హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MLC Elections: వైసీపీ ఎమ్మెల్యేలకు సెమీ ఫైనల్స్ గా ఎమ్మెల్సీ ఎన్నికలు..? సీఎం జగన్ టార్గెట్ అదేనా..?

MLC Elections: వైసీపీ ఎమ్మెల్యేలకు సెమీ ఫైనల్స్ గా ఎమ్మెల్సీ ఎన్నికలు..? సీఎం జగన్ టార్గెట్ అదేనా..?

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

MLC Elections: సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ 2024 దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారి నేరుగా పార్టీ బరిలో దిగుతోంది.. ఎన్నికలకు చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే ముగ్గురు అభ్యర్థులను వైసీపీ ఫైనల్ చేసింది.

ఇంకా చదవండి ...

  MLC Elections: సాధారణంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ  ఎన్నికలను (Graduate MLC Elections) రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోవు.. అందులో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్టీ తరపున మద్దతు మాత్రమే ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ సారి నేరుగా.. ఎన్నికల బరిలో దిగుతోంది. ఈ ఎన్నికలకు ఇంకా 9 నెలలు సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచి పోటీ చేస్తామని ప్రకటించడంతో పాటు.. మూడు చోట్ల వఅభ్యర్థులను ఫైనల్ చేసింది వైసీపీ. అయితే ఇలా వ్యూహాత్మకంగా సీఎం జగన్  మోహన్ రెడ్డి అడుగులు వేయడానికి కారణం చాలానే ఉన్నాయి అంటున్నారు. అంటే ఒకే దెబ్బకు.. రెండు పిట్టలు.. ఇది పాత లెక్క.. ఒకే దెబ్బకు అనేక పిట్టలు అన్నదే ఆయన లక్ష్యం. ఇదే అధికారపార్టీ తాజా వ్యూహంగా కనిపిస్తోంది. అందులో మొదటిది ఎమ్మెల్యేలకు.. ఇది సెమీ ఫైనల్ అవుతుందని జగన్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

  తొలిసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రేసులోకి అడుగుపెట్టి.. అభ్యర్ధులను ప్రకటించింది వైసీపీ . ఉత్తరాంధ్ర నుంచి ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్‌ను ఎంపిక చేసింది. ఆయన ఎంపిక వెనుక రెండు మూడు లక్ష్యాలకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నారు పార్టీ పెద్దలు. ఎందుకంటే వాస్తవానికి సీతంరాజు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధపడుతున్నారు. హైకమాండ్ అవకాశం కల్పిస్తుందనే ధీమాతో ఆయన నేరుగా సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో తరచూ అక్కడ కుమ్ములాటలు బయట పడుతున్నాయి.

  సీతం రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో అక్కడ వర్గపోరుకు చెక్ పెట్టినట్టు అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇది ఎమ్మెల్సీ ఎన్నికలే కావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉండదు.. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా నెగ్గితే.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సీటు దక్కించుకోవడం ఈజీ అవుతుంది కాబట్టి.. సహకరించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విశాఖ నగరంలో వైసీపీకి ఉన్న బలం.. ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత.. ఉద్యోగ, నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఆగ్రహం.. ఇలా చాలా కారణాలతో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడతాయనే ప్రచారం ఉంది.. అయితే ఆ లెక్కలు ఎంత వరకు నిజం అన్నది కూడా ఓ క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఎమ్మెల్సీగా నెగ్గితే.. ఆయా వర్గాల్లో వ్యతిరేకత లేదని.. ఉన్నా అధిగమించవచ్చనే క్లారిటీ వస్తుంది.. దానికి తోడు.. నియోజకవర్గంలో గ్రూపు వారు తగ్గుతుంది అని లెక్కలు వేసుకుంటున్నారు.

  ఇదీ చదవండి : పార్లమెంట్ లో ముఖానికి చేయి అడ్డుకున్న ఎంపీ రఘురామ.. ఎందుకో తెలుసా..?

  ఉత్తరాంధ్ర సీటును బ్రాహ్మణ సామాజికవర్గానికి కేటాయించడం ద్వారా ఉభయ తారకమైన ఆలోచన చేసిందనే చర్చ నడుస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగానే ఉంది. విద్యావంతులు, ఉద్యోగులు అధికశాతం ఉంటారు. వీరిలో మెజార్టీ ఓటర్లు వివిధ కారణాలతో బీజేపీ, టీడీపీకి దగ్గరగా ఉంటారనే అభిప్రాయం ఉంది. అలాంటి సెగ్మెంట్‌ను ఆకర్షించడం ద్వారా మరింత బలోపేతం కావాలనే ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో బ్రాహ్మణులకు ప్రాధాన్యం లేదనే అభిప్రాయం చాలాకాలంగా ఉంది. వీటన్నింటినీ ఒకేసారి పరిష్కారించేందుకే సీతంరాజును ఎంపిక చేసినట్టు విశ్లేషిస్తున్నారు.

  ఇదీ చదవండి : తప్పుకోండి.. లేదా తొలగిస్తాం.. వాలంటీర్లకు మంత్రి ధర్మాన వార్నింగ్..

  నిరుద్యోగ సమస్యను డీల్‌ చేయడం.. ఓటర్లను ఎక్కువగా నమోదు చేయించడం ఎమ్మెల్యేలకు పెద్ద టాస్కే. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కలు వేసుకుని హైకమాండ్ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్యేలదే. ఈ దిశగా వైసీపీ శాసనసభ్యులు పెద్ద కసరత్తు చేయాల్సిందే. అందుకే ఈ ఎన్నికలు బరిలో ఉండే అభ్యర్థుల కంటే ఎమ్మెల్యేలకు సెమీఫైనల్‌గా భావిస్తున్నారట. మరి.. ఈ సమస్యను వారెలా అధిగమిస్తారో.. ప్రత్యర్థులపై ఎలా పైచెయ్యి సాధిస్తారో చూడాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News

  ఉత్తమ కథలు