హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: 9 జిల్లాల్లో పబ్లిక్ పల్స్ పై క్లారిటీ.. మరో ఎన్నికల సమరానికి సై అంటున్న సీఎం జగన్

CM Jagan: 9 జిల్లాల్లో పబ్లిక్ పల్స్ పై క్లారిటీ.. మరో ఎన్నికల సమరానికి సై అంటున్న సీఎం జగన్

ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్

ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్

CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో తన బలం.. బలహీనతలపై లెక్కలు తేల్చుకోవాలనుకుంటున్నారు సీఎం జగన్.. అందుకు ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా 9 జిల్లాల్లో పబ్లిక్ పల్స్ ఏంటి అన్నది తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరో ఎన్నికల సమరానికి తెరలేపుతున్నారు.

ఇంకా చదవండి ...

  CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) మరో సారి అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ లోపు.. తన పార్టీ బలం.. బలహీనతలపై లెక్కలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మరో ఎన్నికలకు రంగం సిద్దం చేస్తున్నారు? వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే పబ్లిక్ పల్స్ తెలుసుకొనేందుకు ఆ ఎన్నికలను వేదికగా చేసుకోవాలని జగన్ భావిస్తున్నారా.? ప్రతిపక్షాల నేతల రాష్ట్ర పర్యటనల వేళ.. మరో ఎన్నికల సమరానికి సై అంటున్నారు. దీనిలో భాగంగా పార్టీ నేతలతో సీఎం జగన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుత రాష్ట్రంలో శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలుగా ఉన్న ముగ్గురికి పదవీ కాలం రానున్న మార్చ్ 29వ తేదీతో ముగియనుంది. ముగ్గురు పట్టభద్రుల ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ముగ్గురు తొమ్మది నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రకాశం (Prakasam), నెల్లూరు (Nellore), చిత్తూరు జిల్లా (Chitoor District)ల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ అభ్యర్ది యందపల్లి శ్రీనివాసులు రెడ్డి (Srinivasula Reddy) ఉన్నారు. అనంతపురం - కడప - కర్నూలు నుంచి వైసీపీ సభ్యుడు వెన్నుపూస గోపాల రెడ్డి (Pusa Gopal Reddy) గత ఎన్నికల్లో గెలుపొందారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బీజేపీ అభ్యర్ది మాధవ్ గ్ త ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మార్చి నెలాఖరు వరకు వీరి పదవీ కాలం ఉన్నా.. మార్చి ఆరంభంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కానీ, ఈ ఎన్నికలు వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే ప్రీ ఫైనల్స్ సీఎం భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

  ఈ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. ఇప్పటికే జగన్ సిద్ధమవుతున్నారనే టాక్ ఉంది. అందుకు కారణం లేకపోలేదు. ఈ ఎన్నికలు పట్టభద్రుల ఓటర్లతో జరిగేవి.. అందుకే ఈ ఓట్లను జగన్ చాలా కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు విద్యా వంతులు - అర్బన్ ఏరియా ల్లో వైసీపీ బలహీనంగా ఉందని.. ప్రతిపక్షాలు పదే పదే ఆరోపణలు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో సై అంతే ప్రచారం ఉంది. అందుకే తన బలం ఏంటో ఈ ఎన్నికల్లో తెలుస్తుందని.. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలిస్తే.. ఆయా వర్గాలు కూడా మనతోనే ఉన్నారనే సంకేతాలు ప్రజలకు పంపించవచ్చని జగన్ అభిప్రాయపడుతున్నారు.

  ఏపీ వ్యాప్తంగా తొమ్మది ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు-ఎమ్మెల్సీలు-ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వచ్చే పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రస్తుతం సీమలోని అనంతపురం-కడప-కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ గోపాలరెడ్డి తిరిగి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన గతంలో ఉద్యోగ సంఘాల నేతగా వ్యవహరించారు.

  ఇదీ చదవండి : ఏపీ రాజకీయాల్లో లెక్కలు మారుతున్నాయా? రఘురామకు జనసేన స్నేహహస్తం.. ఇదే లెక్క

  బీజేపీ ఖాతాలో ఉన్న ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎవరిని బరిలోకి దించాలన్నదానిపై ఇంకా స్సష్టత లేదని తెలుస్తోంది. అలాగే ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు లో సైతం మాజీ ఎమ్మెల్సీని ఒకరిని బరిలోకి దించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎన్నిక ఏదైనా సీఎం జగన్ తొలి నుంచి సీరియస్ గానే తీసుకుంటారు. ఇందుకోసం మంత్రులు-పార్టీ ముఖ్యులకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. విద్యార్హత కలిగి.. పట్టభద్రులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో వారి తీర్పు వచ్చే ఎన్నికల పైన ప్రభావం చూపిస్తుందని లెక్కలు వేస్తున్నారు. అందుకే తమ బలం కడా ఏంటన్నది తెలుస్తుందని.. దాన్ని బట్టి సాధారణ ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేయొచ్చని సీఎం అంచనా వేస్తున్నారు

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp

  ఉత్తమ కథలు