AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY FOCUSED ON PARTY FOR TARGET 2024 NGS
CM Jagan: ఆ పదవులు రద్దు.. జిల్లా బాధ్యతల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం.. టార్గెట్ 2024 దిశగా అడుగులు
సీఎం జగన్ (పాత ఫొటో)
CM Jagan: వైసీపీ అధినేత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి.. 2024 ఎన్నికలే టార్గెట్.. ఇప్పటికే ఆయన సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ ఏదైనా..? జిల్లాల్లో పార్టీ బాధ్యతలను ఓ మంత్రికి అప్పచెప్పడం ఆనవాయితీగా వస్తోంది.. కానీ ఆ పదవులను రద్దు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.
CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. ప్రత్యర్థులకు అందని వ్యూహాలతో దూకుడుగ వెళ్తున్నారు. టార్గెట్ 2024 (Target 2024)లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే కేబినెట్ ప్రక్షాళణ చేశారు.. ఎన్నికల టీంను రెడీ చేసుకున్నారు. తాను పార్టీపై ఫోకస్ చేస్తూ.. పాలన చూసుకునే విధంగా సీనియర్లను కేబినెట్ లో కొనసాగించారు. అంత్యత నమ్మకస్తులు.. వీర విధేయులకు కూడా మంత్రి పదవులు ఇవ్వకుండా.. వారికి పార్టీ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా ఉండేలా..? కేబినెట్ కూర్ప అయినా.. నామినేటెడ్ పోస్టు అయినా.. ఇతర పదవులు అయినా.. అన్నింటినీ సామాజిక వర్గాల లెక్కలు తప్పడం లేదు.. అచ్చం సోషల్ ఇంజనీరింగ్ ను ఫాలో అవుతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వంలో కేబినెట్ ప్రక్షాళన తో మార్పులు ప్రారంభించిన సీఎం జగన్ (CM Jagan).. మరో కొత్త నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.
గతంలో పని చేసిన తొలి కేబినెట్ మంత్రులకు ఇన్ ఛార్జ్ మంత్రులుగా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. చాలాకాలంగా రాష్ట్రంలో జిల్లా మంత్రుల కంటే.. పాలనా పరమైన నిర్ణయాల్లో ఇన్‌ఛార్జ్ మంత్రులదే కీలక భూమిక పోషించేవారు. పార్టీ ఏదైనా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సొంత జిల్లా నేతలు కాకుండా.. ఇతర మంత్రులకు ఆ జిల్లా బాధ్యతలు అప్పచెబుతూ వస్తున్నారు. మొన్నటి వరకు వైసీపీ (YCP) తరపున కూడా మంత్రులు జిల్లా బాధ్యతలు చూసేవారు. అయితే ఇటీవల కేబినెట్ వన్ లో ఉన్న 24 మంది మంత్రులు మూకుమ్మడి రాజీనామాలు చేయడం.. దానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో.. వారికి ఉన్న హోదా సైతం పోయింది.
ఇక జగన్ రెండో కేబినెట్ కొలువు తీరింది. ఆ వెంటనే మంత్రులకు ప్రమాణ స్వీకారం చేయడం.. ఆ వెంటనే బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగింది. ఈ కొత్త మంత్రులకు.. ఇన్‌ఛార్జ్ మంత్రులుగా ఏ జిల్లా కు బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత మంత్రులు అంతా.. ఏ జిల్లా వారు.. ఆ జిల్లాకే పరిమితం కానున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఇక ఎన్నికలకు సిద్ధం కమ్మని ఇప్పటికే నేతలకు జగన్ ఆదేశాలు ఇచ్చారు.. నేతలంతా గడపగడపకూ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
మంత్రులు అంతా తమ శాఖల వ్యవహారాలు చూసుకోవడంతో పాటు.. సొంత జిల్లాల బాధ్యత కూడా అప్పచెపుతారని సమాచారం. ఎక్కడైతే వర్గ పోరు ఉంది అనుకుంటారో ఆయా జిల్లాలపై సీఎం స్వయంగా చూసుకోనున్నారు. కొన్ని జిల్లాలు మినహా.. మిగిలిన జిల్లాల్లో మాజీ మంత్రులు.. మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారికి ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త పోస్టులు సిద్దం అవుతున్నట్టు వైసీపీ వర్గాల ప్రచారం.. వారికి జిల్లా అభివృద్ధి బోర్డులు ఏర్పాటుచేసి, వాటికి చైర్మన్లుగా నియమిస్తానని చెప్పిన సీఎం.. ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు ఉన్నారు. కేబినెట్ హోదా కల్పిస్తే ముందుగా న్యాయ పరమైన సమస్యలు.. అదే విధంగా జిల్లాలో మంత్రులు- డీడీఏ ఛైర్మన్ల మధ్య ప్రోటోకాల్ అంశాల పైన ఎదురయ్యే సమస్యల పైన ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
అక్కడ వారి ఆదేశాలే కీలకం కానున్నాయి. కానీ, ఇప్పుడు జిల్లా అభివృద్ధి మండళ్ల ఏర్పాటుతో అధికార విభజన ఏ విధంగా ఉంటుంది. మంత్రి హోదాలో తీసుకోవాల్సిన నిర్ణయాలు... జిల్లా అభివృద్ధి మండళ్ల ఛైర్మన్లు తీసుకుంటారా..అందుకు అవకాశం ఉంటుందా.. అలా చేస్తే మంత్రుల అధికారుల్లో కోత పడినట్లవుతుందా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. కొత్త సమస్యలకు కారణం కాకుండా.. కొత్త మంత్రులు జిల్లా అభివృద్ధి మండళ్ల ఛైర్మన్లు కలిసి కట్టుగా ప్రభుత్వం - పార్టీ కోసం పని చేసేలా ఈ విధానానికి రూప కల్పన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా మంత్రి పదవుల నుంచి తప్పించిన వారిని.. మంత్రి పదువులు ఆశించి భంగపడిన వారిని జిల్లాల బాధ్యతలు అప్పగించే దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రచారం ఉంది. జిల్లా అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేసి మంత్రి పదవులు కోల్పోయిన వారిలో 9 మందికి.. ఆశావాహుల్లో 17 మందికి కొత్త జిల్లాల ఆధారంగా పదవులు ఇస్తారని తెలుస్తోంది. అది కూడా ఈ నెలాఖరులోగానే పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఇన్‌ఛార్జ్ మంత్రుల పదవుల రద్దు అంశం పైన అధ్యయనం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని పైన తుది నిర్ణయం తీసుకున్న తరువాత... ప్రభుత్వ కొత్త ఆలోచనల మేరకు నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.