హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP Election Plan: ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులు.. సచివాలయ కన్వీనర్ల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే..

YCP Election Plan: ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులు.. సచివాలయ కన్వీనర్ల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే..

జగన్ ఎన్నికల ప్లాన్ ఇదే

జగన్ ఎన్నికల ప్లాన్ ఇదే

YCP Election Plan: సీఎం జగన్ మోహన్ రెడ్డి స్కెచ్ మామూలుగా లేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యర్థులకు అందని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులను నియమించాలని నిర్ణయించారు. అలాగే సామార్ధ్యం ఉన్న సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లుగా సమర్ధులైన వారిని నియమించే బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఇంకా సీఎం ఏం చెప్పారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tadepalle, India

YCP Election Plan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. పూర్తిగా ఎన్నికలపై ఫోకస్ చేశారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే అనేక వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapa Ki Government) పై సీఎం క్యాంపు కార్యాలయంలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కి పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇంఛార్జ్‌ మంత్రులు, ముఖ్య నేతలతో పాటు, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజర్యారు. ఈ సమావేశంలో నేతలకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. సూచనలు చేశారు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం ఏం చేయాలి అన్నదానిపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లుగా సమర్థులైన వారని నియమించాలి అన్నారు. నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న కార్యకర్తలను సచివాలయ కన్వీనర్లుగా నియమిస్తాం అన్నారు. ఆ తర్వాత గృహ సారథుల నియామకం జరుగుతుందన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమిస్తామన్నారు.

జనవరిలో ఆసరా మూడో దఫా చెల్లింపు జరగబోతోందన్నారు. అలాగే 6500 కోట్ల రూపాయల ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించి ఇంటింటా ప్రచారం చేస్తూ, వారికి లేఖలు అందిస్తామన్నారు. ఆ తరువాత గృహ సారథుల నియామకానికి సంబంధించి మరో దఫా వెరిఫికేషన్‌ ఉంటుందని.. ఆ ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే అని సూచించారు.

అలాగే సచివాలయాల కన్వీనర్లుగా ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చన్నారు. అయితే వారు సమర్థులై ఉండాలని.. వారికి తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ ఉండాలన్నారు. ఎక్కడా వలంటీర్లు గృహసారథులుగా ఉండకూడదన్నారు. అలాగే వారు ఆ 50 ఇళ్లకు సంబంధించిన వారై ఉండాలి అన్నారు. తప్పనిసరిగా పర్యటించాలని స్పష్టం చేశారు. జనవరి 21 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్‌ల పంపిణీ మొదలవుతుంది అన్నారు. పగలు ఆ కార్యక్రమం చేసి, సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొని ఆదేశించారు..

ఇదీ చదవండి : ఆ ఉమ్మడి జిల్లా ఎంపీలు అసెంబ్లీవైపు చూస్తున్నారా..? కారణం ఇదేనా..?

1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ. ఇక్కడ కూడా వారం రోజుల పాటు ఎమ్మెల్యేలు ఏదో ఒక మండలంలో పర్యటించాలన్నారు. దాంతో పాటు సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్దేశించిన విధంగా జరగాలని.. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం రెండు రోజులు.. రోజుకు కనీసం 6 గంటల పాటు తిరగాలన్నారు. అలా తిరగని ఎమ్మెల్యేలు.. మరోసారి ఆయా సచివాలయాలను తప్పక సందర్శించాల్సిందే అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లాలి ఆ ఇంట్లో కనిసం 5 నిమిషాలు గడిపి, వారికి ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలు వివరించాలన్నారు.

ఇదీ చదవం: ఏపీలోని మాచర్లలో వైసీపీ వర్సెస్ టీడీపీ .. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం

ఒక వేళ ఒక గ్రామంలో రెండు రోజుల్లో మొత్తం తిరగలేమనుకుంటే, మూడు, నాలుగు రోజుల టైమ్‌ తీసుకోవాలని సూచించారు. కానీ ప్రతి ఇంటికి తప్పకుండా వెళ్లాలి అన్నారు. ఎక్కడా తొందరపడకూడదు. మొక్కుబడిగా పని చేయొద్దని సలహా ఇచ్చారు. ఒక ఊరు తీసుకుంటే కచ్చితంగా పూర్తి చేయండి. లేకపోతే మీరు తమ ఇంటికి రాలేదని, వారు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉందన్నారు. వారు మనకు ఓటేయరని తెలిసినా, మీరు పోవడం మానకండన్నారు. ఎందుకంటే వారికి ఎంత మంచి చేశామన్నది మన దగ్గర రికార్డులు ఉన్నాయి. వాటిని చిరునవ్వుతో వివరిస్తే, వారి మనస్సు మారే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ప్రతి గ్రామానికి తప్పక వెళ్లాలి అన్నారు. ప్రతి ఇల్లు సందర్శించండని సూచించారు.

ఇదీ చదవం : ముగిసిన బీసీ కార్పోరేషన్ల పదవీకాలం.. ఈ రెండేళ్లలో వాటిద్వారా ఒనగూరిన లబ్ధి ఎంత..?

గ్రామాల్లో అత్యధిక ప్రభావం చూపే (హై ఇంప్యాక్ట్‌ వర్క్‌) పనులనే గుర్తించాలని.. వాటిని ఎక్కడా స్వప్రయోజనాలు ఆశించకండి. ఎవరినో సంతోషపర్చాలని కూడా ఆలోచించొద్దన్నారు. ఆ పనుల కోసం ప్రతి సచివాలయానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదన్నారు. అందువల్ల మీరు పనుల ప్రాధాన్యతను గుర్తించి, అక్కడికక్కడే ప్రతిపాదనలతో అప్‌లోడ్‌ చేస్తే, వెంటనే ఆమోదించడం జరుగుతుందన్నారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మీ మీద ప్రేమ ఎక్కువ కాబట్టే అన్నారు. మీలో ఎవ్వర్నీ పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదన్నారు. అందుకే మీ అందరినీ మళ్లీ చట్టసభలో చూడాలన్నారు. అదే తన కోరిక అన్నారు.

ఇదీ చదవం : జనసేనలో చేరుందుకు డేట్ ఫిక్స్ అయ్యిందా? కన్నా లెక్కలు ఏంటి? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?

ఎన్నికలకు ఇంకా 16 నెలలే.. 

మనకు ఎన్నికలకు ఇంకా 16 నెలల టైమ్‌ మాత్రమే ఉంది. కాబట్టి, ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, ఆ ఇంటికి చేసిన మంచిని వివరించి, వారి ఆశీర్వాదం కోరండి. అప్పుడే వారి నుంచి మనకు సానుభూతి లభిస్తుందన్నారు. ఎందుకంటే, ఎన్నికల ముందు మీకు అంత సమయం ఉండదన్నారు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండని సూచించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఎందుకు చేస్తున్నామనేది దయచేసి ఆలోచన చేయండిన కోరారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News, Ycp

ఉత్తమ కథలు