హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: విశాఖలో అత్యధిక సీట్లు నెగ్గడమే టార్గెట్.. సీఎం జగన్ భారీ స్కెచ్.. ఏంటో తెలుసా?

CM Jagan: విశాఖలో అత్యధిక సీట్లు నెగ్గడమే టార్గెట్.. సీఎం జగన్ భారీ స్కెచ్.. ఏంటో తెలుసా?

ఏపీ సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్

CM Jagan: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కనిపించింది. ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేకుండా ఫ్యాన్ గాలి జోరుగా వీచింది.. జగన్ సునామీ విజయంలోనూ.. విశాఖనగరం టీడీపికి అండగా నిలిచింది. సిటీలో ఉన్న నాలుగుకి నాలుగు సీట్లు సైకిల్ సొంతమయ్యాయి. దీంతో ఈ సారి విశాఖపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ చేశారు. భారీ స్కెచ్ వేస్తున్నారు..!

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Praedesh) లో విశాఖకు ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుంది. ఒక రాజధానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఇప్పటికే ఉన్నాయి. కానీ ఇతర ప్రాంతాలకు దూరంగా ఉండడం.. సముద్ర తీరం ఎక్కువగా ఉంటే.. భద్రతా సమస్యలు వస్తాయనే కారణాలతో గత ప్రభుత్వం అమరావతి (Amaravati) ని రాజధానిగా చేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం (YCP Government) వచ్చిన తరువాత విశాఖ (Visakha) ను పరిపాలన రాజధానిగా ప్రకటించింది. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులకు ఓటేసింది. ఇప్పటికే అమరావతి రాజధానిగా ఉండడం.. అక్కడ పనులు కొన్ని పూర్తి కావడం.. రాజధాని కోసం స్థానిక రైతులు భూములు ఇవ్వడంతో.. ఇప్పుడు అమరావతిని కాదని.. వేరే రాజధాని మార్చాలి అంటే సాంకేతికంగా.. న్యాయపరంగా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వం మూడు రాజధానులపై ప్రకటన చేసినా.. అడుగు ముందుకు పడడం లేదు. మంత్రులు మాత్రం.. చాలా కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు. వచ్చే ఏడాది నుంచి విశాఖలో సీఎం కార్యాలయం ఉంటుందని.. ఇక్కడ నుంచే ఆయన పరిపాలన ప్రారంభిస్తారని చెబుతున్నారు. అందరి మంత్రుల అభిప్రాయం ఇదే..

  ఇలా విశాఖపై వైసీపీ ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నామని చెబుతున్నా.. రాజకీయంగా టీడీపికి పట్టు ఎక్కువ కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ నగరంలో అన్ని సీట్లు నెగ్గడం అంత ఈజీ కాదు.. టీడీపీ బలం ఇప్పటికీ చెక్కు చెదరకుండానే ఉంది. మరి సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టుకున్న టార్గెట్ 175కి రీచ్ అవ్వాలి అంటే.. విశాఖ సిటీలో నాలుగు సీట్లు నెగ్గాల్సిందే.. అందుకే ఆయన విశాఖ కు సంబంధించి భారీ స్కెచ్ సిద్ధం చేసినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

  ఇప్పటికే అమరావతి మహా పాదయాత్రను వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ టార్గెట్ గా వైసీపీ కొత్త వ్యూహాలు వికేంద్రీకరణకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ నగరంలో టీడీపీని బలహీన పరచడంలో భాగంగా.. వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర మేధావులు - వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కలిపి విశాఖ పరిపాలనా రాజధాని డిమాండ్ తో ఈ జేఏసీ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి విశాఖలో పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి- మంత్రి గుడివాడ అమర్నాధ్ పార్టీ నేతలతో చర్చలు జరిపారు.

  ఇదీ చదవండి : కేసీఆర్ కొత్త పార్టీతో చంద్రబాబు అలర్ట్.. నేతలతో ప్రత్యేక సమావేశం.. వెళ్లేది ఎవరు..?

  ఈ నెల 9వ తేదీన పాడేరులో రౌండ్ టేబుల్ నిర్వహించాలని నిర్ణయించారు. జేఏసీ ఏర్పాటు చేసుకొని పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అమరావతి మహా పాదయాత్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జరుగుతోందన్నది వైసీపీ ఆరోపణ. 29 గ్రామాలకు 26 జిల్లాల ప్రజల కష్టార్జీతాన్ని ఖర్చు చేయాలా అని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ పాలన ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. సంక్రాంతి నుంచి విశాఖ కేంద్రంగా సీఎం క్యాంపు కార్యాలయంలో పాలనా వ్యవహారాలు ప్రారంభం అవుతాయని చెబుతున్నారు. ఇలా రెండు లక్ష్యాలతో ముందుకు వెళ్తూ.. విశాఖ రాజధానికి టీడీపి వ్యతిరేకం అని ప్రజలకు తెలియచేస్తూ.. ప్రతిపక్షాన్ని బలహీన పరిచే స్కెచ్ వేస్తోంది అధికార వైసీపీ. మరి ఎత్తులను టీడీపీ నేతలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Visakhapatnam, Ycp

  ఉత్తమ కథలు