హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: ప్రతి ఎమ్మెల్యేకు కోట్ల నిధులు.. అలిగినా.. బాధపడ్డా వారికే ఈ సారి టికెట్లు.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

CM Jagan: ప్రతి ఎమ్మెల్యేకు కోట్ల నిధులు.. అలిగినా.. బాధపడ్డా వారికే ఈ సారి టికెట్లు.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్

ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్

CM Jagan: ఎమ్మెల్యేలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు.. అలాగే వార్నింగ్ కూడా ఇచ్చారు. తనపై అలిగినా.. బాధ పడ్డా.. తాను మాత్రం టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదు అన్నారు. అలాగే 87 శాతం మందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.. గడప గడపకు ఎవరు వెళ్లలేదో.. అన్ని లెక్కలతో సహా వినిపించారు.

ఇంకా చదవండి ...

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati.

  CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అడుగులు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తున్నారు. తాజాగా గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) జరిగిన తీరుపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో.. ఎమ్మెల్యేలు ఫుల్ జోష్ లో కనిపించారు. చాలారోజుల తరువాత వైసీపీ ఎమ్మెల్యేలలో చాలా సంతోషంగా మాట్లాడారు.  విజయం మనదే అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే 87 శాతం మందికి సంక్షేమ పథ‌కాలు (Welfare Schemes) అందిస్తున్నామన్నారు. అలాగే ఇకపై నియోజకవర్గాల వారీగా ప్రతి ఎమ్మెల్యేకి రెండు కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తాను అన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో తక్షణ సమస్యల పరిష్కారం కోసం 20 లక్షల నిధులు. మంజూరు చేస్తున్నామన్నారు. సచివాలయం విజిట్‌ పూర్తయిన వెంటనే కలెక్టర్లు ఆయా నియోజకవర్గాలకు నిధులిస్తారని సీఎం ప్రకటించారు. ఇప్పటి వరకు గడప గడపకు అసలు తిరగని ఎమ్మెల్యేల‌ పేర్లు చదివి ఆయన వినిపించారు. అలాగే 58 రోజులలో 10 రోజుల కంటే తక్కువగా తిరిగిన ఎమ్మెల్యేల‌ పేర్లు కూడా వినిపించారు.

  ఇలా ఎమ్మెల్యేలు అందరికీ గుడ్ న్యూస్ చెబుతూనే.. ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

  ఎమ్మెల్యేలు తనపై అలిగినా .. బాధ పడ్డా.. తాను పట్టించుకోనని.. కేవలం వచ్చే ఎన్నికల్లో గెలిచే వారికే టిక్కెట్లు ఇస్తాను అన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి అని సూచించారు.

  రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలలంతా ఈ గడప గడపకూ ప్రభుత్వాన్ని చాలా ముఖ్యంగా భావించాలన్నారు. ఎందుకంటే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో నాణ్యత చాలా ముఖ్యం అని అభిప్రాయపడ్డారు. జీవితంలో ఏ కార్యక్రమమైనా.. నాణ్యతతో చేస్తేనే నిలదొక్కుకుంటామని నేతలకు గుర్తు చేశారు. అందుకే క్వాలిటీతో కార్యక్రమాలు చేయడం చాలా ముఖ్యమన్నారు. అందరు నేతలూ ఈ గడపగడపకూ కార్యక్రమాన్ని కూడా నాణ్యతతో చేయండి అని సూచించారు.

  ఇదీ చదవండి : రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు.. బాలయ్య ఎందుకు రాలేదంటే..?

  ఇప్పటికే పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నామన్నారు. అనేక పథకాలను అమలు చేశామని.. అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మనమీద ఆధారపడి ఉన్నాయని గుర్తుంచుకోవాలి అన్నారు. అధికారంలోకి మామూలుగా రావడం ముఖ్యం కాదని.. మునుపటికన్నా మెరుగైన ఫలితాలతో రావడమే లక్ష్యంగా పని చేయాలి అన్నారు. చంద్రబాబు నాయుడు సొంతదైన కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, మున్సిపల్‌ న్నికల్లో అద్భుత ఫలితాలు సాధించాం.. అలాంటప్పుడు మనం అనుకున్న ఫలితాలు ఎందుకు సాధించలేం అని ప్రశ్నించారు. పార్టీ శ్రేణులంతా సహకరించుకుని పని చేస్తే.. 175కి 175 స్థానాలో ఎందుకు గెలవలేమా అంటూ.. నేతల్లో ధైర్యం నింపారు.

  ఇదీ చదవండి : చేతిపంపు నుంచి ఆగకుండా వస్తున్న నీరు.. ఎందుకో తెలుసా..? ఎక్కడంటే..?

  తాను చేయాల్సింది అంతా చేస్తున్నాను అన్నారు.. అయితే ఎమ్మెల్యేలు కూడా కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా, అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందిస్తున్నామన్నారు. ప్రతినెలా క్యాలెండర్‌ ఇచ్చి.. ఎలాంటి పరిస్థితులు ఉన్నా పథకాలకు బటన్‌ నొక్కుతున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ మంచి చేయడాన్ని తన ధర్మంగా.. కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తున్నాను అన్నారు. దీనివల్ల ఒక వాతావరణం, ఒక ఫ్లాట్‌ఫాం క్రియేట్‌ అయ్యింది అన్నారు. ఇద్దరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతామన్నారు సీఎం జగన్.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp

  ఉత్తమ కథలు