంటే ఏ స్థాయిలో ఈజ్ డూయింగ్ బిజినేస్ జరుగుతుందో అందరూ అర్థం చేసుకోవచ్చన్నారు. మరెక్కడ ఇంత వేగంగా అనమతులు వస్తాయా అని ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఈ రోజు ఒక మంచి ప్లాంట్ ఇక్కడికి రాబోతోంది అన్నారు. 2 లక్షల లీటర్ల కేపాసిటీతో ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. దాదాపుగా 300, 400 మందికి ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు, మన ప్రాంతానికి 70 శాతం లోకల్లో ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసినట్లుగా మన పిల్లలకు మంచి జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా ఈ ప్లాంట్ చాలా మేలు చేస్తుందన్నారు.
ఎప్పుడు తూపాన్లు, వరదలు వచ్చినప్పుడు ధాన్యం రంగు మారిపోవడం, ముక్కి పోవడం, విరిగిపోయిన నూకలుగా మారేవి. ఈ సమస్యకు ఈ ప్లాంట్ పరిష్కారం ఇస్తుంది. రైతులకు కూడా మేలు జరుగుతుంది. రంగుమారిన ధాన్యానికి కూడా మంచి రేటు ఇప్పించగలుగుతున్నాం అన్నారు. దీంతో రైతులకు మంచి జరుగుతుందన్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఎలాంటి కాలుష్యం కూడా ఉండదన్నారు. ఈ ప్లాంట్‌తో పాటు పశువుల ధాన, కోళ్ల దానా, చేపల దాన వంటివి కూడా ఈ పరిశ్రమ ద్వారా అందు బాటులోకి వస్తాయన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News