CM Jagan Focus On Kuppam: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వచ్చే ఎన్నికలను.. అధికార వైసీపీ (YCP).. ప్రధాన ప్రతిక్షం తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 175కు 175 సాధించడమే లక్ష్యం అంటూ జగన్ దూకుడుగా వెళ్తుంటే.. బై బై జగన్.. వచ్చేది టీడీపేనే అనే నినాదంతో చంద్రబాబు దూసుకుపోతున్నారు. ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సొంత నియోజకవర్గం.. కంచుకోట కుప్పంపై పూర్తిగా ఫోకస్ చేశారు. వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ కోటలు బీటలు పడేలా ప్లాన్ చేస్తోంది. చంద్రబాబు కంచుకోటను మంచుకోటగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ కుప్పం నుంచే తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి డైరెక్షన్ లో యాక్షన్ ప్లాన్ కార్యరూపంలోకి వస్తోంది.
ప్రస్తుతం నియోజకవర్గాల వారిగా సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే మొదట కుప్పం నుంచే తన 2024 ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇటీవల కుప్పం నియోజకవర్గ నుంచి 60 మంది కార్యకర్తలతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు జగన్. ఆ రోజు ఇచ్చిన హామీలు.. యుద్ధ ప్రాతిపథికన అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 66 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.
ఆ మధ్య ప్రతి నియోజవకర్గానికి నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జులకు హామీ ఇచ్చిన జగన్.. ఈ నిధుల మంజూరును కుప్పం నుంచే మొదలు పెట్టారు. కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా గెలుస్తున్నా.. నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకోలేదన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది వైసీపీ. దీనిలో భాగంగానే గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసి ఎన్నికల్లో విజయం సాధించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెల్చుకుంది. ఇక అదే ఒరవడిని వచ్చే ఎన్నికల్లో కొనసాగించాలన్న పట్టుదలతో వైసీపీ నాయకత్వం ఉంది.
ఇదీ చదవండి : శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రాల సమర్పణ.. పాదాల చెంత వేడుకగా ఛత్రస్థాపనోత్సవం
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్కూళ్లు, ఆసుపత్రుల్లో నాడు నేడు అమలు, ఇళ్ల స్థలాల మంజూరు వంటివి ప్రస్తావిస్తోంది. అలాగే ప్రతి గ్రామంలోనూ సచివాలయం, విలేజ్ క్లీనిక్, ఆర్బీకే ఏర్పాటు అంశాలను వివరిస్తోంది. దీనికితోడు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించి చంద్రబాబు చేయలేని పనులను తాము చేసి చూపిస్తున్నాం అంటూ ప్రజలను తమవైపునకు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. తాజాగా మరో మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనిని ఏడాదిలోపు పూర్తి చేసి ప్రజల మనసు గెలుచుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు జగన్. ఈ నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గం పులివెందుల మాదిరిగానే చూస్తానన్న జగన్ ఆ దిశగా చర్యలు చేపట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి : రోజా 150 సినిమాల సంపాదన ఎంత..? వపన్ ఒక్క రోజు కలెక్షన్ ఎంత..
2019 ఎన్నికల్లో కుప్పం నుంచే చంద్రబాబుపై పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి ఓడిపోయారు. తర్వాత అనారోగ్యంతో మరణించారు. అప్పటినుంచి ఆయన కుమారుడు భరత్ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. భరత్ కు అన్ని విధాల అండదండలు అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు. అంతేకాదు భరత్ ను కుప్పం ప్రజలు గెలిపిస్తే.. మంత్రి పదవి కానుకగా ఇస్తానంటూ ముందుగానే ప్రకటించారు కూడా..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Chandrababu Naidu, Kuppam